Begin typing your search above and press return to search.

ట్రంప్ కు తగ్గోడే.. జేడీ వాన్స్ తాజా మాటలు విన్నారా?

అదే సమయంలో తోటి అరబ్ దేశాలతో.. తాము అమెరికాను మాత్రమే వ్యతిరేకిస్తామని చెబుతూ.. దాడులకు పాల్పడటం ద్వారా అగ్రరాజ్యం మీద పరోక్షంగా ఒత్తిడి తెస్తోంది.

By:  Garuda Media   |   2 April 2026 9:40 AM IST
ట్రంప్ కు తగ్గోడే.. జేడీ వాన్స్ తాజా మాటలు విన్నారా?
X

ట్రంప్ కు ఏ మాత్రం తీసిపోరా? అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్. ఇరాన్ తో మొదలు పెట్టిన యుద్ధం అనుకున్నట్లుగా ముందుకు వెళ్లకపోవటం.. తాము వేసుకున్న ప్లాన్ ప్రకారం నాలుగు వారాల్లో మడత పెట్టేయొచ్చన్న ప్లానింగ్ ఏ మాత్రం వర్కువుట్ కాకపోవటమే కాదు.. చూస్తుంటే.. దీర్ఘకాలం సాగుతుందన్న సంకేతాలు ఇస్తున్న వేళ.. హెచ్చరికల రంగంలోకి దిగారు అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్. అధ్యక్షుల వారు చిరాగ్గా ఉన్నారని.. ఆయన అసహనంతో ఉన్న నేపథ్యంలో ఇరాన్ వెంటనే దిగి వచ్చి తమతో ఒప్పందం చేసుకోవాలని హుకుం జారీ చేస్తున్నారు. ఒకవేళ తమతో డీల్ కుదుర్చుకోని పక్షంలో యుద్ధాన్ని మరింత తీవ్రతరం చేస్తామని.. ఇరాన్ దేశ మౌలిక సదుపాయాల మీద దాడులు తీవ్రతరం చేస్తామని వార్నింగ్ ఇచ్చారు.

ఇప్పటికే ఇరాన్ ను దారికి తెచ్చుకోవటానికి ట్రంప్ చేస్తున్న ప్రయత్నాలు ఫలించటం లేదు. దీనికి తోడు ఇరాన్ సైతం నిండా మునిగిన తర్వాత చలేమిటి? అన్నట్లుగా వ్యవహరిస్తోంది. ఇప్పటికే యుద్ధం కారణంగా తమకు జరగాల్సిన నష్టం జరిగిపోవటం.. ఇప్పటికిప్పుడు అమెరికాతో డీల్ కుదుర్చుకున్నప్పటికి జరిగే లాభం అంతంతమాత్రమే. అదే సమయంలో అమెరికా చెప్పిన వాటికి తలూపాల్సిందే. అందుకు భిన్నంగా అమెరికా మీద వివిధ మార్గాల్లో ఒత్తిడి తెచ్చేలా చేస్తే? అన్న వ్యూహాన్ని ఇరాన్ నాయకత్వం అమలు చేస్తోంది.

అందుకు తగ్గట్లే.. అమెరికన్ కంపెనీలను తాము టార్గెట్ చేస్తామని చెప్పిన ఇరాన్.. అందుకు తగ్గట్లే బెహ్రాన్ లోని అమెజాన్ సెంటర్ మీద దాడి చేసింది. ఇప్పటికే పద్దెనిమిది అమెరికా కంపెనీల పేర్లను ప్రకటించిన ఇరాన్.. వాటి మీద దాడులు చేస్తామని చెప్పటాన్ని అగ్రరాజ్యం జీర్ణించుకోలేని పరిస్థితి. ఇప్పటి వరకు జరిగిన యుద్ధాన్ని చూస్తే.. అమెరికా ఆర్మీకి తమ దేశాల్లో భూమి ఇచ్చిన వారిపై దాడి చేయటం.. అది కూడా అమెరికా ప్రాపర్టీస్ మీదే దాడి చేయటం ద్వారా తాను ఎంత క్లియర్ గా ఉన్నానన్న విషయాన్నిఇరాన్ స్పష్టం చేస్తోంది.

అదే సమయంలో తోటి అరబ్ దేశాలతో.. తాము అమెరికాను మాత్రమే వ్యతిరేకిస్తామని చెబుతూ.. దాడులకు పాల్పడటం ద్వారా అగ్రరాజ్యం మీద పరోక్షంగా ఒత్తిడి తెస్తోంది. ఇప్పుడు అమెరికాకు చెందిన దిగ్గజ కంపెనీల మీద దాడులకు పాల్పడటం ద్వారా కొర్పొరేట్ ఒత్తిడిని తెర మీదకు తెచ్చినట్లైంది. ఈ నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మాత్రమే కాదు ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ ఇరాన్ కు సీరియస్ వార్నింగ్స్ ఇస్తున్నారు. యుద్ధాన్ని ముగించి.. తర్వగా తమతో డీల్ కుదుర్చుకోవాలన్న సందేశాన్ని మధ్యవర్తుల ద్వారా అమెరికా పంపుతోంది. దీనికి ఇరాన్ మాత్రం భిన్నంగా స్పందిస్తోంది. ఓవైపు తాము దౌత్యానికి సిద్ధమే కానీ అమెరికాను తాము నమ్మడటం లేదని పేర్కొన్నారు ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చి.

అమెరికా ప్రతినిధి స్టీవ్ విట్ కాఫ్ నుంచి తమకు నేరుగా సందేశాలు అందుతున్నది నిజమే అయినా.. వాటిని అధికారిక చర్చలుగా భావించటం లేదని స్పష్టం చేయటం గమనార్హం. ఓవైపు చర్చలకు ఓకే అని చెబుతూనే మరోవైపు ఇరాన్ మీద భూతల దాడులకు పాల్పడే ధైర్యం చేయొద్దని.. ఒకవేళ అలా చేస్తే ఎదుర్కోవటానికి ఇరాన్ సిద్ధంగా ఉందని హెచ్చరిస్తున్న వైనం అమెరికాకు మింగుడుపడటం లేదు. అందుకే.. తాము చెప్పినట్లుగా ఇరాన్ వినని పక్షంలో ఆ దేశ మౌలిక సదుపాయాలు.. విద్యుత్ కేంద్రాలు.. నీటి శుద్ధిప్లాంట్ల తదితర పౌర సౌకర్యాల మీద దాడి చేస్తామని అమెరికా చెబుతోంది. అయితే.. ఈ తరహా దాడులుయుద్ధ నేరాల కిందకు వస్తాయని చెబుతున్నారు.అయినా.. ఇవాల్టి రోజున అమెరికాను.. ఆ దేశం తీసుకునే నిర్ణయాల్ని సూటిగా ప్రశ్నించే ధైర్యం ఏ దేశానికి ఉంది?