Begin typing your search above and press return to search.

జనసేన కు వీళ్ళంతా దూరమేనా ?

అనవసరంగా వాలంటీర్లు, సచివాలయ వ్యవస్ధలో పనిచేసే ఉద్యోగుల ను గోక్కుని వాళ్ళతో పవన్ గొడవ పెట్టుకున్నారు.

By:  Tupaki Desk   |   15 July 2023 8:18 AM GMT
జనసేన కు వీళ్ళంతా దూరమేనా ?
X

వచ్చేఎన్నికల్లో జనసేన కు ఎవరు ఓట్లేస్తారనే విషయం లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. పలానా వర్గం జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు మద్దతుగా ఉందని చెప్పుకునేందుకు లేదు. చివరకు సొంత సామాజికవర్గం కాపులైనా పవన్ కు మద్దతుగా ఉంటారో లేదో చెప్పేందుకు లేకుండాపోయింది.

ఈ పరిస్ధితుల్లో వారాహియాత్ర చేస్తున్న పవన్ వాలంటీర్లు, సచివాలయ వ్యవస్ధకు వ్యతిరేకంగా తీవ్రమైన ఆరోపణలు చేస్తున్న విషయం తెలిసిందే. దీంతో వాలంటర్లు, సచివాలయ వ్యవస్ధలో పనిచేసే వాళ్ళంతా దూరమైనట్లే అనే ప్రచారం పెరిగిపోతోంది.

నిజానికి వాలంటీర్లు, సచివాలయ ఉద్యోగుల ను దూరంచేసుకోవాల్సిన అవసరం పవన్ కు లేదు. హ్యూమన్ ట్రాఫికింగు కు వాలంటీర్లే కారణమి పవన్ నిరాధారమైన ఆరోపణలు చేశారు. కేంద్రహోంశాఖ విడుదల చేసిన తాజా లెక్కల ప్రకారమే కిడ్నాపులు, అపహరణల జాబితా లో ఏపీ 18వ స్ధానంలో ఉంది.

కిడ్నాపులు, అపహరణల కు గురవుతున్న ప్రతి లక్షమంది మహిళల్లో జాతీయ సగటు 7.4 అయితే ఏపీ 1.6 మాత్రమే. అంటే హ్యూమన్ ట్రాఫికింగని, వాలంటీర్లే కారణమి పవన్ చేసిన ఆరోపణలన్నీ అబద్ధాలే అని తేలిపోయింది.

ఈ నేపధ్యం లో పవన్ చేస్తున్న ఆరోపణల కు విలువలేకుండాపోయింది. దీంతో 2.5 లక్షలమంది వాలంటీర్లతో పాటు 1.5 లక్షలమంది సచివాలయ సిబ్బంది కూడా జనసేన కు వ్యతిరేకంగానే జరిగారన్న విషయం అర్ధమవుతోంది. నాలుగు లక్షలమంది అంటే 4 లక్షల మందిగానే చూడకూడదు. వాళ్ళ కుటుంబసభ్యులు, బంధుమిత్రులు, వాళ్ళ ప్రభావితం చేయగలిగిన వాళ్ళ ఓట్లన్నింటినీ జనసేన దూరం చేసుకున్నదనే ప్రచారం పెరిగిపోతోంది. వీళ్ళల్లో జనసేన, పవన్ అభిమానులు కూడా ఉన్నారు.

అయితే హ్యూమన్ ట్రాఫికింగు కు వాలంటీర్లే కారణమన్న ఆరోపణను పవన్ అభిమానులు, కాపుయువత కూడా అంగీకరించటంలేదు. అనవసరంగా వాలంటీర్లు, సచివాలయ వ్యవస్ధలో పనిచేసే ఉద్యోగుల ను గోక్కుని వాళ్ళతో పవన్ గొడవ పెట్టుకున్నారు. ఏ వ్యవస్ధలో అయినా మంచి చెడ్డ ఉండటం సహజమే.

అంతమాత్రాన వ్యవస్ధలు మొత్తం చెడిపోయామని చెప్పలేం. ప్రభుత్వ ఉద్యోగులు, రాజకీయ నేతల్లో అవినీతిపరులు లేరా ? అసాంఘీక కార్యకలాపాల కు పాల్పడుతున్నవాళ్ళు లేరా ? అన్న వాలంటీర్ల ప్రశ్నల కు పవన్ ఏమని సమాధానం చెబుతారు ?