Begin typing your search above and press return to search.

జేసీల మాయ... పాలిటిక్స్ అంటే ఇంతేనా..?

అయితే, ఈ దూకుడు.. పార్టీకి ఏమాత్రం వినియోగ‌ప‌డ‌క‌పోగా.. పార్టీని న‌ష్ట‌ప‌రిచేలా ఉంద‌ని అంటున్నారు తెలుగు దేశం పార్టీ నాయ‌కులు

By:  Tupaki Desk   |   9 Nov 2023 4:36 AM GMT
జేసీల మాయ... పాలిటిక్స్ అంటే ఇంతేనా..?
X

జేసీ బ్ర‌ద‌ర్స్. ఈ మాట విన‌గానే అనంత‌రం పాలిటిక్సే గుర్తుకు వ‌స్తాయి. మాజీ ఎంపీ దివాక‌ర్ రెడ్డి, ప్ర‌స్తుత తాడిప‌త్రి మునిసిప‌ల్ చైర్మ‌న్ ప్ర‌భాక‌ర్‌రెడ్డిలు దూకుడుగా వ్య‌వ‌హ‌రిస్తార‌నేది అంద‌రికీ తెలిసిందే. అయితే, ఈ దూకుడు.. పార్టీకి ఏమాత్రం వినియోగ‌ప‌డ‌క‌పోగా.. పార్టీని న‌ష్ట‌ప‌రిచేలా ఉంద‌ని అంటున్నారు తెలుగు దేశం పార్టీ నాయ‌కులు. క్షేత్ర‌స్థాయిలో పార్టీ కోసం వారు ప‌నిచేయాల్సింది ఉంది. ముఖ్యంగా చంద్ర‌బాబుపై కేసులు న‌మోద‌య్యాక‌.. రాష్ట్రంలో టీడీపీ ఉద్య‌మాలు చేసింది.

అయితే.. అనంత‌పురం జిల్లాలో క‌నీసం ఉద్య‌మాన్ని కూడా జేసీ కుటుంబం లేవ‌నెత్తింది లేదు. చంద్ర‌బా బుకు మ‌ద్ద‌తుగా ఒక్క మాట కూడా మాట్లాడింది లేదు. రాష్ట్ర వ్యాప్తంగా ఉద్య‌మాలు, నిర‌స‌న‌లు హోరెత్తి నా జేసీలు మాత్రం ఇంటి నుంచి బ‌య‌ట‌కు రాలేదు. అదేమంటే.. కేసుల భ‌యం అంటూ.. అనుచ‌రు ల‌తో లీకులు ఇప్పించారు. కానీ, పార్టీ ప‌రంగా చూసుకుంటే.. జిల్లాలో త‌మ‌దే ఆధిపత్యం అంటూ.. ప్ర‌క‌టనలు చేస్తున్నారు. మ‌రి క‌ష్ట‌కాలంలో పార్టీని వ‌దిలేస్తారా? అనేది త‌మ్ముళ్ల ప్ర‌శ్న‌.

ఇదిలావుంటే, మాజీ మంత్రి, పుట్ట‌ప‌ర్తి మాజీ ఎమ్మెల్యే ప‌ల్లె ర‌ఘునాథ‌రెడ్డి మాత్రం.. అనేక ఒడిదుడుకులు ఎదుర్కొంటూనే నియోజ‌క‌వ‌ర్గంలో చంద్ర‌బాబు కోసం ఉద్య‌మిస్తున్నారు. కానీ, ఆయ‌న‌ను దెబ్బ‌తీసేలా జేసీ వ‌ర్గం వ్య‌వ‌హ‌రిస్తోంద‌నే వాద‌న మ‌ళ్లీ తెర‌మీదికి వ‌చ్చింది. గ‌తంలోనూ పుట్ట‌ప‌ర్తిలో కౌంట‌ర్ పాలిటిక్స్‌కు తెర‌దీసిన జేసీ వ‌ర్గం.. త‌ర్వాత‌.. నారా లోకేష్ జోక్యంతో కొంత వెన‌క్కి త‌గ్గింది. అయితే.. ఇప్పుడు మాత్రం మ‌రోసారి దూకుడుగా వ్య‌వ‌హ‌రిస్తోంది.

తాజాగా పుట్ట‌ప‌ర్తిలో జేసీ ప్ర‌భాక‌ర్‌రెడ్డి ఫొటోల‌తో కూడిన ఫ్లెక్సీలు ద‌ర్శ‌న‌మివ్వ‌డం.. పుట్ట‌ప‌ర్తి నేతకు ద‌శ‌దిశ చూపేది ఈయ‌నే అంటూ ప్ర‌చారం చేయ‌డం వంటివి క‌ల‌క‌లం రేపుతున్నాయి. దీనిపై ప‌ల్లె ర‌ఘునాథ‌రెడ్డి త్వ‌ర‌లోనే లోకేష్‌ను క‌లిసి ఫిర్యాదు చేయాల‌ని నిర్ణ‌యించుకున్నారు. మ‌రి ఏం చేస్తారో చూడాలి. ఏదేమైనా కూర్చున్న కొమ్మ‌ను న‌రుక్కునేలా జేసీ బ్ర‌ద‌ర్స్ వ్య‌వ‌హ‌రిస్తున్నార‌నే వాద‌న వినిపిస్తుండ‌డం గ‌మ‌నార్హం.