Begin typing your search above and press return to search.

డీపీవోపై జేసీ తిట్ల దండకం.. ఏం పీకలేవంటూ వార్నింగ్

తాడిపత్రి మున్సిపల్ చైర్మన్, టీడీపీ సీనియర్ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి తన నోటికి పనిచెప్పారు. ఏకంగా జిల్లా పంచాయతీ అధికారిపై విరుచుపడ్డారు.

By:  Tupaki Desk   |   19 July 2025 12:05 PM IST
డీపీవోపై జేసీ తిట్ల దండకం.. ఏం పీకలేవంటూ వార్నింగ్
X

తాడిపత్రి మున్సిపల్ చైర్మన్, టీడీపీ సీనియర్ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి తన నోటికి పనిచెప్పారు. ఏకంగా జిల్లా పంచాయతీ అధికారిపై విరుచుపడ్డారు. ఏం పీకలేవంటూ వార్నింగ్ ఇవ్వడంతోపాటు తోటి ప్రభుత్వ ఉద్యోగుల ముందు డీపీవోను అవమానించారు. జేసీ తిట్ల దండకంపై ఉద్యోగులు, ప్రభుత్వ అధికారులు నిరసన వ్యక్తం చేస్తున్నారు. సోషల్ మీడియాలో ఈ వీడియో వైరల్ అవుతోంది.

గురువారం ఉదయం డీపీవో నాగరాజనాయుడును కలిసేందుకు తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి అనంతపురం వచ్చారు. అయితే వీడియో కాన్ఫరెన్స్ ఉండటంతో డీపీవో మధ్యాహ్నం 12.30 నిమిషాల వరకు అందుబాటులోకి రాలేదు. ఈ విషయం తెలిసి జేసీ ప్రభాకర్ రెడ్డి డీపీవో నాగరాజనాయుడు డీపీఆర్సీ భవన్ లో ఉన్నారని అక్కడకు వెళ్లారు. కాసేపు ఆయనతో చర్చించారు. అయితే భోజన సమయం అవుతుందని జేసీ మాట్లాడుతుండగా, డీపీవో లేచి బయటకు వచ్చేశారు.

దీంతో తీవ్ర కోపోద్రిక్తుడైన మున్సిపల్ చైర్మన్ ప్రభాకర్ రెడ్డి డీపీవోపై చిందులు తొక్కారు. తాను మాట్లాడుతుండగా, లేచి వస్తావా? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. పెద్ద పెద్ద కేకలు వేస్తూ బూతులు తిట్టడంతో అక్కడ ఉన్నవారంతా అవాక్కయ్యారు. జేసీ పక్కన ఉన్న వారు డీపీవోను సర్ది చెప్పి పంపినట్లు వీడియోలో కనిపిస్తోంది. ఈ పరిణామం రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది. తన రాజకీయ ప్రత్యర్థులపై తీవ్రస్థాయిలో విరుచుకుపడే జేసీ ప్రభాకర్ రెడ్డి ప్రభుత్వ ఉద్యోగులపైనా విచక్షణ లేకుండా వ్యాఖ్యలు చేయడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.