Begin typing your search above and press return to search.

పిఠాపురంలో పవన్ థర్డ్ ప్లేస్ నా ?

ఎందుకంటే పిఠాపురంలో తెలుగుదేశం అత్యంత బలంగా ఉంది. ఆ పార్టీ నాయకులు కూడా గట్టిగా ఉన్నారు. మరో వైపు వైసీపీ కూడా బలంగానే ఉంది.

By:  Tupaki Desk   |   26 April 2025 4:30 PM
పిఠాపురంలో పవన్ థర్డ్ ప్లేస్ నా ?
X

పిఠాపురం జనసేన అడ్డా అని గట్టిగా సైనికులు చెబుతూ వస్తున్నారు. మరో వైపు చూస్తే పిఠాపురంలో జనసేన బలం ఎంత ఆ పార్టీ జోరు ఏ విధంగా ఉంది అన్న చర్చ సాగుతోంది. ఎందుకంటే పిఠాపురంలో తెలుగుదేశం అత్యంత బలంగా ఉంది. ఆ పార్టీ నాయకులు కూడా గట్టిగా ఉన్నారు. మరో వైపు వైసీపీ కూడా బలంగానే ఉంది.

మరి ఈ నేపధ్యంలో సిట్టింగ్ ఎమ్మెల్యేగా పవన్ కళ్యాణ్ ఉన్న జనసేన తన బలాన్ని ఏ మేరకు పెంచుకుంది అన్నది చర్చగా ఉంది. గత పది నెలలలో జనసేన ఏ విధంగా విస్తరించింది ఎంత మేరకు పటిష్టం అయింది అన్నది చర్చకు వస్తోంది.

ఇక చూస్తే కనుక పిఠాపురంలో కాపులు ఎక్కువగా ఉన్నా కూడా టీడీపీ తరఫున ఎస్వీ ఎస్ ఎన్ వర్మ మాస్ లీడర్ గా ఎదిగారు. వర్మకు కాపులతో ఎక్కువ అనుబంధం ఉంది. అంతే కాదు ఆయనకు పార్టీ పరంగానే కాదు సంస్థాగతంగా మంచి పట్టు ఉంది. ప్రతీ బూత్ లో వర్మ మనుషులు ఉన్నారు. బూత్ లెవెల్ పాలిటిక్స్ ని ఆయన బాగా చేస్తారు. అంతే కాదు ఎలక్షనీరింగ్ లో ఆయన దిట్టగా పేరు తెచ్చుకున్నారు.

ఇక పవన్ కళ్యాణ్ ని గెలిపిస్తే నియోజకవర్గం బాగు పడుతుంది అని చూస్తే పెద్దగా డెవలప్ అయ్యే పరిస్థితి లేదు అని అంటున్నారు. ఇక పిఠాపురానికి నాగబాబు వస్తే చాలు ప్రతీ సారీ రెచ్చగొట్టే మాటలే మాట్లాడుతున్నారు.

జనసేన అడ్డా అని నాగబాబు ఇతరులు ఎంతలా రీ సౌండ్ చేసి చెబుతున్నా కూడా జనసేనకు పిఠాపురం నియోజకవర్గం మొత్తం మీద బలం అయితే పెద్దగా లేదు అని అంటున్నారు. అంతే కాదు సంస్థాగతంగా పట్టు పెంచుకోవడం లేదు. బూత్ స్థాయిలో పనిచేసే నాయకులు జనసేనకు లేరు అని అంటున్నారు.

ఇక నాగబాబుని తెచ్చి పిఠాపురానికి జనసేన ఇంచార్జి గా చేయాలనుకున్నా ఆయనకు రాజకీయంగా పెద్దగా అనుభవం అయితే లేదు అని అంటున్నారు. దీనికి తోడు అన్నట్లుగా నాగబాబు చేసే ప్రకటనలు కూడా అపరిపక్వతతో ఉంటున్నాయని అంటున్నారు.

ఇటీవల ఒక సర్వే వచ్చింది. అందులో ప్రకారం చూస్తే కనుక ఒకవేళ జనసేన ఒంటరిగా పోటీ చేస్తే ఏపీలో జనసేనకు ఒక సీటూ కూడా రాదు అని అంటున్నారు. పిఠాపురంలోనే ఆ పార్టీకి పవన్ కి కూడా థర్డ్ ప్లేస్ వచ్చే అవకాశం ఉందని ఆ సర్వే చెబుతోంది. దానికి అనేక కారణాలు ఉన్నాయి.

పవన్ తన పార్టీ క్యాడర్ ని అయితే ఎక్కడా ఏ మాత్రం పెంచుకోవడం లేదు, పార్టీని పటిష్టం చేయడం లేదు అని అంటున్నారు. జనసేన లీడర్స్ తో పెద్దగా లాభం లేదనే అంటున్నారు. ఇక్కడ మరో విషయం కూడా ఉంది అని అంటున్నారు. ఇప్పటిదాకా జనసేన మీద అభిమానం ఉన్న వారు సానుభూతిపరులు పెద్ద ఎత్తున వైసీపీలోకి వెళ్ళాలని చూస్తున్నారు అని అంటున్నారు.

ఇక టీడీపీకి ప్రతీ చోటా బాగా పనులు జరుగుతున్నాయి. కానీ అదే నేపధ్యంలో జనసేనకు ఏ పనీ సాగడం లేదు అని అంటున్నారు. జనసేనలో ఉన్న పెద్ద నాయకులు బాలినేని శ్రీనివాసరెడ్డి, సామినేని ఉదయభాను మరింతమంది కాపు నాయకులు కీలక నేతలు అంతా జనసేనలోకి వెళ్ళినా కూడా అక్కడ లాభం లేదని వేడి నిట్టూర్పులు విడుస్తున్నారు అని అంటున్నారు.

జనసేనలో తమకు ఎలాంటి గుర్తింపు రాలేదని తమకు తగిన అవకాశాలు లేవని కూడా మధనపడుతున్నారుట. ఇక ఎందుకు ఈ పార్టీలోకి వచ్చామని అనుకుంటున్న నాయకులు చాలా మంది ఉన్నారని చెబుతున్నారు. మొత్తం మీద చూస్తే జనసేన కోసం పడిన ఆవేశం కాస్తా పాలపొంగులా చల్లారుతోందా అన్న చర్చ సాగుతోంది. జనసేన జోరు హోరు ఇలా ఒక్కసారిగా చల్లారిపోవడానికి గల కారణాలు ఆ పార్టీ పెద్దలే ఆలోచించుకోవాలని అంటున్నారు. ఏది ఏమైనా జనసేన చాలా చక్కదిద్దుకోవాల్సి ఉంది అని అంటున్నారు.