Begin typing your search above and press return to search.

'ఆపరేషన్ బిహాలీ'... జమ్మూ కాశ్మీర్ లో ఎన్ కౌంటర్ వివరాలివే!

ఈ క్రమంలో తాజాగా జమ్మూ కాశ్మీర్ లోని బసంత్‌ గఢ్‌ లో భారత సైన్యం, పోలీసులు నిర్వహించిన సంయుక్త ఆపరేషన్‌ లో గురువారం ఒక ఉగ్రవాది హతమయ్యాడు.

By:  Tupaki Desk   |   27 Jun 2025 12:36 AM IST
ఆపరేషన్  బిహాలీ... జమ్మూ కాశ్మీర్  లో ఎన్  కౌంటర్  వివరాలివే!
X

పహల్గాం ఉగ్రదాడి అనంతరం జమ్మూ కాశ్మీర్ లో అటు పోలీసులు, ఇటు భారత సైన్యం అవిరామంగా ఉగ్రవాదుల వేట కొనసాగిస్తున్న సంగతి తెలిసిందే. ప్రధానంగా పహల్గాం ఉగ్రదాడికి పాల్పడిన ఉగ్రవాదులను తుదముట్టించాలని కంకణం కట్టుకుని సైన్యం ముందుకు కదులుతోందని అంటున్నారు! ఈ నేపథ్యంలో తాజాగా బసంత్ గఢ్ లో ఎన్ కౌంటర్ జరిగింది.

అవును... అవును... జూమ్మూ కాశ్మీర్ సరిహద్దుల్లో ఉగ్రవాది అనేవాడు కనిపించకూడదని.. ఉగ్రవాది అనేవాడు భారత్ భూభాగంలోకి ప్రవేశించడానికే వణకాలని భారత సైన్యం ఫిక్సైన సంగతి తెలిసిందే! ఈ నేపథ్యంలో... పహల్గాం ఉగ్రదాడి అనంతరం నిర్వహించిన ఆపరేషన్ సిందూర్ తో ఉగ్రవాదులను భారీ దెబ్బ కొట్టిన సైన్యం.. సరిహద్దులను జల్లెడ పడుతోంది.

ఈ క్రమంలో తాజాగా జమ్మూ కాశ్మీర్ లోని బసంత్‌ గఢ్‌ లో భారత సైన్యం, పోలీసులు నిర్వహించిన సంయుక్త ఆపరేషన్‌ లో గురువారం ఒక ఉగ్రవాది హతమయ్యాడు. ఈ విషయాన్ని వైట్ నైట్ కార్ప్స్ ఎక్స్ వేదికగా పంచుకుంటూ.. ఆపరేషన్ కొనసాగుతోందని వెల్లడించింది. ఈ రోజు ఉదయం నుంచే ఈ ఆపరేషన్ ప్రారంభమైనట్లు చెబుతున్నారు.

ఈరోజు తెల్లవారుజామున అందిన నిఘా వర్గాల సమాచారం ఆధారంగా బలగాలు బసంత్‌ గఢ్‌ లో 'ఆపరేషన్ బిహాలి'ని ప్రారంభించాయి. ఈ సమయంలో... సుమారు గత పన్నెండు నెలలుగా నిఘాలో ఉన్న నలుగురు జైష్- ఎ-మొహమ్మద్ ఉగ్రవాదులను ఉధంపూర్ జిల్లాలోని ఒక అటవీ ప్రాంతంలో ఉదయం 8:30 గంటల ప్రాంతంలో భద్రతా దళాలు చుట్టుముట్టాయని తెలుస్తోంది.

ఈ సందర్భంగా స్పందించిన జమ్మూ రేంజ్ ఇనిస్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ భీమ్ సేన్... వర్షం, పొగమంచు వేళ సవాలుతో కూడిన వాతావరణ పరిస్థితులను ఏమాత్రం లెక్కచేయకుండా ఉగ్రవాదులను మట్టుబెట్టడానికి దళాలు అప్పటి నుండి కృషి చేస్తున్నాయని తెలిపారు. గత ఏడాది కాలంగా తాము పర్యవేక్షిస్తున్న నలుగురు ఉగ్రవాదులు ఉన్నట్లు భావిస్తున్నట్లు చెప్పారు.

పొగమంచు కారణంగా దృశ్యమానత తక్కువగా ఉన్నప్పటికీ.. సెర్చింగ్ కొనసాగుతోందని.. వాతావరణ పరిస్థితులు మెరుగుతుపడిన తర్వాత మరింత స్పష్టమైన పరిస్థితి ఏర్పడుతుందని అన్నారు. పాక్ కేంద్రంగా పనిచేస్తున్న జేఎంకు చెందిన ఉగ్రవాదులను.. సైన్యం కరూర్ నల్లా సమీపంలో కనుగొన్నట్లు అధికారులు తెలిపారు.