Begin typing your search above and press return to search.

జనసేన ఎన్ని సీట్లలో పోటీ చేస్తుందంటే...?

ఏపీలో పొత్తులు ఇంకా పొడవలేదు. మూడు పార్టీల మధ్య రాజకీయ సయ్యాట అలా సాగుతూనే ఉంది.

By:  Tupaki Desk   |   8 Aug 2023 8:00 AM IST
జనసేన ఎన్ని సీట్లలో పోటీ చేస్తుందంటే...?
X

ఏపీలో పొత్తులు ఇంకా పొడవలేదు. మూడు పార్టీల మధ్య రాజకీయ సయ్యాట అలా సాగుతూనే ఉంది. అదే సమయంలో ఏపీలో తాము అధికారంలోకి వస్తామంటే తాము వస్తామని టీడీపీ అధినాయకులు జనాల్లోకి వచ్చి హామీలు ఇస్తున్నారు. ఒక విధంగా ఎన్నికల మ్యానిఫేస్టోని సైతం ప్రకటిస్తున్నారు.

జనసేన అధికారంలోకి వస్తే అంటూ పవన్ మాట్లాడుతున్నారు. ఈ నేపధ్యంలో పొత్తుల కధ ఎటు వైపు టర్న్ తీసుకుంటుంది అన్నది అర్ధం కావడంలేదు. ఇదిల ఉంటే తాజాగా క్రిష్ణా జిల్లాలోని మల్లవల్లి రైతులను ఉద్దేశించి పవన్ మాట్లాడుతూ టీడీపీని టార్గెట్ చేశారు. తెలుగుదేశం రైతులలో కులాన్ని చూసిందని ఘాటైన విమర్శ చేశారు.

ఇదిలా ఉంటే జనసేన సీనియర్ నేత నాదెండ్ల మనోహర్ అయితే జనసేన పోటీ చేసే సీట్ల మీద సంచలన కామెంట్స్ చేశారు. వచ్చే ఎన్నికల్లో జనసేన ఎన్ని సీట్లకు పోటీ చేస్తుంది అన్నది తాము తొందరలోనే వెల్లడిస్తామని ఆయన ప్రకటిండం విశేషం.

అంటే ఏపీలో మొత్తం 175కి జనసేన పోటీ చేస్తుందా లేక పోత్తులలో తాము కోరుకుంటున్న నంబర్ ని మాత్రమే చెప్పి అంతమేరకే పోటీ అని చెబుతుందా అన్నది ఇపుడు చర్చకు వస్తోంది. పవన్ కళ్యాణ్ అయితే పొత్తులతోనే వెళ్తామని పలు మార్లు ప్రకటిస్తున్నరు. అయితే ఆయన ఆలోచనలకు తగినట్లుగా మిగిలిన పార్టీలు కలిసి రావడం లేదని అంటున్నారు.

నిజానికి వారాహి యాత్ర ఉభయ గోదావరి జిల్లాలలో సూపర్ హిట్ అయింది. పవన్ సభలకు జనాలు తండోప తండాలుగా వచ్చారు. ఎక్కడ చూసిన పవన్ పూనకాలు కనిపించాయి. అది చూసిన తరువాత టీడీపీ ఒక స్టెప్ ముందుకు వేసి తానే చర్చలను మొదలెడుతుందని జనసేన వర్గాలు భావించాయని అంటున్నారు. అయితే టీడీపీ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది అని అంటున్నారు.

పవన్ సభలకు జనాలు వచ్చినా జనసేన గ్రాఫ్ పెరిగినా తాము కోరుకున్న నంబర్ తోనే పొత్తులు కుదరాలన్నది టీడీపీ ఆలోచనగా చెబుతున్నారు. అందుకే తెలుగుదేశం పార్టీ తానుగా పొత్తు యత్నాలను మొదలెట్టకూడదని గట్టు మీద ఉంది అని అంటున్నారు. దీంతో టీడీపీ మీద వత్తిడి పెంచేందుకు జనసేన ఒక పద్ధతి ప్రకారం కొన్ని నియోజకవర్గాలలో అభ్యర్ధులు వీరే అన్నట్లుగా ఇంచార్జిలను ప్రకటించింది. ఇక తెనాలి మా సీటూ అక్కడే మా పోటీ అని కూడా స్వయంగా పవన్ చెప్పడమే కాదు నాదెండ్ల మనోహర్ ని నిలబెడుతున్నట్లుగా ప్రకటించారు.

మరో అడుగు ముందుకేసి మల్లవల్లి రైతుల సమావేశంలో టీడీపీ తప్పులను ఎత్తి చూపారు. మరి టీడీపీ నుంచి ఏ రకమైన రియాక్షన్ ఉంటుందో తెలియడం లేదు కానీ నాదెండ్ల అయితే తాము ఎన్ని సీట్లు పోటీ చేయబోతున్నది ప్రకటిస్తామని చెప్పడం మరికాస్తా దూకుడు చేయడమే అని అంటున్నారు. ఇక తెలుగుదేశం అయితే పొత్తులకు వెళ్లాలని ఉన్నా తాము కోరుకున్న తీరున ఉంటేనే ముందుకు అడుగులు వేయాలని చూస్తోందని అంటున్నారు.

అలా కాకుండా మిత్రపక్షాలకు భారీ ఎత్తున సీట్లను ఇవ్వడానికి మాత్రం ఆ పార్టీ అంగీకరించదు అని అంటున్నారు. దాంతో పాటు బీజేపీ కూడా టీడీపీతో పొత్తుల మీద ఎటూ తేల్చడంలేదు. అలా పొత్తుల కధ అక్కడే ఉండిపోతోంది. ఈ నేపధ్యంలో సొంతంగా తాము పోటీ చేసే సీట్లను జనసేన ప్రకటిస్తుందా అన్నది చూడాల్సి ఉంది. ఒక వేళ అలా కనుక చేస్తే మాత్రం అది సంచలమే అవుతుంది అని అంటున్నారు.