Begin typing your search above and press return to search.

అభ్యర్ధుల ప్రకటన ఉండదా ?

తెలుగుదేశంపార్టీ, జనసేన మధ్య సడెన్ గా మొదలైన డెవలప్మెంట్ల కారణంగా అభ్యర్ధుల ప్రకటన ఆగిపోయినట్లు తెలుస్తోంది.

By:  Tupaki Desk   |   27 Jan 2024 5:25 AM GMT
అభ్యర్ధుల ప్రకటన ఉండదా ?
X

తెలుగుదేశంపార్టీ, జనసేన మధ్య సడెన్ గా మొదలైన డెవలప్మెంట్ల కారణంగా అభ్యర్ధుల ప్రకటన ఆగిపోయినట్లు తెలుస్తోంది. రెండుపార్టీలు పొత్తు పెట్టుకున్న విషయం తెలిసిందే. పొత్తయితే పెట్టుకున్నాయి కాని ఏ పార్టీ ఎన్నిసీట్లలో పోటీచేస్తుంది ? పోటీచేసే నియోజకవర్గాలపై అధికారిక ప్రకటన రాలేదు. దాంతో రెండుపార్టీల్లోని నేతల్లో అయోమయం పెరిగిపోతోంది. ఒకవైపు జగన్ అభ్యర్ధులను ప్రకటించేస్తున్నా తమ విషయం తేలకపోవటంతో కూటమిలోని నేతల్లో టెన్షన్ పెరిగిపోతోంది.

ఈ నేపధ్యంలోనే అరకు, మండపేట బహిరంగసభల్లో చంద్రబాబునాయుడు ఇద్దరు అభ్యర్ధులను ప్రకటించారు. అరకులో సివేరి సోము, మండపేటలో జోగేశ్వరరావు పోటీచేస్తారని ప్రకటించారు. ఆ ప్రకటపై జనసేనలో మంట మొదలైంది. ఆ మంటే పవన్ కల్యాణ్ స్పీచిలో బయటపడింది. చంద్రబాబు పొత్తుధర్మాన్ని ఉల్లంఘించారని డైరెక్టుగానే పవన్ ఆక్షేపించారు. చంద్రబాబు రెండు నియోజకవర్గాల్లో అభ్యర్ధులను ప్రకటించారు కాబట్టి తాను కూడా పార్టీ పోటీచేయబోయే రెండు నియోజకవర్గాలను ప్రకటించారు. ఈ ప్రకటనతో పవన్లోని అసంతృప్తి స్పష్టంగా బయటపడింది. వెంటనే ఈ విషయం చంద్రబాబు దృష్టికి వెళ్ళిందని సమాచారం.

అందుకనే ఇకనుండి బహిరంగసభల్లో అభ్యర్ధుల ప్రకటన చేయకూడదని చంద్రబాబు డిసైడ్ అయ్యారట. ఎక్కడ బహిరంగసభ జరిగినా కూటమిని గెలిపించాలని మాత్రమే విజ్ఞప్తిచేయాలని చంద్రబాబు అనుకున్నారట. నిజానికి ఇద్దరు అభ్యర్ధులను ఏకపక్షంగా ప్రకటించటం చంద్రబాబు తప్పే. ఎన్నికలు దగ్గరకు వచ్చేస్తున్నా సీట్ల సంఖ్య, నియోజకవర్గాలను ప్రకటించకపోవటం రెండుపార్టీలకు మైనస్సే అవుతుంది. సీట్ల సంఖ్య, నియోజకవర్గాలను ప్రకటిస్తే పార్టీలో ఎక్కడ గొడవలు మొదలవుతాయో అన్న భయంతోనే ప్రకటించటంలేదని అర్ధమవుతోంది.

అయితే ఇక్కడ సమస్య ఏమిటంటే ప్రకటన ఎప్పుడుచేసినా గొడవలు తప్పవు. ఆ గొడవలేవో ఇపుడే బయటపడితే సర్దుబాటుకు కావాల్సినంత సమయముంటుంది. గొడవలకు భయపడి ఎంతకాలమని సీట్లసంఖ్య, నియోజకవర్గాలను ప్రకటించకుండా వాయిదాలు వేస్తరో అర్ధంకావటంలేదు. బీజేపీ విషయాన్ని కూడా ఫైనల్ చేసుకుని సీట్లను ప్రకటించకపోతే కూటమికి నష్టం తప్పదు. కాబట్టి పవన్ తాజా వైఖరిని దృష్టిలో పెట్టుకుని వెంటనే సీట్ల సంఖ్య, నియోజకవర్గాలను ఫైనల్ చేసి ప్రకటించే విషయాన్ని చంద్రబాబు ఆలోచించాలి. లేకపోతే ఇలాంటి అసంతృప్తులే బయటపడుతుంటాయి.