Begin typing your search above and press return to search.

పవన్ చేతిలో తారక్ కటౌట్… వైరల్ వీడియో

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రాజకీయ క్షేత్రంలో ప్రజల మధ్య తిరుగుతూ ప్రజాభిమానం పొందే ప్రయత్నం చేస్తున్నారు

By:  Tupaki Desk   |   7 Aug 2023 5:59 AM GMT
పవన్ చేతిలో తారక్ కటౌట్… వైరల్ వీడియో
X

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రాజకీయ క్షేత్రంలో ప్రజల మధ్య తిరుగుతూ ప్రజాభిమానం పొందే ప్రయత్నం చేస్తున్నారు. చిత్ర పరిశ్రమలో మెగా ఫ్యామిలీకి జూనియర్ ఎన్ఠీఆర్ అంటే ప్రత్యేకమైన అభిమానం ఉంటుందనే టాక్ ఉంది. రామ్ చరణ్ తన బెస్ట్ ఫ్రెండ్ తారక్ అని చాలా సందర్భాలలో చెప్పారు. తనకి ఏ కష్టం అనిపించింది, సంతోషాన్ని అయిన ముందు తారక్ తోనే షేర్ చేసుకుంటా అని ఓ ఇంటర్వ్యూలో క్లారిటీ ఇచ్చారు.

తాజాగా రామ్ చరణ్ కి కూతురు పుట్టిన సందర్భంగా తారక్ ఫ్యామిలీతో కలిసి వెళ్లి ప్రత్యేకంగా విషెస్ చెప్పడంతో పాటు కలిగి దిగిన ఫోటోలని సోషల్ మీడియాలో పంచుకున్నారు. ఇక పవన్ కళ్యాణ్ అంటే తారక్ కి ప్రత్యేకమైన అభిమానం ఉంది. ఇద్దరూ కలుసుకున్న ప్రతిసారి ఆప్యాయంగా మాట్లాడుకోవడం కనిపిస్తుంది. అరవింద సమేత సినిమా ఓపెనింగ్ కి పవర్ స్టార్ గెస్ట్ గా వెళ్లారు.

అయితే అభిమానులు మాత్రం మెగా హీరోలని, తారక్ కి వేర్వేరుగా చూస్తారు. కొంతమంది అభిమానుల ముసుగులో స్టార్ హీరోల ఫ్యాన్స్ మధ్య అగ్గి రాజేస్తూ ఉంటారు. అయితే స్టార్స్ మాత్రం తమ మధ్య మంచి బాండింగ్ ఉందనే విషయాన్ని చెబుతూనే ఉంటారు. తాజాగా పవన్ కళ్యాణ్ గన్నవరంలో పర్యటించారు. కార్యక్రమం ముగించుకొని తిరిగి వస్తున్న సమయంలో కొంత మందేది తారక్ అభిమానులు చిన్న ఫ్లెక్షీ పవన్ కళ్యాణ్ కి ఇచ్చారు.

అందులో జూనియర్ ఎన్ఠీఆర్ ఫోటోతో పాటు పవన్ కళ్యాణ్ ఫోటో కూడా ఉంది. దానిపై అభిమానం వేరు రాజకీయం వేరు అని రాసి ఉంది. పవన్ కళ్యాణ్ దానిని అందుకొని ఒకసారి అందరికి చూపించి మళ్ళీ తిరిగి ఇచ్చేసారు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

పవన్ కళ్యాణ్ గత కొద్ది రోజులుగా తన ప్రసంగాలలో టాలీవుడ్ స్టార్స్ గురించి ఎక్కువగా ప్రస్తావిస్తున్నారు. ఎవరు ఎవరిని అయిన అభిమానించండి. కానీ మీ భవిష్యత్తు కోసం జనసేనకి అండగా నిలబడండి అని చెబుతున్నారు. పవన్ కళ్యాణ్ మాటలకి యువత కూడా ప్రభావితం అవుతున్నారనే విషయం ఈ వీడియో చూసిన తర్వాత అర్ధమవుతోంది.