Begin typing your search above and press return to search.

జనసేన ఎంపీ సీటు బీజేపీకి షిఫ్ట్...రేసులో బోలెడు మంది...!?

టీడీపీ జనసేన కూటమిలోకి బీజేపీ ఎంట్రీ ఇచ్చింది. దాంతో చాలా సీట్లలో మార్పులు కనిపిస్తున్నాయి. ఉమ్మడి విశాఖ జిల్లాలో చూస్తే విశాఖ ఎంపీ సీటుని బీజేపీ పట్టుబట్టింది.

By:  Tupaki Desk   |   10 March 2024 5:30 PM GMT
జనసేన ఎంపీ సీటు బీజేపీకి షిఫ్ట్...రేసులో బోలెడు మంది...!?
X

టీడీపీ జనసేన కూటమిలోకి బీజేపీ ఎంట్రీ ఇచ్చింది. దాంతో చాలా సీట్లలో మార్పులు కనిపిస్తున్నాయి. ఉమ్మడి విశాఖ జిల్లాలో చూస్తే విశాఖ ఎంపీ సీటుని బీజేపీ పట్టుబట్టింది. కానీ ఆ సీటుని ఇచ్చేందుకు టీడీపీ ససేమిరా అనేసింది. దానికి బదులుగా అనకాపల్లి ఎంపీ సీటుని ఇవ్వబోతున్నట్లుగా తెలుస్తోంది.

దాంతో అనకాపల్లి బీజేపీ ఆశావహులు క్యూ కడుతున్నారు. విశాఖ ఎంపీగా పోటీ చేయాలనుకుని గత మూడేళ్ళుగా ఎంతో కసరత్తు చేస్తూ వస్తున్న రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావుకు ఇపుడు విశాఖ సీటు బీజేపీకి ఇవ్వడంలేదని తేలిపోవడంతో షాక్ తగిలింది. ఆయన విశాఖలో తన సామాజిక వర్గం దన్ను చూసుకున్నారు. కార్యక్రమాలు కూడా చేపట్టారు. ఒక పద్ధతి ప్రకారం ఆయన పనిచేసుకుని పోతున్నారు.

ఇక విశాఖ సీటు మీద ఆశపడిన దగ్గుబాటి పురంధేశ్వరిని రాజమండ్రికి షిఫ్ట్ చేశారు. దాంతో ఆమెకు సీటు దొరికింది. అయితే జీవీఎల్ ఎక్కడ నుంచి పోటీ చేస్తారు అన్నది మాత్రం తెలియడంలేదు. ఆయనను అనకాపల్లికి పంపిస్తారు అని అంటున్నారు. అయితే అనకాపల్లి బీసీల సీటు, కాపుల సీటు. ఈ రెండు సామాజిక వర్గాల వారికి అక్కడ సీటు ఇస్తేనే విజయావకాశాలు ఉంటాయని అంటున్నారు. దాంతో జీవీఎల్ కి అనకాపల్లి ఇవ్వడం ఎంతవరకు సాధ్యపడుతుంది అన్నది చర్చగా ఉంది.

అయితే జీవీఎల్ అనకాపల్లికైనా ఓకే అని అంటున్నారుట. తాను అక్కడ నుంచి పోటీ చేసి గెలుస్తాని అని చెబుతున్నారు అని టాక్. ఇక విశాఖ సీటు మీద కన్నేసిన కడప జిల్లాకు చెందిన రాజ్యసభ ఎంపీ సీఎం రమేష్ చూపు కూడా ఇపుడు అనకాపల్లి మీద పడింది అని అంటున్నారు. ఆయన వెలమ సామాజిక వర్గానికి చెందిన నేత కావడంతో సామాజిక సమీకరణలు తనకు వర్కౌట్ అవుతాయని భావిస్తున్నారుట.

అనకాపల్లి నుంచి పోటీకి ఆయన రెడీ అంటున్నారుట. ఇక బీజేపీలో సుదీర్ఘ కాలంగా కొనసాగుతూ పక్కా లోకల్ గా ఉన్న రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పీవీఎన్ మాధవ్ అనకాపల్లి టికెట్ ని చేజిక్కించుకోవడానికి చూస్తున్నారు అని అంటున్నారు. ఆయన బీసీ వెలమ సామాజిక వర్గానికి చెందిన వారు ఆయన తండ్రి దివంగత పీవీ చలపతిరావు గతంలో అనకాపల్లి నుంచి బీజేపీ తరఫున పోటీ చేసి మంచి ఓట్లు సాధించారు.

అలా అనకాపల్లితో మంచి రాజకీయ బంధం ఉంది. దాంతో పాటుగా సామాజికవర్గాల పరంగా సమీకరణలు సరిపోతాయని అంటునారు. 2023లో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓడిన తరువాత మాధవ్ కి పదవులు ఏవీ దక్కలేదు. బీసీ నేత, విశాఖ జిల్లా బీజేపీలో కీలక నేత అయిన పీవీ మాధవ్ కి న్యాయం చేయాలని ఆ పార్టీలో ఉంది అంటున్నారు.

ఇక బీసీల సీటుగా అనకాపల్లి ఉంది. దాంతో పీవీఎన్ మాధవ్ కి అక్కడ పోటీకి దింపితే లోకల్ క్యాడిడేట్ గా ఉంటారు. రాజకీయ సామాజిక నేపధ్యంతో పాటు స్థానిక టీడీపీ నేతలతో ఉన్న సంబంధాలు అన్నీ కలసి వస్తాయని అంటున్నారు. మరి ఈ ముగ్గురూ కాకుండా సీటు ఇస్తే బీజేపీ తరఫున పోటీ చేసేందుకు బిగ్ షాట్స్ కూడా కొంతమంది రంగంలోకి వస్తున్నారు.