పదవులు, పీఠాలే అసలు సమస్య.. జనసేన అంతర్గత టాక్!
అయితే.. తాజాగా పవన్ నిర్వహించిన పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో పొత్తుల గురించి మాట్లాడిన పవన్.. పదవులు, పీఠాల విషయాన్ని దాట వేశారు
By: Tupaki Desk | 17 Sep 2023 4:30 PM GMTఏపీలో అసెంబ్లీ ఎన్నికలు వచ్చే ఏడాది జరిగినా.. లేక, ఇప్పటికిపన్పుడు జరిగినా టీడీపీతో కలిసి ఎన్నిక లకు వెళ్తామని చెబుతున్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌కు ఆదిలోనే చిక్కుముడులు ఎదురవుతు న్నాయి. వచ్చే ఎన్నికల్లో పొత్తులు ఖాయమని ఆయన రాజమండ్రి జైలు ముందు చెప్పారు. దీనిని జనసే న నాయకులు ఎవరూ కూడా తప్పుపట్టడం లేదు. పార్టీపరంగా చూసుకుంటే.. రాష్ట్ర వ్యాప్తంగా పోటీ చేయగల పరిస్థితి లేదు.
175 నియోజకవర్గాల్లోనూ ఇంచార్జులు లేని పరిస్థితి జనసేనను ఎప్పటి నుంచో వేధిస్తోంది. ఈ నేపథ్యం లో టీడీపీతో పొత్తు పెట్టుకోవడాన్ని మెజారిటీ నాయకులు స్వాగతిస్తున్నారు. అయితే, ఎటొచ్చీ.. పదవులు, పీఠాలే పార్టీకి అసలు సమస్యగా మారిందనే చర్చ కొనసాగుతోంది. గత 2014 నుంచి కూడా జనసేన కోసం పనిచేస్తున్న వారు ఉన్నారు. కేసులు పెట్టించుకున్న వారు కూడా ఉన్నారు. పార్టీ కోసం ఖర్చు చేసిన వారు కూడా ఉన్నారు.
ఈ నేపథ్యంలో వారు వచ్చే ఎన్నికల్లో పార్టీ కనుక అధికారం పంచుకుంటే తమకు పదవులు కావాలనే అభిలాషను వ్యక్తం చేస్తున్నారు.అయితే.. తాజాగా పవన్ నిర్వహించిన పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో పొత్తుల గురించి మాట్లాడిన పవన్.. పదవులు, పీఠాల విషయాన్ని దాట వేశారు. ''ముందు పొత్తులకే పరిమితం కండి. పదవుల విషయాన్ని తర్వాత చూద్దాం'' అని పవన్ తేల్చి చెప్పారు. దీంతో పదవులు ఆశిస్తున్నవారు ఒకింత డోలాయమానంలో పడినట్టు అయింది.
ఎందుకంటే... అటు టీడీపీలోనూ పదవులు ఆశిస్తున్నవారి సంఖ్య భారీగానే ఉంది. మంత్రులు సహా ఎమ్మెల్సీలు, నామినేటెడ్ పదవుల కోసం నాయకులు భారీగానే ఉన్నారు. ఈ నేపథ్యంలో పదవులు, పీఠాల విషయంలో ముందుగానే తేల్చుకుంటే బెటర్ అనే వాదన జనసేన నుంచి వినిపిస్తోంది. ఇదే విషయాన్ని పలువురు పవన్ దృష్టికి కూడా తీసుకువెళ్లారు. అయితే, ఆయన మాత్రం పొత్తులకే పరిమితం కావాలని చెప్పడంతో ఒకింత డోలాయమాన పరిస్థితిలో జనసేన నేతలు ఉన్నారనే చెప్పాలి. పొత్తులు తప్పు కానప్పుడు.. పదవుల విషయాన్ని కూడా తేల్చేస్తే బెటర్ కదా! అనేవారి సంఖ్య ఎక్కువగా కనిపిస్తుండడం గమనార్హం.