నీతులు చెప్పే యూరప్‌కు వాస్తవాల ‘డోస్’.. జైశంకర్ పంచ్‌లకు విదేశీ జర్నలిస్ట్ మైండ్ బ్లాక్!
తాజాగా యూరోపియన్ల ‘అతి తెలివి’కి ఆయన ఇచ్చిన ‘సౌండ్’ ట్రీట్‌మెంట్ ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేస్తోంది.
By: A.N.Kumar | 12 Jun 2026 1:19 PM ISTఇంటర్నేషనల్ వేదికలపై మన విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ మైక్ పట్టుకున్నారంటే చాలు... అవతలి దేశాల ప్రతినిధులకు చెమటలు పట్టాల్సిందే. తాజాగా యూరోపియన్ల ‘అతి తెలివి’కి ఆయన ఇచ్చిన ‘సౌండ్’ ట్రీట్‌మెంట్ ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేస్తోంది.
ప్రపంచానికి ప్రజాస్వామ్యం, హక్కులు, నైతికత అంటూ రోజూ పొద్దున్నే లేచి ఫ్రీగా ట్యూషన్లు చెప్పే యూరోపియన్ దేశాలకు మన విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ గట్టి ‘డోస్’ ఇచ్చారు. "నీతులు చెప్పడం ఈజీ బ్రదర్... పాటించడమే కష్టం" అనే రేంజ్‌లో ఆయన వేసిన కౌంటర్లకు సోషల్ మీడియాలో నెటిజన్లు ఫిదా అయిపోతున్నారు. "అట్లుంటది మరి జైశంకర్‌తో పెట్టుకుంటే!" అంటూ మీమ్స్‌తో హోరెత్తిస్తున్నారు.
సీన్ కట్ చేస్తే... ఫిన్లాండ్‌లో ఏం జరిగిందంటే?
ఫిన్లాండ్ పర్యటనలో ఉన్న జైశంకర్‌ను ఎలాగైనా ఇరుకున పెట్టాలని ఓ విదేశీ జర్నలిస్ట్ ప్లాన్ చేశాడు. రష్యా-ఉక్రెయిన్ యుద్ధాన్ని సాకుగా చూపిస్తూ "రష్యా దగ్గర భారత్ ఎందుకు అంతలా చమురు కొంటోంది? మీరు మాస్కోకు పరోక్షంగా సపోర్ట్ చేస్తున్నట్టే కదా?" అంటూ ఒక పదునైన బాణం విసిరాడు. కట్ చేస్తే... ప్రశ్న పూర్తి కాకముందే జైశంకర్ తనదైన స్టైల్లో ‘రివర్స్ అటాక్’ మొదలుపెట్టారు.
జైశంకర్ ఇచ్చిన ‘ఉచిత’ సలహా
"నిజానికి మాకు సాంప్రదాయకంగా చమురు సరఫరా చేసేది మధ్యప్రాచ్య దేశాలు. కానీ ఉక్రెయిన్ సంక్షోభం రాగానే మీ యూరోపియన్ దేశాలన్నీ పరుగెత్తుకుంటూ వెళ్లి ఆ మిడిల్ ఈస్ట్ ఆయిల్‌నంతా మీరే కొనేశారు. మాకు ఆప్షన్స్ లేకుండా చేశారు. మరి మా దేశ ప్రజల ప్రయోజనాల కోసం మేము ప్రత్యామ్నాయంగా రష్యా వైపు చూడక ఏం చేస్తాం?" ఈ దెబ్బతో సదరు జర్నలిస్టుకు కాసేపు మైండ్ బ్లాక్ అయింది. సభలో ఒక్కసారిగా ‘పిన్ డ్రాప్ సైలెన్స్’
ఇంకొక్క బుల్లెట్...
అక్కడితో ఆగితే ఆయన జైశంకర్ ఎందుకవుతారు? యూరప్ చరిత్రను తిరగేస్తూ మరో స్ట్రాంగ్ పంచ్ ఇచ్చారు. "భారతదేశ ఆయుధాలతో యూరప్‌పై ఎప్పుడూ ఏ దాడి జరగలేదు. కానీ మీ యూరోపియన్ ఆయుధాలతో భారత భూభాగంపై ఎన్నో దాడులు జరిగాయి.. మా వాళ్లు ప్రాణాలు కోల్పోయారు. అది మర్చిపోవద్దు!"ఈ దెబ్బకు ప్రశ్న అడిగిన జర్నలిస్ట్, స్క్రిప్ట్ మార్చేసి... తర్వాతి ప్రశ్నకు జంప్ అయిపోయాడని సోషల్ మీడియాలో వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు.
నెటిజన్ల ‘సెటైర్ల’ పండగ!
ఈ సీన్ చూసిన భారతీయ నెటిజన్లు ఊరుకుంటారా? సోషల్ మీడియాలో ట్రోల్స్, మీమ్స్‌తో యూరప్ దేశాలను ఆడుకుంటున్నారు. "నీతులు ఎగుమతి చేసే యూరప్‌కు... వాస్తవాలు దిగుమతి చేసిన జైశంకర్!" "ప్రశ్న అడిగినప్పుడు వాడు జర్నలిస్ట్... సమాధానం విన్నాక జైశంకర్ క్లాస్‌లో ‘ఫస్ట్ బెంచ్’ స్టూడెంట్.. ఒకప్పుడు మనవాళ్లు డిప్లొమాటిక్‌గా ఖండించేవారు... ఇప్పుడు డైరెక్ట్‌గా గుండెల్లో దింపేస్తున్నారు!" అంటూ సెటైర్లు వేస్తున్నారు.
అంతర్జాతీయ రాజకీయాల్లో శాశ్వత స్నేహితులు, శాశ్వత శత్రువులు ఉండరు... కేవలం ‘శాశ్వత ప్రయోజనాలు’ మాత్రమే ఉంటాయి. ఆ ప్రయోజనాలను కాపాడుకోవడంలో దేశ ప్రయోజనాల కోసం ప్రపంచ వేదికలపై తలవంచకుండా మాట్లాడడంలో భారత్ ఇప్పుడు రూట్ మార్చిందని జైశంకర్ మరోసారి నిరూపించారు. సో... ఇకనైనా మనకు క్లాసులు పీకే ముందు యూరప్ దేశాలు ఒకటికి రెండుసార్లు ఆలోచించుకుంటే మంచిది.
