Begin typing your search above and press return to search.

థర్డ్ ఫోర్స్ గా జనసేన...సాగర తీరం నుంచే సంచలనాలు

జనసేన 2019 సార్వత్రిక ఎన్నికల్లో తొలిసారి పోటీ చేసింది. కేవలం ఒక అసెంబ్లీ సీటుని మాత్రమే గెలిచింది. అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ పోటీ చేసిన రెండు చోట్లా ఓటమి పాలు అయ్యారు

By:  Tupaki Desk   |   26 Aug 2025 6:00 AM IST
థర్డ్ ఫోర్స్ గా జనసేన...సాగర తీరం నుంచే సంచలనాలు
X

జనసేన 2019 సార్వత్రిక ఎన్నికల్లో తొలిసారి పోటీ చేసింది. కేవలం ఒక అసెంబ్లీ సీటుని మాత్రమే గెలిచింది. అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ పోటీ చేసిన రెండు చోట్లా ఓటమి పాలు అయ్యారు. అయితే గిర్రున అయిదేళ్ళు తిరగకుండానే పోటీ చేసిన 21 సీట్లకు 21 గెలుచుకుని జనసేన ఏపీ రాజకీయాల్లో కీలకంగా మారింది. అంతే కాదు రెండు ఎంపీ సీట్లకు పోటీ చేస్తే ఆ రెండూ ఆ పార్టీ పరం అయ్యాయి. ఇక గడచిన పదిహేను నెలలుగా జనసేన ఏపీ రాజకీయాల్లో అధికార పాత్రలో ముందుకు సాగుతోంది.

పార్టీకి కొత్త సత్తువ :

ఇదిలా ఉంటే జనసేనను ఇంతకాలం పట్టించుకోలేదు అన్న అపవాదులు విమర్శల మధ్య ఎట్టకేలకు ఆ పార్టీ అధినాయకత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పార్టీని గ్రాస్ రూట్ లెవెల్ నుంచి రాష్ట్ర స్థాయి దాకా గట్టిగా నిర్మించాలని నిర్ణయం తీసుకుంది చేతిలో అధికారం ఉంది. పార్టీ కోసం పనిచేస్తున్న లక్షలాది మంది అభిమానులు ఉన్నారు. ఈ రెండింటినీ కో ఆర్డినేట్ చేసుకుంటూ ముందుకు వెళ్తే జనసేన బలీయమైన శక్తిగా ఏపీ రాజకీయాలో అవతరిస్తుంది అన్నది ఆ పార్టీ వ్యూహం గా ఉంది.

గ్యాప్ తొలగిస్తూ :

జనసేన ఎమ్మెల్యేలు ఉన్న చోట టీడీపీ ఇంచార్జిల నుంచి గట్టి పోటీ ఎదురవుతోందని వారిని పనిచేసుకో నీయకుండా చేస్తున్నారు అన్న విమర్శలు ఆ పార్టీ నుంచే ఉన్నాయి. తమను పూర్తిగా పక్కన పెడుతున్నరు అని అసంతృప్తికి లోను అవుతున్నారు. వారంతా తమ బాధను ఆవేదనను అధినాయకత్వంతో చెప్పుకోవడానికి విశాఖలో మూడు రోజుల పాటు జరుగుతున్న జనసేన పార్టీ విస్తృత స్థాయి సమావేశాలు ఒక మంచి వేదిక అని అంటున్న్నారు. పవన్ కూడా అసలు ఏమి జరుగుతోంది అన్నది అందరి నుంచి తెలుసుకుంటారని దానికి అనుగుణంగా పార్టీ తరఫున రాష్ట్ర స్థాయిలో ఏమి చేయాలో కూడా చేస్తారు అని అంటున్నారు.

వారితో మీటింగ్ కీలకం :

అంతే కాదు జనసేన నుంచి గెలిచిన ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, కౌన్సిలరు, కార్పోరేటర్లతో జనసేన అధినేత పవన్ సమావేశం అవుతారు అని అంటున్నారు. వారితో అన్ని విషయాలు ఆయన స్వయంగా అడిగి తెలుసుకుంటారు అని అంటున్నారు. ఈ విధంగా గ్రాస్ రూట్ లెవెల్ లో ఏమి జరుగుతోంది అన్నది పవన్ ఆరా తీస్తారు అని అంటున్నారు అలా ద్వితీయ తృతీయ శ్రేణి నాయకులతో నేరుగా అధినేత ఇంటరాక్ట్ అవుతారని అంటున్నారు. ఒక విధంగా చూస్తే జనసేనలో ఇది మంచి పరిణామంగా చెబుతున్నారు.

పటిష్టమైన స్థాయిలోకి :

ఏపీ రాజకీయాల్లో అయితే టీడీపీ లేకపోతే వైసీపీ అన్నట్లుగా పరిస్థితి ఉంది. అయితే ఏపీలో థర్డ్ ఫోర్స్ గా జనసేన దూసుకుని రావడానికి ఇది సరైన సమయం అని అంటున్నారు. టీడీపీ అధికారంలోఉంది. బలమైన క్యాడర్ క్షేత్ర స్థాయి దాకా ఉంది. ఇక వైసీపీ విపక్షంలో ఉంది. ఓటమి నుంచి ఇంకా తేరుకోలేకపోతోంది. దాంతో ఆ పార్టీలో ఉన్న స్తబ్దతను నీరసమైన వాతావరణాన్ని తమ పార్టీ ఎదుగుదలకు అనువుగా మార్చుకోవాలని జనసేన చూస్తోంది అని అంటున్నారు. 2029 ఎన్నికల నాటికి ఏపీలో మూడవ అతి పెద్ద పొలిటికల్ ఫోర్స్ గా నిలబడాలని జనసేన చూస్తోంది అని అంటున్నారు.

దాని కంటే ముందు 2026లో జరిగే లోకల్ బాడీ ఎన్నికల్లో జనసేన్ తన సత్తాను చాటుకుంటే వచ్చే ఎన్నికల్లో గణనీయంగా ఎమ్మెల్యేలను గెలిపించుకుని అసెంబ్లీలో ముఖ్య పాత్ర పోషించే దిశగా అడుగులు వేయాలని చూస్తోంది అంటున్నారు. మొత్తం మీద విశాఖలో జరిగే జనసేన విస్తృత స్థాయి సమావేశం మీద అతి పెద్ద చర్చ అయితే సాగుతోంది.