పవన్, నాగబాబుపై అంబటి సెటైర్లు.. జగన్ పై జనసేన కౌంటర్లు!
దీనిపై అంబటి రాంబాబు నుంచి సెటైర్లు పడగా.. జగన్ పై జనసేన ఎమ్మెల్యే కీలక వ్యాఖ్యలు చేశారు.
By: Tupaki Desk | 7 March 2025 12:55 PMఎమ్మెల్యేల కోటా ఎమ్మెల్సీ అభ్యర్థిగా జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి, డిప్యూటీ సీఎం పవన్ సోదరుడు కొణిదెల నాగబాబు నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా రిటర్నింగ్ అధికారిణి వనితా రాణికి నాగబాబు తన నామినేషన్ పత్రాలు సమర్పించారు. దీనిపై అంబటి రాంబాబు నుంచి సెటైర్లు పడగా.. జగన్ పై జనసేన ఎమ్మెల్యే కీలక వ్యాఖ్యలు చేశారు.
అవును... ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్థిగా నాగబాబు నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా నాగబాబు అభ్యర్థిత్వాన్ని మంత్రి నారా లోకేష్, రాష్ట్ర టీడీపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు, బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు బలపరిచారు. దీనిపై వైసీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు స్పందించారు. పవన్, నాగబాబుని ట్యాగ్ చేస్తూ ఓ పోస్ట్ పెట్టారు.
ఇందులో భాగంగా... "అన్నను దొడ్డిదారిన మంత్రివర్గంలోకి తీసుకురావడంలో ఘన విజయం సాధించిన తమ్ముడికి శుభాకాంక్షలు!" అని అంబటి రాంబాబు పోస్ట్ చేశారు. దీంతో... ఈ పోస్ట్ నెట్టింట హల్ చల్ చేయడం మొదలుపెట్టింది. కామెంట్ సెక్షన్ లో వైసీపీ వర్సెస్ జనసేన వార్ స్టార్ట్ అయ్యింది!
ఈ సమయంలో జనసేన నుంచి స్ట్రాంగ్ కౌంటర్ పడింది. ఇందులో భాగంగా... తాడేపల్లిగూడెం అసెంబ్లీ నియోజకవర్గం జనసేన ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ స్పందించారు. ఈ సందర్భంగా వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రిపై సంచలన వ్యాఖ్యలు చేశారు. వైఎస్సార్ లేకపోతే జగన్ కౌన్సిలర్ కూడా కాలేరని అన్నారు.
ఈ సందర్భంగా స్పందిస్తూ... "అంబటి రాంబాబు చెబుతూ.. పుడతానే ఎంపీ పదవితో పుట్టారు జగన్ మోహన్ రెడ్డి అని.. తండ్రి ముఖ్యమంత్రి కాకపోతే.. జగన్ మోహన్ రెడ్డి ఎంపీ కాదు కదా.. కనీసం కౌన్సిలర్ కూడా అవ్వలేరు" అని అన్నారు.
కాగా... వైసీపీ ప్రతిపక్ష హోదాపై ఇటీవల పవన్ స్పందిస్తూ.. సీట్ల ప్రకారం చూస్తే వైసీపీకి ఈ ఐదేళ్లలో ప్రతిపక్ష హోదా రాదని, అలా రావాలంటే జర్మనీ వెళ్లాలంటూ సెటైర్లు వేసిన సంగతి తెలిసిందే. దీనిపై స్పందించిన జగన్...పవన్ కార్పొరేటర్ కు ఎక్కువ, ఎమ్మెల్యేకు తక్కువ, ఆయన జీవితంలో ఒక్కసారి ఎమ్మెల్యేగా గెలిచారంటూ ఎద్దేవా చేసిన సంగతి తెలిసిందే.