Begin typing your search above and press return to search.

అసలు 20, వడ్డీ పాతిక... రూ.45కోట్లకు జీవన్ రెడ్డికి నోటీసులు!

ఆర్మూర్‌ బీఆరెస్స్ మాజీ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్‌ రెడ్డికి ఆర్టీసీ, ట్రాన్స్‌ కో అధికారులు ఏకకాలంలో బకాయిల వసూలుకు చర్యలు ప్రారంభిస్తూ షాక్‌ ఇచ్చిన సంగతి తెలిసిందే.

By:  Tupaki Desk   |   12 Dec 2023 7:33 AM GMT
అసలు 20, వడ్డీ పాతిక... రూ.45కోట్లకు జీవన్  రెడ్డికి నోటీసులు!
X

ఆర్మూర్‌ బీఆరెస్స్ మాజీ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్‌ రెడ్డికి ఆర్టీసీ, ట్రాన్స్‌ కో అధికారులు ఏకకాలంలో బకాయిల వసూలుకు చర్యలు ప్రారంభిస్తూ షాక్‌ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇదే క్రమమో తాజాగా మరో షాక్‌ తగిలింది. ఇందులో భాగంగా తమ వద్ద తీసుకున్న రూ.20 కోట్ల రుణం వడ్డీతోకలిపి మొత్తం కలిపి రూ. 45 కోట్లు చెల్లించాలంటూ స్టేట్‌ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ అధికారులు నోటీసులు జారీ చేశారు

అవును... ఆర్మూర్ బీఆరెస్స్ మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డికి అధికారులు గ్యాప్ ఇవ్వడలేదు! ఈ క్రమంలో తాజాగా ఆయన ఇంటికి స్టేట్‌ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ అధికారులు నోటీసులు అంటించారు. అసలు రూ. 20 కోట్లు, వడ్డీ రూ. 25కోట్లు చెల్లించాలని ఆ నొటీసుల్లో కోరారు. దీంతో ఏమిటి లోన్, ఎవరి పేరున తీసుకున్నారు, ఎప్పుడు తీసుకున్నారు, ఇంతకాలం ఎందుకు చెల్లించకున్నారు.. మొదలైన ప్రశ్నలు తెరపైకి వస్తున్నాయి.

వివరాళ్లోకి వెళ్తే... స్టేట్‌ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ నుంచి మాజీ ఎమ్మెల్యే జీవన్‌ రెడ్డి రూ.20కోట్లు రుణం తీసుకున్నారు. 2017లో ఆయన సతీమణి రజిత రెడ్డి పేరున జీవన్‌ రెడ్డి ఈలోన్‌ తీసుకున్నారని తెలుస్తుంది. అయితే నాటి నుంచి నేటి వరకు వడ్డీలు డబ్బు కూడా చెల్లించలేదని అంటున్నారు. ఫలితంగా అసలు ప్లస్‌ వడ్డీ కలిసి రూ.45 కోట్ల బకాయి ఉందని అధికారులు తెలిపారు.

ఈ క్రమంలో తాజాగా ఆయన ఇంటికి వెళ్లిన అధికారులు నోటీసులు అంటించారు. దీంతో ఇంటికి నోటీసులు అంటించిన అంశం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. అయితే జీవన్ రెడ్డి మాత్రం ఈ విషయంపై ఇంకా స్పందించలేదు!

కాగా... జీవన్‌ రెడ్డికి ఆర్టీసీ, ట్రాన్స్‌ కో అధికారులు ఏకకాలంలో బకాయిల వసూలుకు చర్యలు ప్రారంభిస్తూ ఇప్పటికే నోటీసులు ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా... ఆర్మూర్‌ పట్టణంలోని జీవన్‌ రెడ్డి సతీమణి రజితరెడ్డి తాను మేనేజింగ్‌ డైరెక్టర్‌ గా ఉన్న విష్ణుజిత్‌ ఇన్‌ ఫ్ట్రా డెవలపర్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ పేరిట టీఎస్‌ ఆర్టీసీ స్థలాన్ని లీజ్‌ కు తీసుకుని మాల్‌ అండ్‌ మల్టిప్లెక్స్‌ పేరిట ఐదు అంతస్తుల భారీ షాపింగ్‌ మాల్‌ నిర్మించారు.

ఈ క్రమంలో గతేడాది ప్రారంభించిన ఈ మాల్‌ లో రిలయన్స్‌ ట్రెండ్స్, రిలయన్స్ ఎలక్ట్రానిక్స్, రిలయన్స్ స్మార్ట్, కేఎఫ్‌సీ, పీవీఆర్‌ సినిమా హాళ్లకు అద్దెకు ఇచ్చారు. ఈ సమయంలో స్థలం తరుపున ఆర్టీసీకి చెల్లించాల్సిన అద్దె రూ. 7,23,71,807, విద్యుత్‌ కు సంబంధించి ట్రాన్స్‌ కోకు రూ. 2,57,20,002 బకాయిలుగా పేరుకుపోయాయని.. వాటిని వెంటనే చెల్లించాలని నోటీసులు ఇచ్చిన సంగతి తెలిసిందే!

దీంతో మొన్నటి వరకు జీవన్‌ రెడ్డి అధికార పార్టీ ఎమ్మెల్యే కావడంతో ఈ మాల్‌ అద్దె బకాయిలు వసూలు చేయడంలో ఆర్టీసీ, ట్రాన్స్‌ కో అధికారులు నిర్లక్ష్యం వహించారనే కామెంట్లు వినిపిస్తున్నాయి. అయితే తాజాగా ప్రభుత్వం మారడంతో దూకుడు పెంచిన అధికారులు వెంటనే నోటీసులు జారీచేశారని తెలుస్తుంది!