జనసేనలో గ్రౌండ్ పాలిటిక్స్ స్టార్ట్... !
రాజకీయాల్లో ఎలాంటి వ్యూహాత్మక ఎత్తుగడలైనా పనిచేస్తాయి. ఒక్కొక్క సమయంలో ఒక్కొక్క విధంగా ఈ వ్యూహాలు ఉంటాయి.
By: Tupaki Desk | 1 July 2026 7:00 AM ISTరాజకీయాల్లో ఎలాంటి వ్యూహాత్మక ఎత్తుగడలైనా పనిచేస్తాయి. ఒక్కొక్క సమయంలో ఒక్కొక్క విధంగా ఈ వ్యూహాలు ఉంటాయి. తాజాగా జనసేన నియోజకవర్గాల వారీగా పాలిటిక్స్‌ను ముందుకు తీసుకువెళ్లాలని నిర్ణయించింది. అవి కూడా పార్లమెంటు స్థానాలను దృష్టిలో పెట్టుకుని చేరికల కమిటీలను ఏర్పాటు చేశారు. అదేసమయంలో జనసేన పాత నాయకులకు ప్రాధాన్యం ఇవ్వాలని నిర్ణయించారు. ఇవన్నీ నియోజకవర్గాల వారీగా చేపట్టిన చర్యలే.
ఎందుకిలా.. ?
రాష్ట్ర వ్యాప్తంగా రాజకీయాలు చేయాలని పార్టీలు భావిస్తాయి. రాష్ట్రస్థాయిలో నాయకులను ఎంపిక చేసుకు ని బాధ్యతలు అప్పగించడం కూడా తెలిసిందే. అయితే.. తొలిసారి జనసేన మాత్రం పార్లమెంటు నియోజ కవర్గాల ను ప్రాతిపదికగా చేసుకుని రాజకీయాలకు శ్రీకారం చుట్టింది. దీనికి ప్రధాన కారణం.. రాష్ట్రస్థాయి కంటే కూడా.. క్షేత్రస్థాయిలో నాయకులకు ప్రాధాన్యం ఇస్తే.. పార్టీ మరింత బలంగా ముందుకు సాగుతుం దన్న కీలక సూత్రమే కారణం!.
ఇప్పటి వరకు దాదాపు అన్ని పార్టీలు రాష్ట్రస్థాయిలోనే రాజకీయాలు చేస్తున్నాయి. కానీ, పార్లమెంటరీ నియోజకవర్గాలను తీసుకుని అధ్యయనం చేయడం ద్వారా ఆ పరిధిలోని అసెంబ్లీ స్థానాల్లో ఉన్న నాయకుల లోటు పాట్లతోపాటు.. వారికి ఇవ్వాల్సిన ప్రాధాన్యం ఇస్తున్నామా లేదా అనే విషయంకూడా పార్టీకి తెలుస్తుంది. ఇదే ఫార్ములాను జనసేన అనుసరిస్తోంది. తద్వారా జెండా మోసిన వారికి మరింత అవకాశం లభిస్తుందని జనసేన అధినేత చెబుతున్నారు.
ఓటు బ్యాంకు..
కీలకమైన ఓటు బ్యాంకు కదలాలంటే క్షేత్రస్థాయిలో నాయకులు బలంగా ఉండాలి. ఈ తరహా ఓటు బ్యాంకు కోసమే జనసేన ఇప్పుడు క్షేత్రస్థాయి పాలిటిక్స్‌కు ప్రాధాన్యం పెంచింది. ఉదాహరణకు గిరిజన ప్రాంతాల్లో ఆ వర్గానికే ప్రాదాన్యం ఇవ్వనున్నారు. ఎస్సీ నియోజకవర్గాల్లో వారికే అవకాశం కల్పించను న్నారు. జనరల్ నియోజకవర్గాల్లో కూడా.. ఎక్కువగా ఉన్న జనాభాకు ప్రాధాన్యం ఇస్తారు. అటు పార్టీలోను, ఇటు పదవుల విషయంలోనూ.. ఇలా చేయడం ద్వారా క్షేత్రస్థాయి నాయకుల్లో తాము ఎదగాలన్న కసి మరింత పెరిగి అది అంతిమంగా పార్టీని డెవలప్ చేసుకునేందుకు ఉపయోగపడుతుంది. ఈ వ్యూహంతో నే జనసేన క్షేత్రస్థాయి రాజకీయాలకు ప్రాధాన్యం ఇస్తోందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
