Begin typing your search above and press return to search.

భారత్ యూట్యూబర్లకు పాక్ తో ఇన్ని లింకులా.. తెరపైకి మరో సంచలనం!

పహల్గాం ఉగ్రదాడి, అపరేషన్ సిందూర్ అనంతరం పాకిస్థాన్ తో సంబంధం ఉన్న గూఢచర్య నెట్ వర్క్ పై అధికారులు ఉక్కుపాదం మోపుతున్న సంగతి తెలిసిందే.

By:  Tupaki Desk   |   7 Jun 2025 2:00 PM IST
భారత్ యూట్యూబర్లకు పాక్ తో ఇన్ని లింకులా.. తెరపైకి మరో సంచలనం!
X

పహల్గాం ఉగ్రదాడి, అపరేషన్ సిందూర్ అనంతరం పాకిస్థాన్ తో సంబంధం ఉన్న గూఢచర్య నెట్ వర్క్ పై అధికారులు ఉక్కుపాదం మోపుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఇప్పటికే పలువురు యూట్యూబర్ లను అధికారులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆజాగా పంజాబ్ పోలీసులు అదుపులోకి తీసుకున్న యూట్యూబర్ జస్పీర్ సింగ్ నుంచి కీలక విషయాలు రాబట్టారు.

అవును... పాకిస్థాన్ కు గూఢచర్యం కేసులో యూట్యూబర్ జస్పీర్ సింగ్ ను పంజబ్ పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో తాజాగా అధికారులు అతడిని విచారించి కీలక విషయాలు రాబట్టారు. ఇందులో భాగంగా... గూఢచర్య నెట్ వర్క్ కు సూత్రధారి అయిన పాక్ కు చెందిన మాజీ పోలీస్ అధికారి గురించి జస్పీర్ పలు విషయాలు వెల్లడించాడు!

ఈ సందర్భంగా... పాక్ కు చెందిన మాజీ సజ్ ఇనిస్పెక్టర్ నాసిర్ థిల్లాన్.. గూఢచర్య వ్యవహారాల్లో సూత్రధారిగా ఉన్నాడు. ఇతడు కూడా ప్రస్తుతం యూట్యూబ్ ఛానల్ నిర్వహిస్తూ.. ఐఎస్ఐ తో సంబంధాలు కలిగి ఉన్నాడనే ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు. ఈ సమయంలో జస్పీర్ సింగ్ ను థిల్లాన్.. ఐఎస్ఐ అధికారులకు పరిచయం చేశాడు అని అధికారులు వెల్లడించారు.

ఇదే క్రమంలో... ఇటీవల అరెస్టైన యూట్యూబర్ జ్యోతి మల్హోత్రాతో కలిసి లాహోర్ లో 10 రోజులు ఉన్నట్లు జస్పీర్ విచారణలో వెల్లడించాడని అధికారులు పేర్కొన్నారు. ఆ సమయంలోనే ఈ భారత యూట్యూబర్లను పాక్ రాయబార కార్యాలయ అధికారి డానిష్ కు థిల్లాన్ పరిచయం చేశాడు. అక్కడ ఈ భారత్ యూట్యూబర్లకు డానిష్ పాకిస్థాన్ గూఢచర్యం గురించి వివరించాడని అధికారులు తెలిపారు!

మరోపక్క.. జస్పీర్ సింగ్ కు డానిష్ తో పాటు పాకిస్థాన్ కు చెందిన మరికొంతమంది అధికారులతోనూ సంబంధాలు ఉన్నట్లు తెలుస్తోందని అంటున్నారు. ఇతడు 2020, 2021, 2024ల్లో పాక్ లో పర్యటించాడు. ఇప్పటికే పాక్ కు గూఢచర్యం చేస్తున్నారనే ఆరోపణలపై జ్యోతి మల్హోత్రాను అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఆమెతో పాటు జస్పీర్ కూడా పాక్ లో 10 రోజులు ఉన్నట్లు తేలిందని అంటున్నారు!

కాగా... సుమారు 1.1 మిలియన్స్ కు పైగా సబ్ స్క్రైబర్లతో "జాన్ మహల్" ఛానెల్ ను నిర్వహిస్తున్న జప్సీర్ సింగ్.. ఆపరేషన్ సిందూర్ అనంతరం భారతదేశంలోని పాకిస్థాన్ గూఢచారి నెట్ వర్క్ పై జరిపిన దాడుల్లో బుధవారం అరెస్ట్ చేయబడ్డాడు. విచారణలో.. అతడికి పాకిస్థాన్ అధికారులతో సంబంధాలు ఉన్నట్లు వెల్లడైందని అంటున్నారు!