జనసేనలో ఆ స్ఫూర్తి లేదా... ఇలా అయితే ఓటు బ్యాంకు ఎలా..?
ఒక పార్టీ అంటే.. ఖచ్చితంగా ప్రజల్లో ఒక ముద్ర ఉంటుంది. దాని ప్రకారమే నడుచుకోవాలి. ప్రజల్లోనూ గుర్తింపు తెచ్చుకునేందుకు ప్రయత్నించాలి.
By: Tupaki Desk | 19 July 2025 8:45 AM ISTఒక పార్టీ అంటే.. ఖచ్చితంగా ప్రజల్లో ఒక ముద్ర ఉంటుంది. దాని ప్రకారమే నడుచుకోవాలి. ప్రజల్లోనూ గుర్తింపు తెచ్చుకునేందుకు ప్రయత్నించాలి. కానీ.. ఈ స్ఫూర్తిని జనసేన నాయకులు కోల్పోతున్నారు. పార్టీ అధినేతపైనే నాయకులు ఆధారపడుతున్నారన్నది బహిరంగ రహస్యమే. నిజానికి పార్టీలో అధినేత బలంగానే ఉన్నా.. క్షేత్రస్థాయిలో నాయకులు బలపడకూడదని.. అలా చేయొద్దని ఏ పార్టీ కూడా చెప్పదు . ఏ నాయకుడు కూడా చెప్పరు.
ఉన్నంతలో ఉన్నంత.. నాయకులు తమ తమ శక్తి మేరకు బల పడితే.. అది వారికి, పార్టీకి కూడా మంచి దే. కానీ, ఈ స్ఫూర్తిని జనసేన నాయకులు మరిచిపోతున్నారు. అదే ఇప్పుడు వారికి పెను శాపంగా మారు తోంది. గత ఎన్నికల్లో 21 మంది జనసేన నాయకులు విజయం దక్కించుకున్నారు. ఇది 100 పర్సంట్ స్ట్రియిక్ రేట్‌గా పార్టీ ప్రచారం చేసుకుంది. కానీ, ఏడాది తిరిగే సరికి.. ప్రజల్లో సగానికి పైగా నాయకులు పలచనయ్యారు. ఈ విషయం.. జనసేన అంటే ఎంతో ఇష్టపడే ఓ సర్వే సంస్థ అధిపతి చెప్పుకొచ్చారు.
దీనికి కారణాలు.. మూడు ఉన్నాయని.. వాటిని సరిచేసుకోవాలని కూడా సదరు అధిపతి సూచించారు.
1) పవన్‌పైనే ఆధారపడి రాజకీయాలు చేయడం: ఇది సహజంగానే పార్టీలో ఉంది. తమ నాయకుడే తమను గెలిపిస్తాడన్న ధీమా ఎక్కువగా కనిపిస్తోంది. అలానే.. మళ్లీ కూటమి హవా రాకపోతుందా గెలవకపోతామా? అని కూడా కొందరు అభిప్రాయపడుతున్నారు. ఇది సరికాదు.
2) ప్రజలకు చేరువ కాకపోవడం. ఇది పూర్తి గా అందరికీ తెలిసిందే. జనసేన నాయకులు ఒక్కరంటే ఒక్కరు కూడా.. ప్రజల మధ్యకు రావడం లేదు. మంత్రులు మినహా.. ఎవరూ ప్రజలకు చేరువ కాలేక పోతున్నారు.
3) అతి విశ్వాసం. ఇది కూడా జనసేన నాయకుల్లో ఎక్కువగా ఉంది. కానీ, చరిత్రను చూసుకుంటే.. అతివి శ్వాసం కొంప ముంచిన పరిస్థితి కనిపిస్తుంది. ఎన్టీఆర్ అంతటి నాయకుడే.. ఓడిపోయిన పరిస్థితి ఉంది. సో.. ఎప్పుడూ పవన్ ఇమేజ్ ఉంటుందని అనుకోవడం.. సాధ్యం కాకపోవచ్చు. వ్యక్తిగతంగా నాయకులు ఎదిగినప్పుడు మాత్రమే ప్రజల మధ్య సింపతీ సొంతం చేసుకుంటారు. అలా కాకుండా.. పరాన్న జీవుల మాదిరిగా మిగిలిపోవాలని.. స్పూర్తి లేని రాజకీయాలు చేయాలని అనుకుంటే.. వచ్చే ఎన్నికల నాటికి మార్పులు తప్పవని అంటున్నారు సర్వే అధిపతి.
