Begin typing your search above and press return to search.

జేసీ ప్రభాకర్ రెడ్డి సర్దార్ జీ గెటప్ వెనుక కత అంత ఉందా?

తాజాగా ఇచ్చిన ఒక ప్రత్యేక ఇంటర్వ్యూలో ఆయన బోలెడన్ని విషయాల్ని వెల్లడించారు.

By:  Tupaki Desk   |   31 July 2023 5:43 AM GMT
జేసీ ప్రభాకర్ రెడ్డి సర్దార్ జీ గెటప్ వెనుక కత అంత ఉందా?
X

మనసు లో ఉన్నది మాటల రూపం లో ఎడాపెడా మాట్లాడేసే నేతల్లో ఒకరు జేసీ ప్రభాకర్ రెడ్డి. వివాదాల కు కేరాఫ్ అడ్రస్ గా.. తన అడ్డాలో తన బలం ఎంతన్న విషయాన్ని ప్రదర్శించే విషయం లో తగ్గేదేలే అన్నట్లుగా వ్యవహరించటంలో ఆయన తర్వాతే. ఏపీ వ్యాప్తంగా జగన్ సర్కారు అధికారం లోకి వచ్చిన తర్వాత స్థానిక ఎన్నికల్లో విపక్ష నేత చంద్రబాబు సొంత నియోజకవర్గమైన కుప్పం సైతం చేజారగా.. జేసీ ప్రభాకర్ రెడ్డి మాత్రం తట్టుకొని నిలబడ్డారు. ఎమ్మెల్యేగా పని చేసినప్పటికీ.. మారిన పరిస్థితుల కు అనుగుణంగా తాడిపత్రి మున్సిపాల్టీకి ఛైర్మన్ బరి లోకి దిగి విజయం సాధించటం ద్వారా.. తన బలం ఏమిటో ఫ్రూవ్ చేసుకున్నారని చెప్పాలి.

అలాంటి జేసీ ప్రభాకర్ రెడ్డి గడిచిన కొంతకాలంగా గడ్డం పెంచేసి.. తలకు తెల్లటి టర్బైన్ ను కట్టేసుకొని.. సర్దార్ జీగా మారిన వైనాన్ని చూస్తున్నదే. ఎందుకిలా? దాని వెనకున్న కతేంటి? అన్న విషయాల్లోకి వెళితే.. ఆసక్తికర విషయాల్ని పంచుకున్నారు. తాజాగా ఇచ్చిన ఒక ప్రత్యేక ఇంటర్వ్యూలో ఆయన బోలెడన్ని విషయాల్ని వెల్లడించారు. చూస్తుంటే సర్దార్ జీలా ఉన్నారన్న మాటకు బదులిస్తూ.. 'సర్దార్ జీలా కాదు.. యోగి అయిపోదామనుకుంటున్నా' అంటూ బదులిచ్చిన ప్రభాకర్ రెడ్డి.. 'ఆయనేమో (సీఎం జగన్ ను ఉద్దేశించి)బస్సులు.. లారీలన్నీ లాగేశాడు.

నా వెంట్రుక కూడా పీకలేడని జగన్ అంటుంటాడు కదా. అప్పుడు నాకూ అనిపించింది. మనది కూడా ఏం పీకలేడు కదా అని. అందుకే గడ్డం పెంచేశాను. మొన్న నేను గుడికి పోతే కొందరు వచ్చి నాకు మొక్కుతున్నారు. అమ్మా.. నేను మీ ప్రభాకర్ రెడ్డిని అని చెప్పుకోవాల్సి వచ్చింది' అని చెప్పటం గమనార్హం.

తనకు షుగర్.. బీపీలు ఉన్నాయని.. కానీ నాలుగేళ్లలో నో బీపీ.. నో షుగర్. సంతోషంగా ఉన్నట్లు చెప్పారు. మొన్న శ్రీశైలం వెళ్లి వచ్చి నా భార్యతో నువ్వు కొడుకు దగ్గరకు వెళ్లిపో.. నేను ఎటైనా వెళ్లిపోతానంటే.. నేనూ నీతోనే వస్తా.. జోలె పట్టుకున్నా అంటూ చెప్పిందని చెప్పుకొచ్చారు. ఎందుకింత మార్పు అంటే.. దానికి కేతిరెడ్డి పెద్దారెడ్డి కారణమన్నారు. "నేను లేని వేళలో నా ఇంటికి వచ్చి పోయాడు. నా దగ్గర డబ్బులున్నా అవి పని చేయలే. ఏమిటి నా పరిస్థితి అనిపించింది. ఆ రోజు ఇంటికి వెళ్లే సమయానికి నాకున్న ఆలోచన ఒకటే. ఉరి వేసుకోవాలనిపించింది. లేదంటే ఊరొదిలి పారిపోవాలనిపించింది. లేదంటే కప్పం కట్టి వాడికి లొంగిపోయి బతకాలి. కానీ.. ఇంటికి వెళ్లే సమయానికి కార్యకర్తలు వచ్చారు. చివరకు పెద్దారెడ్డి కొడుకే చచ్చిపోయేవాడు. వాడిని నేనే రక్షించి పంపాను. ఆ తర్వాత నాలో చాలా మార్పు వచ్చింది. ఏదో ఇంత అన్నం తింటే చాలనే పరిస్థితి వచ్చింది. అలా అని ఎవరికి సరెండర్ అయ్యే పరిస్థితి లేదు" అని చెప్పుకొచ్చారు.