Begin typing your search above and press return to search.

జేసీ ప్రభాకర్ రెడ్డి నోట ‘రప్పా రప్పా’ మాట... సంచలన వ్యాఖ్యలు!

అవును... ఆదివారం ఉదయం నుంచి తాడిపత్రిలో ఉద్రిక్త వాతావారణం నెలకొంది. మరోసారి పెద్దారెడ్డి వర్సెస్ ప్రభాకర్ రెడ్డి వ్యవహారం తెరపైకి వచ్చింది.

By:  Tupaki Desk   |   29 Jun 2025 6:38 PM
జేసీ ప్రభాకర్ రెడ్డి నోట ‘రప్పా రప్పా’ మాట... సంచలన వ్యాఖ్యలు!
X

ఆదివారం ఉదయం నుంచి తాడిపత్రిలో మరోసారి తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొన్న సంగతి తెలిసిందే. వైసీపీ నేత, మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి తాడిపత్రిలోని తన నివాసానికి రావడం.. దీనిపై టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి ఘాటుగా రియాక్ట్ అవ్వడంతో వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. ఈ సందర్భంగా.. రప్పా రప్పా డైలాగులు తెరపైకి వచ్చాయి.

అవును... ఆదివారం ఉదయం నుంచి తాడిపత్రిలో ఉద్రిక్త వాతావారణం నెలకొంది. మరోసారి పెద్దారెడ్డి వర్సెస్ ప్రభాకర్ రెడ్డి వ్యవహారం తెరపైకి వచ్చింది. దీంతో పోలీసులు రంగప్రవేశం చేసి పెద్దారెడ్డిని బలవంతంగా తిరిగి అనంతపురానికి తరలించారు. ఈ సందర్భంగా స్పందించిన తాడిపత్రి మున్సిపల్ ఛైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.

ఇందులో భాగంగా... తమకు శత్రువు పెద్దారెడ్డి మాత్రమేనని, వైసీపీ కార్యకర్తలు కాదని అన్నారు. వైసీపీ కార్యకర్తలను ఇప్పటి వరకు తాము ఏమీ అనలేదని ఆయన స్పష్టం చేశారు. అయితే... ఇవాళ కేతిరెడ్డి పెద్దారెడ్డి తాడిపత్రి వచ్చిన వేళ ఆయన వెంట ఎవరెవరైతే వైసీపీ కార్యకర్తలు ఉన్నారో... వారి ఫోటోలు తన దగ్గర ఉన్నాయని తెలిపారు.

ఈ సందర్భంగా... పెద్దారెడ్డి వెంట వచ్చిన వైసీపీ కార్యకర్తలను మాత్రం రప్పా రప్పా ఆడిస్తామన్నారు. ఇక నుంచి తమ కార్యకర్తలు ఎలా ఉంటారో చూడాలన్నారు. రేపటి నుంచి పెద్దారెడ్డి ఇంటిదగ్గర వైసీపీ కార్యకర్తలు వుంటే మా కార్యకర్తలు రప్పా రప్పా అంటే ఎలా ఉంటుందో చూపిస్తారని జేసీ ప్రభాకర్ రెడ్డి ఘాటు హెచ్చరికలు చేశారు!

చర్యకు ప్రతిచర్య ఉంటుంది!:

మరోవైపు ఈ వ్యవహారంపై కేతిరెడ్డి పెద్దారెడ్డి స్పందించారు. ఈ సందర్భంగా.. తనను చూసి జేసీ ప్రభాకర్ రెడ్డి భయపడుతున్నారని అన్నారు. తాను తాడిపత్రిలో ఉంటే ఆయన ఆగడాలు సాగవని భావిస్తున్నారని తెలిపారు. సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ కాళ్లు పట్టుకుని జేసీ ప్రభాకర్ రెడ్డి రాజకీయ పబ్బం గడుపుకుంటున్నారని విమర్శించారు.

ఈ సందర్భంగా... ప్రతీ చర్యకూ ప్రతి చర్య ఖచ్చితంగా ఉంటుందని నొక్కి చెప్పిన పెద్దారెడ్డి... పోలీసులను అడ్డుపెట్టుకుని జేసీ ప్రభాకర్ రెడ్డి హింసా రాజకీయాలు చేస్తున్నారని ఆరోపించారు. ఇదే సమయంలో... తన ఆస్తులను జేసీ ప్రభాకర్ రెడ్డి టార్గెట్ చేశారని తెలిపారు. అన్ని డాక్యుమెంట్లు సక్రమంగా ఉన్నప్పటికీ తన ఇంటికి కొలతలు వేయించారని తెలిపారు.

అయితే... తాను మున్సిపల్ స్థలం ఆక్రమించలేదని.. కొనుగోలు చేసిన స్థలంలోనే ఇంటి నిర్మాణం చేశానని పేర్కొన్నారు. ఈ సందర్భంగా తన ఇంటికి తాను వెళితే పోలీసులకు వచ్చిన ఇబ్బంది ఏంటని ప్రశ్నించిన పెద్దారెడ్డి.. పోలీసులకు జేసీ ప్రభాకర్ రెడ్డి అనుమతి కావాలా? అని నిలదీశారు!