Begin typing your search above and press return to search.

పవన్ తొందరపడకపోతే గాజు గ్లాస్ గల్లంతేనా...!?

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కి ఇపుడు కామన్ సింబల్ ని కాపాడుకోవడం అతి పెద్ద సమస్య అయిపోయింది

By:  Tupaki Desk   |   2 April 2024 1:30 PM GMT
పవన్ తొందరపడకపోతే గాజు గ్లాస్ గల్లంతేనా...!?
X

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కి ఇపుడు కామన్ సింబల్ ని కాపాడుకోవడం అతి పెద్ద సమస్య అయిపోయింది. తన లేటెస్ట్ మూవీలో గ్లాస్ గురించి పవర్ ఫుల్ డైలాగ్ కూడా వేసి మరీ ప్రచారం చేసుకున్న పవన్ కి కేంద్ర ఎన్నికల సంఘం భారీ షాక్ ఇచ్చేసింది.

ఏపీలో జనసేన రిజిస్టర్ పార్టీగానే ఉంది. ఆ పార్టీకి కామన్ సింబల్ ఇవ్వరు. గాజు గ్లాస్ ని ఫ్రీ సింబల్ గా ఈసీ డిక్లేర్ చేసింద్. దీంతో గాజు గ్లాస్ గుర్తు ఎవరు ముందు కోరుకుంటే వారికే దక్కుతుంది. అంతే కాదు ఎక్కడికక్కడ ఇండిపెండెంట్లు ఆ గుర్తు మీద పోటీ చేసేందుకు ఆస్కారం ఉంది.

దీంతో జనసేనలో యమ టెన్షన్ ఏర్పడింది. నిజానికి చూస్తే ఏపీలో జనసేన పోటీ చేస్తున్న అసెంబ్లీ సీట్లు 21 మాత్రమే. ఇవి మొత్తం 175 సీట్లలో తొమ్మిదవ వంతుగా ఉన్నాయి. ఇక పాతిక ఎంపీ సీట్లు ఉంటే రెండు సీట్లలో మాత్రమే జనసేన పోటీ పడుతోంది. ఈ నంబర్ చూసుకున్నా మొత్తం లోక్ సభ సీట్లలో పదమూడవ వంతుగా ఉంది.

ఈ విధంగా తక్కువ సీట్లలో పోటీ చేస్తున్న జనసేనకు కామన్ సింబల్ ఇవ్వాల్సి ఉందా లేదా అన్నది కేంద్ర ఎన్నికల సంఘం విచక్షణతోనే నిర్ణయం తీసుకోనుంది. అయితే ఈసీ ముందు అందరూ సమానమే. ఇపుడు ఫ్రీ సింబల్ గా ఉన్న గాజు గ్లాస్ గుర్తుని మరేదైన రిజిస్టర్ పార్టీ కోరుకుంటే వారికి ఇచ్చేందుకు కూడా ఈసీకి పూర్తి అధికారం ఉంది.

అదే విధంగా మొదటి వచ్చికి మొదటి ప్రాధాన్యం అన్న విధానంతో ఈసీ ఫ్రీ సింబల్ ని ఆయా రిజిస్టర్ పార్టీలకు కేటాయిస్తూ ఉంటుంది. పైగా దరఖాస్తు చేసుకునేది కూడా పూర్తిగా ఆన్ లైన్ లోనే కావడంతో ఎనీ టైం ఎవరైనా ముందుగా దరఖాస్తు చేసుకుంటే వారికి గాజు గ్లాస్ వెళ్లిపోయే ప్రమాదం కూడా ఉందని అంటున్నారు.

ఇక ఆ మీదట ఎంత న్యాయ పోరాటం చేసినా ఫలితం ఉండదని అంటున్నారు. దానికి లేటెస్ట్ ఉదాహరణగా తమిళనాడులో జరిగిన ఒక కేసుని చెబుతున్నారు. అక్కడ చూస్తే ఒక రిజిష్టర్ పార్టీకి ఉన్న గుర్తుని వేరే పార్టీకి కేటాయించింది. దానికి కారణం ఆ పార్టీ ముందుగా దరఖాస్తు చేసుకోవడమే. దీని మీద ఆ పార్టీ న్యాయ పోరాటం చేస్తోంది.

అందువల్ల ఇపుడు పవన్ కూడా తొందరపడి తమకు ఫ్రీ సింబల్ గా గాజు గ్లాస్ ని కేటాయించాలని కోరుకుంటే దక్కుతుంది. అదే సమయంలో ఆన్ లైన్ లో వేరే ఎవరైనా ముందుగా అప్లై చేసుకుంటే మాత్రం ఫలితం ఉండదని అంటున్నారు.

ఇంకో వైపు చూస్తే రిజిస్టర్ పార్టీలకు ఉమ్మడి గుర్తుని ఇచ్చినా ఆయా పార్టీలు పోటీ చేయని చోట ఇండిపెండెంట్లకు కూడా ఆ గుర్తుని ఇస్తారా అన్న చర్చ సాగుతోంది.ఇది కూడా ఈసీ విచక్షణ మేరకు మాత్రమే ఆధారపడి ఉంటుంది.

ఏది ఏమైనా చట్ట సభలలో ఇద్దరు ఎమ్మెల్యేలు మొత్తం పోటీ చేసిన స్థానాలలో ఆరు శాతం ఓటింగ్ శాతం వస్తేనే తప్ప రిజిష్టర్ పార్టీకి గుర్తింపు దక్కదు. కామన్ సింబల్ ఇవ్వరు. ఇపుడు జనసేనకు ఈ సమస్య పెను సవాల్ విసురుతోంది. దీని మీద ఏమి చేస్తారు అన్నది చూడాలని ఉంది. అనుకోని ఇబ్బంది ఎదురైతే మాత్రం గాజు గ్లాస్ గుర్తు గల్లంతు అవుతుందా అన్న అన్న ఆందోళన కూడా జనసైనికులలో ఉంది అని అంటున్నారు. చూడాలి మరి ఏమి జరుగుతుందో.