జేసీ.. 'పవనాలు' ఎటు.. ?
అనంతపురం మాజీ ఎంపీ.. జేసీ దివాకర్ రెడ్డి వారసుడు.. యువ నాయకుడు జేసీ పవన్ కుమార్ రెడ్డి.. ఏం చేస్తున్నారు? ఎక్కడున్నారు? ఇదీ.. ఇప్పుడు చర్చకు వస్తున్న ప్రశ్న.
By: Garuda Media | 25 March 2026 5:00 AM ISTఅనంతపురం మాజీ ఎంపీ.. జేసీ దివాకర్ రెడ్డి వారసుడు.. యువ నాయకుడు జేసీ పవన్ కుమార్ రెడ్డి.. ఏం చేస్తున్నారు? ఎక్కడున్నారు? ఇదీ.. ఇప్పుడు చర్చకు వస్తున్న ప్రశ్న. ప్రస్తుతం అయితే..పవన్ కుమార్ యాక్టివ్‌గా అయితే లేరు. భవిష్యత్తు రాజకీయాలపై ఎలాంటి ప్లాన్ చేస్తున్నారో కూడా తెలియదు. కానీ.. ఆయన ప్రజల మధ్య ఉండడం ప్రారంభిస్తే.. భవిష్యత్తు ఖాయమని అంటున్నారు పరిశీలకులు.
జేసీ కుటుంబానికి.. భారీ రేంజ్‌లో పొలిటికల్ ఇమేజ్ ఉన్న విషయం తెలిసిందే. దివాకర్ రెడ్డి ఏకంగా 30 ఏళ్లపాటు తాడిపత్రిఎమ్మెల్యేగా విజయం దక్కించుకున్నారు. ఇక, 2014లో ఎంపీగా కూడా దివాకర్ రెడ్డి విజయం దక్కించుకున్నారు. ఈ పరంపరలో ఆయన అప్రకటిత రిటైర్మెంట్ తీసుకుని.. 2019లో తొలిసారి అనంతపురం ఎంపీగా ఆయన కుమారుడిని ప్రవేశ పెట్టారు. టీడీపీ కూడా అప్పట్లో పవన్ పై ఆశలు పెట్టుకుంది.
కానీ.. వైసీపీ హవా నేపథ్యంలో పవన్ 2019 ఎన్నికల్లో పరాజయం పాలయ్యారు. కానీ.. 5 లక్షల 53 వేల పైచి లుకు ఓట్లను సొంతం చేసుకున్నారు. అంటే.. ప్రజలేమీ పూర్తిగా తిరస్కరించలేదు. ఇదిలావుంటే.. గత ఎన్నికల్లో ఈక్వేషన్లు.. ఇతరత్రా అంశాలను పరిగణనలోకి తీసుకున్న చంద్రబాబు.. పవన్‌కు టికెట్ ఇవ్వలేదు. ఇక, ఆ తర్వాత నుంచి పవన్ ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉంటూ వస్తున్నారు. వాస్తవానికి యువగళం పాదయాత్ర సమయంలో పవన్ యాక్టివ్ గా కనిపించారు.
ఇక, ఇప్పుడు పరిస్థితిఏంటి? అంటే.. మౌనంగానే ఉంటున్నారు. పైగా హైదరాబాద్, బెంగళూరులకే పరి మితం అయినట్టు తెలుస్తోంది. పార్లమెంటు పరిధిలో పెద్దగా ఎక్కడా పవన్ పేరు వినిపించడం లేదు. అయితే.. ఇక్కడితో ఆయన పొలిటికల్ కెరీర్ ముగిసిపోయినట్టు కాదు. కొంత ప్రజలకు చేరువ అయ్యేందు కు.. సమస్యలను పట్టించుకునేందుకు ప్రయత్నించి.. సక్సెస్ అయితే.. జేసీ వర్గం ఓటు బ్యాంకు సహా యువ ఓటు బ్యాంకును కూడా పవన్ సొంతం చేసుకునే అవకాశం ఉంటుంది. ఇదిలావుంటే.. ఆయన వైసీపీలోకి జంప్ చేస్తారన్న చర్చ తరచుగా వినిపిస్తోంది. కానీ.. దీనిపై స్పష్టత రాలేదు.
