Begin typing your search above and press return to search.

జేడీ వారి మేనిఫెస్టో

రైతుల‌కు ఏటా 10వేల రూపాయ‌ల చొప్పున ఆర్థిక సాయం, ఏటా నిరుద్యోగుల‌కు జాబ్ క్యాలెండ‌ర్‌విడుద‌ల చేయ‌నున్న‌ట్టు ప్ర‌క‌టించారు

By:  Tupaki Desk   |   25 Jan 2024 9:38 AM GMT
జేడీ వారి మేనిఫెస్టో
X

సీబీఐ మాజీ జాయింట్ డైర‌క్ట‌ర్‌.. ల‌క్ష్మీనారాయ‌ణ ప్రారంభించిన జై భార‌త్ నేష‌న‌ల్ పార్టీ వ‌చ్చే ఎన్నిక‌ల్లో 175 అసెంబ్లీ స్థానాల్లోనూ పోటీ చేయ‌నున్న‌ట్టు మ‌రోసారి ఆయ‌న స్ప‌ష్టం చేశారు. తాజాగా వ‌చ్చే ఎన్నిక‌ల్లో తాము పోటీ చేస్తే.. అమ‌లు చేసే ప‌థ‌కాల‌కు సంబంధించిన మేనిఫెస్టోను ల‌క్ష్మీనారాయ‌ణ విడుద‌ల చేశారు. రైతుల‌కు ఏటా 10వేల రూపాయ‌ల చొప్పున ఆర్థిక సాయం, ఏటా నిరుద్యోగుల‌కు జాబ్ క్యాలెండ‌ర్‌విడుద‌ల చేయ‌నున్న‌ట్టు ప్ర‌క‌టించారు.

మిగిలిన హామీల్లో కీల‌క‌మైనవి ఇవీ..

+ ప్రతి కుటుంబానికి ఉపాధి

+ ప్రతి పంచాయితీకి 10 చిన్న, మధ్య తరహా పరిశ్రమలు

+ ప్రతి నియోజకవర్గానికి ఒక భారీ పరిశ్రమ

+ కొత్తగా పట్టణ ఉపాధి హామీ పధకం అమలు

+ ఏటా జాబ్ నోటిఫికేషన్లు

జనవరి 26- గ్రూప్-1; ఆగస్టు 15- గ్రూప్- 2+ సెప్టెంబర్ 5- డిఎస్సీ; అక్టోబర్ 31 - ఎస్సై/కానిస్టేబుల్

+ నాణ్యమైన రోడ్ల నిర్మాణం. కొత్త విమానాశ్రయాల ఏర్పాటు.

+ మహిళల చేతుల్లో మద్యపాన నిషేధం

+ ప్రతి గ్రామ పంచాయితీకి సంవత్సరానికి 1 కోటి గ్రాంట్.

+ నియోజకవర్గ అభివృద్ధికి 100కోట్ల కేటాయింపు

+ ప్రతి ఒక్కరికీ 10లక్షల జీవిత భీమా.

+ ప్రతి ఇంటికి సబ్సిడీపై సోలార్ విద్యుత్

+ సొంత ఇంటి నిర్మాణానికి ఉచితంగా ఇసుక, కంకర నిర్మాణ స్థలం వద్దకే సరఫరా.

+ ఉద్యోగులకు ఆటోమేటిక్ ప్రమోషన్ విధానం,

+ పారిశుధ్య కార్మికులకు జీతాల పెంపు, గ్రాట్యుటీ, విశేష వేతన సౌకర్యం.

+ పట్టణానికి 50 ఎకరాల డంపింగ్ యార్డు, వ్యర్థాల నుంచి సంపద సృష్టి; మురుగునీటి శుద్ధి ప్లాంట్.

+ చిన్న, మధ్య తరహా పరిశ్రమల ఏర్పాటు కోసం రూ.1,000 కోట్లతో యూత్ ఫైనాన్షియల్ కార్పొరేషన్; స్వయం ఉపాధి కల్పన, స్టార్టప్ లను ప్రోత్సహించడం.

+ డ్వాక్రా సంఘాల కార్పొరేషన్, నెలవారీ మేళాలు. మహిళలను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దాడానికి ప్రత్యేక రాయితీలు.

+ విద్యార్ధులకు, వృద్ధులకు, దివ్యాంగులకు, గర్భిణీలకు RTC బస్ లో ఉచిత ప్రయాణం.

+ భూకబ్జాదారులపై ఉక్కుపాదం

+ విద్యుత్ స్లాబ్లు మరియు రేట్ల తగ్గింపు

+ ఆడబిడ్డలకు ఆస్తిగా టేకు, ఎర్ర చందనం చెట్లు

+ ప్రతి ఇంటికీ ఉచిత వాటర్ ప్యూరిఫయర్.

+ కర్నూలు, విశాఖపట్నంలో అసెంబ్లీ సమావేశాలు, హైకోర్టు బెంచ్ ఏర్పాటుకు ప్రయత్నం

+ కొత్త పరిశ్రమలకు, మూడేళ్ళ టాక్స్ హాలిడే సదుపాయంతో జీరో కాస్ట్ ఎంట్రీ.

+ దివ్యాంగులకు స్వయం ఉపాధి కోసం రూ.10 లక్షల వరకు పూచీకత్తు మరియు వడ్డీ లేని రుణాలు, ఎలక్ట్రిక్ వాహనాల కొనుగోలుకు రాయితీలు.