Begin typing your search above and press return to search.

అక్కడ బంఫర్‌ ఆఫర్‌.. ప్రతి ఇంట్లో మూడు గంజాయి మొక్కలు పెంచుకోవచ్చు!

దీంతో గంజాయి వినియోగంపై స్వేచ్ఛాయుత విధానాలు అవలంబిస్తున్న యూరప్‌ దేశాల సరసన జర్మనీ కూడా చేరినట్టయింది.

By:  Tupaki Desk   |   24 Feb 2024 12:30 PM GMT
అక్కడ బంఫర్‌ ఆఫర్‌.. ప్రతి ఇంట్లో మూడు గంజాయి మొక్కలు పెంచుకోవచ్చు!
X

మనదేశంలో గంజాయిని మత్తు పదార్థాల్లో (డ్రగ్స్‌)లో ఒకటిగా చూస్తున్నారు. గంజాయిని సాగు చేసినా, విక్రయించినా, కొనుగోలు చేసినా, వినియోగించినా కఠిన జైలుశిక్షలు, జరిమానాలు తప్పవు. తాజాగా గంజాయి వాడుతున్నాడని ప్రముఖ యూట్యూబర్, బిగ్‌ బాస్‌ ఫేమ్‌ షణ్ముఖ్‌ జశ్వంత్‌ ను పోలీసులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. గంజాయి నిరోధానికి ప్రత్యేకంగా టాస్క్‌ ఫోర్సులు, పోలీస్‌ వ్యవస్థ ఉన్నప్పటికీ ఈ డ్రగ్‌ రవాణాకు అడ్డుకట్ట పడటం లేదు.

మనదేశంలో పరిస్థితి ఇలా ఉంటే అభివృద్ధి చెందిన దేశాల్లో ఒకటైన జర్మనీలో మాత్రం గంజాయిని సాగు చేసుకోవడంతోపాటు అమ్ముకోవడానికి కూడా అవకాశం ఉంది. ఈ మేరకు తాజాగా జర్మనీ గంజాయి సాగు, విక్రయాలకు సంబంధించి ఆమోదం తెలిపింది.

దీంతో గంజాయి వినియోగంపై స్వేచ్ఛాయుత విధానాలు అవలంబిస్తున్న యూరప్‌ దేశాల సరసన జర్మనీ కూడా చేరినట్టయింది. ప్రతిపక్ష పార్టీలు, వైద్య సంఘాల నుంచి తీవ్ర వ్యతిరేకత వచ్చినప్పటికీ గంజాయి నియంత్రిత సాగు, పరిమిత వ్యక్తిగత వినియోగానికి జర్మనీ ఆమోదం తెలుపుతూ నిర్ణయం తీసుకుంది.

ఈ మేరకు వ్యక్తిగత వినియోగం కోసం గంజాయిని పరిమితంగా కలిగి ఉండటం, పరిమితంగా సాగును చట్టబద్ధం చేస్తూ తెచ్చిన బిల్లుకు జర్మనీ పార్లమెంట్‌ ఆమోదం తెలిపింది.

తాజా చట్టం ప్రకారం నియంత్రిత విధానంలో గంజాయి సాగు చేసే వారి దగ్గర నుంచి రోజుకు 25 గ్రాములు కొనుగోలు చేయొచ్చు. దీన్ని వ్యక్తిగత వినియోగానికి వాడుకోవచ్చు. అంతేకాకుండా ప్రతి ఇంట్లో మూడు గంజాయి మొక్కలను కూడా పెంచుకోవచ్చు.

ఈ బిల్లును పార్లమెంట్‌ లో ప్రవేశపెట్టిన సందర్భంగా జర్మనీ ఆరోగ్యశాఖ మంత్రి కార్ల్‌ లాటర్బాక్‌ హాట్‌ కామెంట్స్‌ చేశారు. ప్రస్తుతం జర్మనీలో ఉన్న పరిస్థితిలో ఈ చట్టానికి ఆమోదం తెలపడం మనందరికీ ఎంతైనా అవసరమని తెలిపారు. దేశంలో పెద్ద సంఖ్యలో యువత బ్లాక్‌ మార్కెట్‌ లో కొని గంజాయిని సేవిస్తోంది అని ఆయన గుర్తు చేశారు. దీన్ని నివారించడానికే తాజా బిల్లును తెచ్చామని తెలిపారు. ఈ బిల్లును పార్లమెంటు ఆమోదించడంతో జర్మనీలోని యువత హర్షం వ్యక్తం చేస్తోందన్నారు.