Begin typing your search above and press return to search.

ముదురుతున్న జనసేన నేత వర్సెస్ వైసీపీ ఎంపీ వివాదం!

ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఏపీ రాజకీయాల్లో ఊర మాస్ డైలాగులు, మాస్ వార్నింగ్ లు పెరిగిపోతున్నాయి

By:  Tupaki Desk   |   16 Feb 2024 6:57 AM GMT
ముదురుతున్న జనసేన నేత వర్సెస్ వైసీపీ ఎంపీ వివాదం!
X

ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఏపీ రాజకీయాల్లో ఊర మాస్ డైలాగులు, మాస్ వార్నింగ్ లు పెరిగిపోతున్నాయి. ఇప్పటికే చొక్కా చేతులు మడతపెట్టాలని ఒకరంటే... అలాగైతే మావాళ్లు కుర్చీలు మడతపెడతారంటూ మరొకరు మాస్ డైలాగులు పేల్చారు. ఈ నేపథ్యంలో తాజాగా వైసీపీ ఎంపీ వర్సెస్ జనసేన నేత మధ్య డైలాగ్ వార్ ఇప్పుడు విశాఖ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది.

అవును... జనసేన నేత, ఎమ్మెల్సీ వంశీకృష్ణ యాదవ్ తాజాగా మైకులముందు ఫైరయ్యారు. ఇందులో భాగంగా విశాఖ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఏకవచనంతో సంభోదిస్తూ... తాను వైసీపీని విడటానీకి ఎంవీవీనే కారణం అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఎన్నికల్లో ఈ రాష్ట్రంలో అత్యధిక ఓట్ల తేడాతో ఓడిపోయే వ్యక్తి ఎంవీవి సత్యనారాయణ అని చెప్పిన వంశీకృష్ణ... అతడిని ఓడించడానికే తాను పార్టీ మారినట్లు తెలిపారు.

అనంతరం ఈ డోసు మరింత పెంచిన వంశీకృష్ణ... కార్పొరేషన్ ఎన్నికల్లో ఆరోజు తనపై ఉద్దేశ్యపూర్వకంగానే కుట్ర చేశారని.. తన విషయంలో అన్నీ డబుల్ గేం లు ఆడారని తెలిపారు. తన జోలికొస్తే ఇంటి నుంచి బయటకు కూడా రాలేరని వార్నింగ్ ఇచ్చే ప్రయత్నం చేశారు! ఇదే సమయంలో... తప్పుడు ఆరోపణలు, అర్ధంపర్ధం లేని విమర్శలు చేస్తే ఇంటికొచ్చి కొడతానని ఎంవీవీకి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు.

అయితే... ఎమ్మెల్సీ వంశీకృష్ణ యాదవ్ వ్యాఖ్యలను ఎంవీవీ సత్యనారాయణ సీరియస్‌ గా తీసుకున్నారు. ఇందులో భాగంగా ఈ వ్యాఖ్యలపై విశాఖ పోలీస్ స్టేషన్‌ లో ఫిర్యాదు చేశారు. తన పరువుకు భంగం కలిగించేలా ఎమ్మెల్సీ వంశీకృష్ణ వ్యాఖ్యలు చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈనేపథ్యంలో వంశీపై కౌంటర్ ఎటాక్ చేస్తున్నారు ఎంపీ. దీంతో ఎంపీ, ఎమ్మెల్సీల మధ్య వ్యక్తిగత వ్యవహారం పూర్తిస్థాయిలో ఇరు పార్టీలకు పాకేలా కనిపిస్తోందనే కామెంట్లు వినిపిస్తున్నాయి.

వాస్తవానికి ఇప్పటికే జనసేనతో ఎంవీవీకి వైరం వుంది. గతంలో పవన్ కల్యాణ్ పై వ్యక్తిగత విమర్శలు చేసినందుకు ఎంపీ ఎంవీవీని టార్గెట్ చేసింది జనసేన! ఇందులో భాగంగా విశాఖ నగరం నడిబొడ్డున సీబీసీఎన్సీ సహా ఎంవీవీ నిర్మాణ కంపెనీల్లో కొనుగోళ్లు చేయవద్దని సూచిస్తుంది. ఇదే సమయంలో... ప్రభుత్వం మారిన వెంటనే వాటిపై చట్టప్రకారం చర్యలు ఉంటాయని హెచ్చరిస్తోంది.

ఈ నేపథ్యంలో నిన్నమొన్నటివరకూ వైసీపీ పార్టీ మారిన వంశీకృష్ణ యాదవ్ కు అర్బన్ జిల్లా అధ్యక్ష బాధ్యతలు అప్పగించింది జనసేన. దీంతో... ఎంపీ, ఎమ్మెల్సీ మధ్య వివాదం మరింత వేడెక్కే సూచనలు కనిపిస్తున్నాయని అంటున్నారు!