Begin typing your search above and press return to search.

జేడీకి ఇప్పుడుందా అస‌లు ఆట‌...!

సీబీఐ మాజీ జాయింట్ డైరెక్ట‌ర్‌... కాపు సామాజిక వ‌ర్గానికి చెందిన వీవీ ల‌క్ష్మీనారాయ‌ణ తాజాగా `జై భార‌త్ నేష‌న‌ల్ పార్టీ`ని ప్ర‌క‌టించారు.

By:  Tupaki Desk   |   23 Dec 2023 12:30 PM GMT
జేడీకి ఇప్పుడుందా అస‌లు ఆట‌...!
X

సీబీఐ మాజీ జాయింట్ డైరెక్ట‌ర్‌... కాపు సామాజిక వ‌ర్గానికి చెందిన వీవీ ల‌క్ష్మీనారాయ‌ణ తాజాగా `జై భార‌త్ నేష‌న‌ల్ పార్టీ`ని ప్ర‌క‌టించారు. సామాజిక మార్పు.. నీతి, నిజాయితీతో కూడిన పాల‌న అంటూ.. ఆయ‌న ప్ర‌సంగం ప్రారంభించారు. ఇటు వైసీపీని, అటు టీడీపీని అదే స‌మ‌యంలో కేంద్రంలోని మోడీ స‌ర్కారును కూడా.. ప‌రోక్షంగా విమ‌ర్శ‌లు గుప్పించారు. అంతే కాదు..వ చ్చే ఎన్నిక‌ల్లో అన్ని నియోజ‌క‌వ‌ర్గాల్లోనూ పోటీ చేస్తామ‌ని కూడా చెప్పుకొచ్చారు.

ఇది బాగానే ఉంది. ప్ర‌క‌ట‌న‌ ల వ‌ర‌కు అంతా సేఫ్‌ గానే ఉంటుంది. క‌వ‌ర్ చేసే మీడియా కూడా కొత్త కాబట్టి.. కొంత వ‌ర‌కు ప్రాధాన్యం ఇస్తుంది. అయితే.. అస‌లు వాస్త‌వం ఏంటనే ది త్వ‌ర‌లోనే జేడీ కి తెలుస్తుంద ని అంటున్నారు ప‌రిశీల‌కులు. ఎందుకంటే.. ఇప్ప‌టి వ‌ర‌కు జేడీ అంటే.. సౌమ్యుడు, ఉన్న‌త విద్యావం తుడు.. మాజీ ఐపీఎస్‌.. అనే ఫీల్ గుడ్ థింకింగ్ ఉంది. అంతేకాదు.. ఆయ‌న త‌మ పార్టీలో చేర‌తారంటే.. త‌మ పార్టీలో చేర‌తారంటూ.. ప్ర‌ధాన పార్టీలు కూడా ఆశ‌లు పెట్టుకున్నాయి.

కానీ, ఇంత‌లో నే ఆయ‌న సొంత పార్టీ పెట్టుకున్నారు. ఇది పెట్టుకున్న పార్టీ కాదు.. ప్ర‌జ‌ల నుంచి పుట్టిన పార్టీ అంటూ.. ప్ర‌చారం కూడా చేసుకున్నారు. అయితే.. అస‌లు సీన్ ఇక్క‌డే ఉంద‌ని అంటున్నారు ప‌రిశీ ల‌కులు. ఇప్ప‌టి వ‌ర‌కు జేడీ ఒక్క‌రే. కానీ, ఇప్పుడు ఆయ‌న‌ కు ఒక పార్టీ ఉన్న నేప‌థ్యంలో ఆయ‌న కార్న‌ర్ కావ‌డం ఖాయ‌మ‌నేది ప‌రిశీల‌కుల మాట‌. అందునా కాపుల ఓట్లు చీల్చే అవ‌కాశం ఉంద‌ని లెక్క‌లు కూడా వ‌స్తున్నాయి.

ఈ నేప‌థ్యంలో మునుప‌టి మాదిరిగా జేడీ రాజ‌కీయం ఉండ‌బోద‌ని చెబుతున్నారు. ప్ర‌ధాన మీడియా ఇప్ప టి వ‌ర‌కు ఆయ‌న‌ పై ఉన్న సానుభూతి కావొచ్చు.. మ‌రొక‌టి కావచ్చు.. ఆయ‌న‌కు ప్రాధాన్యం ఇస్తున్నాయి. కానీ, ఇప్పుడు ఆయ‌న ఒక‌ లైన్ తీసుకున్నాక‌.. స‌ద‌రు మీడియా ఆయ‌న‌ను ప‌క్క‌న పెట్టేయ‌డం ఖాయం. ఇక‌, వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఆయ‌న‌ కు అనుకూలంగా ఉన్న ఓ వ‌ర్గం మేధావులు కూడా దూరం కావొచ్చ‌నే అంచ‌నాలు వ‌స్తున్నాయి. మొత్తం గా చూస్తే.. ఇప్ప‌టి వ‌ర‌కు జేడీ వేరు.. ఇక‌, పార్టీ అధినేత‌ గా జేడీ వేరు! అనే కామెంట్లు వినిపిస్తున్నాయి. ఆయ‌నకు ఎదురీత‌లు త‌ప్ప‌వ‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.