Begin typing your search above and press return to search.

చంద్రబాబు తెగించాల్సిందేనా...?

టీడీపీ ఒంటరిగా పోటీ చేస్తే ఓటమి ఖాయమన్న భయాలు ఉన్నాయి. ఎందుకంటే టీడీపీకి ఎంతగా గ్రాఫ్ పెరిగినా కూడా జనసేన ఓట్లు చీలిస్తే మాత్రం కచ్చితనా యాభై దాకా సీట్లలో చిల్లు పడుతుంది.

By:  Tupaki Desk   |   2 Aug 2023 5:30 PM GMT
చంద్రబాబు తెగించాల్సిందేనా...?
X

ఏపీ లో రాజకీయం 2014లా ఏ మాత్రం సాగడంలేదు అన్నది అందరి కంటే ఎక్కువగా తెలుగుదేశానికే అర్ధం అవుతోంది అంటున్నారు. ఎందుకంటే 2014లో టీడీపీకి క్యాట్ వాక్ గా అంతా ఉంది. పొత్తులు ఎత్తులు అన్నీ చంద్రబాబు చెప్పినట్లుగానే సాగిపోయాయి. ఆ ఎన్నికల్లో జనసేన పోటీ చేయకుండా పవన్ వంటి చరిష్మాటిక్ హీరో కేవలం ప్రచారం చేసి పెట్టి టీడీపీ నెత్తిన పాలు పోశారు.

అంతే కాదు ఒక బలమైన సామాజికవర్గం కూడా టీడీపీ వైపు టర్న్ అయింది. బీజేపీ పాతిక ఎమ్మెల్యే ఎనిమిది దాకా ఎంపీ సీట్లు నాడు కోరినట్లుగా ప్రచారం జరిగినా చివరికి 12 ఎమ్మెల్యే నాలుగు ఎంపీ సీట్లతో సరిపెట్టుకుంది. అలా అన్నీ సూపర్ హిట్ అయి టీడీపీ పవర్ లోకి వచ్చింది. చంద్రబాబు సీఎం అయ్యారు.

కానీ ఇది 2024. ఈసారి అలా ఏ మాత్రం ఉండదు. పవన్ కళ్యాణ్ చాలా నెలల నుంచి 2014 పొత్తులు రిపీట్ అవుతాయని చెబుతున్నారు కానీ అసలు విషయం మాత్రం వేరేగా ఉంది. నాడు జనసేన కు సీట్లు ఇవ్వాల్సిన పని లేదు. కానీ ఇపుడు జనసేన జూనియర్ పార్టనర్ కాదు, అలాగని టీడీపీ తనతో సరిసమానంగా సీట్లు ఇవ్వలేదు. ఈ రకమైన డౌట్లు ఎన్నో రెండు పార్టీల మధ్యన ఉన్నాయి.

ఈ నేపధ్యంలోనే జనసేన తన పార్టీ అభ్యర్ధుల ను ప్రకటిస్తోంది. పొత్తులు ఉన్నా వారే క్యాండిడేట్లు అని బల్ల గుద్ది మరీ చెబుతోంది. ఆయా సీట్లు టీడీపీకి కూడా బలమైన సీట్లు కావడంతో సీట్ల పితలాటకం ఒక పట్టాన తేలే అవకాశం అయితే లేనే లేదు అని అంటున్నారు. పవన్ కళ్యాణ్ తనతో టీడీపీ పొత్తు అనివార్యం అని భావిస్తున్నారు అని ప్రచారం సాగుతోంది.

మరి టీడీపీకి ఇంతకంటే ఆప్షన్ లేదా అన్నది కూడా చర్చకు వస్తోంది. టీడీపీ ఒంటరిగా పోటీ చేస్తే ఓటమి ఖాయమన్న భయాలు ఉన్నాయి. ఎందుకంటే టీడీపీకి ఎంతగా గ్రాఫ్ పెరిగినా కూడా జనసేన ఓట్లు చీలిస్తే మాత్రం కచ్చితనా యాభై దాకా సీట్లలో చిల్లు పడుతుంది. అసలే టీడీపీకి 40 సీట్లలో సరైన క్యాండిడేట్లు లేరు అని అంటారు.

ఇలా తొంబై సీట్లుపోతే ఇక మిగిలిన 85 సీట్లలో ఎంత ఊపు ఉన్నా గెలుపు అన్నది అసాధ్యం. మ్యాజిక్ ఫిగర్ అన్నది కూడా మరచిపోవచ్చు. దీంతో టీడీపీ సోలో ఫైట్ కి వెళ్లలేదు అని అంటున్నారు. అదే సమయంలో జనసేన తో కలసి వెళ్లినా గెలుపు ఆశలు ఉంటాయా అంటే పొత్తుల దగ్గర పేచీలు తేలకపోతే ఇది కూడా భారీ నష్టాన్ని చేకూర్చవచ్చు అని అంటున్నారు. ఎందుకంటే జనసేన కోరుకుంటున్న సీట్లు ఆషామాషీ ఏమీ కావు.

అవి టీడీపీ లో ఉద్ధండులు కోరుకుంటున్న సెట్లు. తమ సీట్లకే ఎసరు పెడుతూంటే టీడీపీ సీనియర్లు పోటీ చేయకుండా చూస్తూ ఊరుకోరు. వారి వత్తిడి అంతా అధినాయకత్వం మీద కచ్చితంగా పడుతుంది అని అంటున్నారు. మరో వైపు చూస్తే టీడీపీ ని పటిష్టం చేసుకుంటూ పొత్తుల విషయంలో కాస్తా లేట్ చేస్తే అప్పటికి పరిస్థితులు అనుకూలం అవుతాయని బాబు భావించినా సమయం మించి పోతోంది అని అంటున్నారు.

ఈ నేపధ్యంలో పవన్ కళ్యాణ్ నాదెండ్ల మనోహర్ ని తెనాలి సీటు కు అభ్యర్ధిగా ప్రకటించడంతో టీడీపీ లో కూడా రాజకీయ కాక పెరుగుతోంది అని అంటున్నారు. పొత్తులు లేకపోతే మాత్రం టీడీపీ గెలవదా అన్న చర్చ కూడా ఇపుడు తమ్ముళ్ళు కొత్తగా తీసుకుని వస్తున్నారు అంటున్నారు.

ఇటీవల జరిగిన కర్నాటక ఎన్నికల్లో జేడీఎస్ విడిగా పోటీ చేసినా అధికార బీజేపీకి సరైన ఆల్టర్నేషన్ గా కాంగ్రెస్ నే జనాలు గుర్తించి భారీ మెజారిటీ కట్టబెట్టారని, జేడీఎస్ కింగ్ మేకర్ రోల్ నుంచి కూడా చాలా దూరంగా వెళ్ళిపోయింది అని గుర్తు చేస్తున్నారు. మరి తమ్ముళ్ళు సొంతంగా పోటీ చేయాలని వత్తిడి తెస్తున్నారు. ఈ విషయం లో చంద్రబాబు తెగిస్తారా లేదా అన్నది చూడాల్సి ఉంది.