బిగ్ బ్రేకింగ్... జనసేన పోటీచేసే నియోజకవర్గాలివే!
అవును... వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణలో పోటీ చేయబోయే అసెంబ్లీ స్థానాలను తెలంగాణ జనసేన విభాగం ప్రకటించింది.
By: Tupaki Desk | 2 Oct 2023 12:45 PM GMTఎన్నికలు సమీపిస్తున్న వేళ రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. ఇందులో భాగంగా ఇప్పటికే అధికార బీఆరెస్స్ తమ అభ్యర్థులను ప్రకటించగా... కాంగ్రెస్ పార్టీ కసరత్తులలో బిజీగా ఉంది. మరోపక్క బీజేపీ కూడా ఆ ప్రయత్నాలలోనే ఉందని అంటున్నారు. ఈ సమయంలో ఎవరూ ఊహించని విధంగా తెలంగాణ జనసేన విభాగం.. ఆ పార్టీ పోటీచేయబోయే స్థానాలను ప్రకటించింది.
అవును... వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణలో పోటీ చేయబోయే అసెంబ్లీ స్థానాలను తెలంగాణ జనసేన విభాగం ప్రకటించింది. ఇందులో భాగంగా 32 అసెంబ్లీ నియోజకవర్గాల పేర్లు ప్రకటించింది. ఈ సందర్భంగా... ఒకవేళ చివరి క్షణంలో పొత్తులు ఏమైనా ఉంటే స్థానాల్లో మార్పు రావచ్చని తెలంగాణ జనసేన ఉపాధ్యక్షులు బొంగునూరి మహేందర్ రెడ్డి తెలిపారు.
ఈ క్రమంలో... గత 10 సంవత్సరాల్లో తెలంగాణలో అనేక సమస్యలపై జనసేన పార్టీ పోరాటం చేసిందని.. నల్లమల యురేనియం త్రవ్వకాలు.. మహిళలపై దాడులు.. డ్రగ్స్ సమస్య.. ఆర్టీసీ కార్మికుల సమస్యలు.. బీసీ, ఎస్టీ వర్గాల సమస్యలు.. విద్యార్థుల సమస్యలు ఇలా అనేక సమస్యలపై పోరాటం చేసినట్లు మహేందర్ రెడ్డి ఈ సందర్భంగా వెల్లడించారు.
ఈ సందర్భంగా... తెలంగాణ ఉద్యమ ఆకాంక్ష నెరవేర్చడమే లక్ష్యం.. తెలంగాణ రాష్ట్రంలో రానున్న సార్వత్రిక ఎన్నికల్లో 32 స్థానాలకు సిద్ధమైన జనసేన పార్టీ అంటూ ఆ నియోజకవర్గాల పేర్లను తెలిపింది. (32 నియోజకవర్గాల బాధ్యుల వివరాలు అని పేర్కొన్నప్పటికీ... నియోజకవర్గాల పేర్లు మాత్రమే ట్విట్టర్ లో తెలిపింది!)
నియోజకవర్గాల పేర్లు...
కూకట్ పల్లి, ఎల్బీనగర్, నాగర్ కర్నూల్, వైరా, ఖమ్మం, మునుగోడు, కుత్బుల్లాపూర్, శేరిలింగంపల్లి, పటాన్ చెరు, సనత్ నగర్, ఉప్పల్, కొత్తగూడెం, అశ్వరావుపేట, పాలకుర్తి, నర్సంపేట, స్టేషన్ ఘనపూర్, హుస్నాబాద్, రామగుండం, జగిత్యాల, నకిరేకల్, హుజూర్ నగర్, మంథని, కోదాడ, సత్తుపల్లి, వరంగల్ వెస్ట్, వరంగల్ ఈస్ట్, మల్కాజిగిరి, ఖానాపూర్, మేడ్చల్, పాలేరు, ఇల్లందు, మధిర అసేంబ్లీ నియోజకవర్గాల్లో జనసేన పోటీ చేయబోతున్నట్లు ప్రకటించింది.