Begin typing your search above and press return to search.

జాతీయ పార్టీగా ‘జనసేన’..! కారణం ఇదే..

రాష్ట్ర రాజకీయాల్లోనే కాదు.. దేశ రాజకీయాల్లో సైతం చక్రం తిప్పే సత్తా ఉన్న నాయకుడు పవన్ కళ్యాణ్.

By:  Tupaki Desk   |   1 Sept 2025 12:14 AM IST
జాతీయ పార్టీగా ‘జనసేన’..! కారణం ఇదే..
X

దేశంలో గల్లీకో పార్టీ ఉన్నా.. కేంద్రంలో ఉన్నది మాత్రం ప్రధానంగా రెండే.. అవి ఎన్డీయే, యూపీఏ. ఒకటి జాతీయ డెమొక్రటిక్ అలియన్స్ ఇందులో ప్రధాన పార్టీ భారతీయ జనతా పార్టీ, రెండు యునైటెడ్ ప్రొగ్రసివ్ అలియన్స్ ఇందులో కాంగ్రెస్ పార్టీ ప్రధానంగా కొనసాగుతుంది. గతంలో కమ్యూనిస్ట్ పార్టీ ఉన్నా.. ఇప్పుడది కాంగ్రెస్ తో జతకట్టడంతో కనుమరుగైంది. ఏ పార్టీ అయినా తమ ప్రస్థానాన్ని గల్లీ నుంచే మొదలు పెట్టి ఢిల్లీ వరకు పాకుతుంది. ఇలా చాలా పార్టీలు ఢిల్లీ వరకు తమ జెండాలను తీసుకెళ్లినా.. ఏదో ఒక దాంట్లో కలువక తప్పలేదు. రాష్ట్రంలో కంటే దేశంలో చక్రం తిప్పడమే ప్రతి పార్టీకి కావాలి.

రాష్ట్ర రాజకీయాల్లోనే కాదు.. దేశ రాజకీయాల్లో సైతం చక్రం తిప్పే సత్తా ఉన్న నాయకుడు పవన్ కళ్యాణ్. సినిమా బ్యాగ్రౌండ్ తో వచ్చిన ఈయన ‘జనసేన’ పార్టీ పెట్టి దేశంలో పాపులర్ లీడర్ గా మారాడు. ఒక సీటుతో ప్రారంభమైన ఆయన పార్టీ ప్రస్థానం నేడు ప్రభుత్వం ఏర్పాటు చేసే స్థాయికి చేరుకుందంటే అతిశయోక్తి కాదు. అయితే ఇప్పుడు ఆ పార్టీని జాతీయ పార్టీగా మలుచాలనుకుంటున్నారు పవన్ కళ్యాణ్. దీనికి సంబంధించి ఇప్పటికే ప్రకటన కూడా చేశారు. రానున్న పదేళ్లలో జనసేన జాతీయ స్థాయిలో చక్రం తిప్పబోతోందని ఆయన వ్యాఖ్యానించారు. పార్టీని జాతీయ స్థాయిలోకి తీసుకెళ్లాలంటే మామూలు విషయం కాదు. చాలా కసరత్తు చేయాల్సి ఉంటుంది. అసలు పవన్ కళ్యాణ్ పార్టీని జాతీయ స్థాయికి ఎందుకు తీసుకెళ్తున్నారంటూ చర్చ మొదలైంది.

జనసేనతో అలియన్స్ లో ఉన్న పార్టీ టీడీపీ. టీడీపీ కూడా జాతీయ పార్టీగా నమోదు చేసుకుంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో దాదాపు చాలా సంవత్సరాలు ప్రభుత్వాన్ని నడిపిన టీడీపీకి రాష్ట్రం విడిపోయాక తెలంగాణలో కూడా కేడర్ ఉంది. ఈ విధంగా చూసుకుంటే తమిళనాడు, కర్ణాటక, ఒడిశాలతో పాటు తెలంగాణలో పార్టీకి కేడర్ ఉంది. కానీ ఇటీవల పార్టీ నాయకులు, కేడర్ కు పడడం లేదు. సొంత రాష్ట్రంలోనే పార్టీ పరిస్థితి బాగాలేదు. ఇప్పటికే పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు సీనియర్ జూనియర్ కు ఆదేశాలు ఇస్తూనే ఉన్నారు. ఈ నేపథ్యంలో ఇతర రాష్ట్రాల్లో పార్టీని ముందుకు తీసుకెళ్లడం కొంచెం కష్టంగా కనిపిస్తుంది.

ఇక జనసేన విషయానికి వస్తే ఏపీలో మంచి కేడర్ ఉంది. దీంతో పాటు సమీపంలోని తెలంగాణలో కూడా కేడర్ ను స్ట్రంతన్ చేసుకుంటుంది. ఇక పొరుగు రాష్ట్రమైన తమిళనాడుకు ఇటీవల పవన్ కళ్యాణ్ వెళ్లినప్పుడు వచ్చిన జన ప్రభంజనాన్ని అందరూ చూసే ఉంటారు. ఈ నేపథ్యంలో పార్టీని అక్కడ కూడా స్ట్రంతన్ చేయడం పెద్ద కష్టమైన పని కాదు. పైగా కేంద్రంలో ఎలాగూ అనుకూలమైన బీజేపీ ఉంది కాబట్టి మరింత సులువు అవుతుంది.

తమిళనాడులో జెండా పాతి దక్షిణాదిలో తమ ప్రభంజనం సృష్టించాలని బీజేపీ ఎప్పటి నుంచో ఎత్తుగడలు వేస్తోంది. ఇందులో భాగంగానే జనసేనను తమిళనాడులోకి తీసుకెళ్తే.. పవన్ చరిష్మా వాడుకొని అక్కడ ఎన్డీయే ఓట్లను కొంత వరకైనా చీల్చవచ్చని బీజేపీ భావిస్తోందన్న చర్చ జరుగుతోంది. వచ్చే సంవత్సరం తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికలు ఉన్నాయి. అప్పటి వరకు జనసేనను అక్కడ ఎస్టాబిలిష్ చేస్తే మంచి ప్రయోజనం ఉంటుందని వ్యూహం పన్నుతుంది. ‘తలపతి’ ఇటీవల పార్టీ ప్రారంభించాడు. జెండాను కూడా రిలీజ్ చేశాడు. అయితే ఈ పార్టీ తేవడం వెనుక పవన్ ఉండి ఉంటాడని అంతా చర్చ జరుగుతోంది. తమ అలియన్స్ లోని స్థానికంగా బలంగా ఉన్న పార్టీలను జాతీయ స్థాయిలో తీసుకువస్తే వారి చరిష్మాతో లోకల్ లో చక్రం తిప్పవచ్చని ఎన్డీయే వ్యూహం వేయడం ఎప్పటి నుంచో చేస్తుంది. అసోంలోని గణ పరిషత్ విషయంలో ఇలానే జరిగింది. తాము నేరుగా సత్తా చాటలేని చోట స్థానిక పార్టీలను ఎంకరేజ్ చేయడం వల్ల గట్టెక్కవచ్చని బీజేపీకి తెలుసు.