Begin typing your search above and press return to search.

జనసేన వ్యూహాత్మక మౌనం?

ఏపీలో టీడీపీ కూటమిలో ఉన్న రెండవ అతి పెద్ద పార్టీగా జనసేన ఉంది. జనసేనకు ప్రధాన ఆకర్షణ అధినాయకుడు పవన్ కళ్యాణ్.

By:  Satya P   |   27 Oct 2025 8:00 PM IST
జనసేన వ్యూహాత్మక మౌనం?
X

ఏపీలో టీడీపీ కూటమిలో ఉన్న రెండవ అతి పెద్ద పార్టీగా జనసేన ఉంది. జనసేనకు ప్రధాన ఆకర్షణ అధినాయకుడు పవన్ కళ్యాణ్. ఆయన ఉండడం కూటమికి కొండంత బలం. అదే సమయంలో జనసేన కూడా కూటమి పార్టీలతో కలసి మరో పదిహేనేళ్ల పాటు ఏపీని ఏలాలని భావిస్తోంది. పవన్ తరచూ పబ్లిక్ మీటింగ్స్ లో ఇదే విషయం స్పష్టం చేస్తూ వస్తున్నారు. ఇదే విధమైన ఘట్ బంధన్ ఇంకా చాలా కాలం పాటు కొనసాగాలని ఏపీ అభివృద్ధి గాడిన పడాలని పవన్ కళ్యాణ్ బలంగా కోరుకుంటున్నారు. అదే సమయంలో ఆయన కీలకమైన అంశాలలో తన పార్టీ విధానం అయితే స్పష్టంగా చెబుతున్నారు. మరి కొన్ని అంశాలలో బాహాటంగా మాట్లాడకుండా మౌనం వహిస్తున్నారు అని ప్రచారం అయితే సాగుతోంది.

కుదిపేసిన నకిలీ లిక్కర్ :

ఏపీని ఈ మధ్య అంతా నకిలీ లిక్కర్ ఇష్యూ పెద్ద ఎత్తున కుదిపేసింది. నకిలీ మధ్యం తయారీ కేంద్రాలు ఒక మాదిరి కర్మాగారాలు గా మారి యధేచ్చగా కల్తీ సరుకుని మార్కెట్ లోకి పంపిస్తున్నాయని ప్రచారం సాగుతూ వచ్చింది. దీని మీద టీడీపీ వర్సెస్ వైసీపీ అన్నట్లుగానే రాజకీయ యుద్ధం సాగుతోంది. మొదట్లో టీడీపీని వైసీపీ గట్టిగానే టార్గెట్ చేయగా ఆ తరువాత వైసీపీ మాజీ మంత్రి జోగి రమేష్ మీద నిందితుడు జనార్ధనరావు తీవ్ర ఆరోపణలు చేయడంతో ఆ ఇష్యూ కాస్తా వైసీపీ వైపు మళ్ళింది. దాంతో అటూ ఇటూ డైలాగ వార్ జరుగుతోంది. అయితే ఇంతటి కీలకమైన అంశం, పైగా ఏపీని కట్టి కుదిపిన కల్తీ మద్యం విషయంలో జనసేన పెద్దగా జోక్యం చేసుకోకపోవడం ఆశ్చర్యంగా ఉందని అంటున్నారు కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక ఈ తరహాలో ఇబ్బంది పెట్టిన ఇష్యూ మరోటి లేదని అంటున్నా మిత్ర పక్షం నుంచి పెద్దగా రియాక్షన్ అయితే రాకపోవడం చర్చగానే ఉందిట.

పీపీపీ విషయంలోనూ :

అంతే కాదు ఏపీలోని మెడికల్ కాలేజీలను పీపీ విధానంలో నిర్మించడానికి కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అయితే దీని ఈద వైసీపీ కోటి సంతకాలు అంటూ జనంలో పోరాడుతోంది అదే సమయంలో తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. ఇక వామపక్షాలు కూడా ప్రైవేటీకరణ వద్దు అంటున్నాయి. సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ లాంటి వారు కూడా ప్రభుత్వమే మెడికల్ కాలేజీలను నిర్మించాలని కోరుతున్నారు మేధావులు ప్రజా సంఘాలు అంతా పీపీపీన్ వ్యతిరేకిస్తున్నారు ఇది జనంలో పెద్ద చర్చగానే ఉంది. విద్య వైద్యం రెండూ ప్రైవేటీకరణ మంచిది కాదు అన్నది కూడా ఒక విధానంగా ఉంది అయితే ఈ విషయంలో టీడీపీ వర్సెస్ వైసీపీగా వాదోపవాదాలు జరుగుతూంటే జనసేన మాత్రం పెద్దగా రియాక్ట్ కాకుండా ఉండడం ఆసక్తికరంగానే ఉంది అని అంటున్నారు.

వైఖరి ఏమిటో :

ప్రజా కోణంలో నుంచి చూస్తే కొన్ని ప్రభుత్వ నిర్ణయాల మీద ఉన్న మాటను చెప్పాలి. అదే పాలసీ పరంగా చూస్తే ప్రభుత్వ విధానాలను సమర్ధించాలి. ఎందుకంటే ప్రభుత్వంలో ఉన్నారు కాబట్టి. అయితే బాహాటంగా వ్యతిరేకించినా లేక సూచనలు చేసినా దాని వల్ల లాభం కంటే నష్టమే రాజకీయంగా ఎక్కువగా ఉంటుందని జనసేన భావిస్తోంది అని అంటున్నారు. వైసీపీ కూడా ఈ అవకాశాన్ని వాడుకునేందుకు సిద్ధంగా ఉందని తెలుసు కాబట్టే జనసేన మౌనంగానే ఉంది అని అంటున్నారు. లూలూ షరతులకు ఒప్పుకుని భూములు ఇవ్వడం అంతా ప్రభుత్వమే ఏకపక్షంగా రాయితీలు ఇస్తూ పోవడం మీద పవన్ కేబినెట్ లో ప్రశ్నించారు అన్నది ప్రచారంలో ఉంది. ఇక భీమవరంలో జూదం పేకాట క్లబ్ ల విషయం మీద ఆయన ఫోకస్ పెట్టి సీరియస్ అయ్యారని అంటున్నారు. అన్ని ఓపెన్ గా కాకుండా కొన్ని చెవిలో చెబుతూ మరి కొన్ని సమావేశాలలో నాలుగు గోడల మధ్య చెబుతూ తన విధానాన్ని ఎప్పటికప్పుడు కరెక్ట్ గా ఉండేలా జనసేన చూసుకుంటోంది అని అంటున్నారు. అదే సమయంలో వైసీపీ ఏ విధంగా రాజకీయ లాభం పొందకుండా వ్యవహరిస్తోంది అని అంటున్నారు