Begin typing your search above and press return to search.

కర్నూల్ ఘటన మరువకముందే మరో బస్సు దగ్ధం.. ఎంత మంది మరణించారంటే..?

కర్నూలు దుర్ఘటన మరవకముందే.. అలాంటిదే మరో ఘటన జరిగింది. ఈ సారి కూడా ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు దగ్ధమై ప్రయాణికులు ప్రాణాల కోసం విలవిలలాడారు.

By:  Tupaki Desk   |   28 Oct 2025 3:07 PM IST
కర్నూల్ ఘటన మరువకముందే మరో బస్సు దగ్ధం.. ఎంత మంది మరణించారంటే..?
X

కర్నూలు దుర్ఘటన మరవకముందే.. అలాంటిదే మరో ఘటన జరిగింది. ఈ సారి కూడా ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు దగ్ధమై ప్రయాణికులు ప్రాణాల కోసం విలవిలలాడారు. వరుస ప్రమాదాలతో ఇటు ట్రావెల్స్ యాజమాన్యం.. అటు ప్రయాణికులు ఆంధోళనగా ఉన్నారు. దూరమైన గమ్యాలను చేరేందుకు ఎక్కువగా ప్రైవేట్ ట్రావెల్స్ ఉపయోగపడతాయి. రైలు లేదంటే ఇలాంటి ట్రావెల్సే తక్కువ సమయంలో గమ్య స్థానాలకు చేరుస్తాయి. కానీ మంచి ఉన్న చోటునే చెడు కూడా ఉంటుంది కదా.. అదే విధంగా ఒక్కోసారి డ్రైవర్ లోపం మరోసారి టెక్నికల్ ఇంకో సారి రోడ్డు ప్రమాదం ఇలా కారణం ఏదైనా ప్రాణం పోవడం మాత్రం కామన్ గా మారుతుంది.

రాజస్థాన్‌లోని జైపూర్-ఢిల్లీ హైవేలో మంగళవారం (అక్టోబర్ 28, 2025) దారుణ ఘటన జరిగింది. లేబర్ ను తీసుకెళ్తున్న ఒక ప్రైవేట్ బస్సు షాహ్‌పురా సమీపంలో హై టెన్షన్ విద్యుత్ వైర్లకు తగిలి దగ్ధమైంది. ఈ ప్రమాదంలో ముగ్గురు సజీవ దహనమయ్యారు. మరో 10 మందికి తీవ్ర గాయాలయ్యాయి. బస్సులో 12 మంది ఉండగా, డ్రైవర్ కంట్రోల్ కోల్పోయి వైర్లకు తగలడంతో విద్యుత్ షాక్ తో మంటలు అంటుకున్నాయి. రెస్క్యూ టీమ్‌లు చేరుకొని గాయపడినవారిని జైపూర్ ఆసుపత్రులకు తరలించారు, మరణించినవారి శవాలు కాలిపోయి గుర్తింపు కష్టంగా మారింది. 26న ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూల్‌లో 19 మంది, అక్టోబర్ 14న రాజస్థాన్‌లోని జైసల్మేర్‌లో 26 మంది ఇలాంటి ఘటనల్లోనే మరణించారు.

ప్రమాదాలను లోతుగా పరిశీలిస్తే...

జైపూర్ ఘటనకు సంబంధించి లోతుగా పరిశీలిస్తే.. ఇది వ్యక్తిగత దుర్ఘటన కాదు.. విస్తృత సమస్యకు భాగం బస్సు రన్నింగ్‌లో ఉండగా హైవేలో లోతట్టులో ఉన్న హై టెన్షన్ వైర్లు (11 KV)కు తగలడం, విద్యుత్ స్పార్క్‌తో ఫ్యూయల్ ట్యాంక్ పేలి ఫైర్ కావడం ఆందోళన కలిగించే అంశమే. డ్రైవర్ వాహనం కంట్రోల్ కోల్పోయాడని రాజస్థాన్ పోలీసులు చెప్పారు. కానీ ఇక్కడ వైర్ల ఎత్తు.. రోడ్డు మెయింటెనెన్స్‌ లోపాలు కొట్టొచ్చినట్లు కనిపిస్తున్నాయి.

రెండు రోజుల క్రితం కర్నూల్‌ ప్రమాదంను పరిశీలిస్తే.. బైకర్ ను ఢీ కొన్న బస్సు కింద నుంచి మంటలు వ్యాపించడం బస్సులో ఎక్కువ మొత్తంలో స్మార్ట్ ఫోన్లు ఉండడంతో అందులోకి లీథియం బ్యాటరీలు సైతం ఫైర్ తీవ్రతను పెంచాయి. ఇందులో 19 మంది మరణించారు. ఇక జైసల్మేర్ ఘటన గురించి పరిశీలస్తే.. జైసల్మేర్-జోధ్‌పూర్ రోడ్డుపై ఏసీ బస్సు షార్ట్ సర్క్యూట్‌తో దగ్ధమైంది. ఇందులో 26 మంది మరణించారు. ఫోరెన్సిక్ రిపోర్ట్ ప్రకారం.. బస్సు కొనుగోలు చేసిన 5 రోజుల్లోనే ఏసీ కన్వర్షన్ లోపాలు కారణం అని తెలిసింది. ఈ మూడు ఘటనల్లోనూ ప్రైవేటు బస్సులు, లోపమైన మెయింటెనెన్స్ అని స్పష్టంగా తెలుస్తోంది.

వెహికల్ సేఫ్టీ స్టాండర్డ్స్‌ను కఠినతరం చేయాలి..

ప్రైవేటు బస్సులను నెలకోసారి తనిఖీ చేయాలి. ఫైర్ ప్రూఫ్ మెటీరియల్స్, ఎమర్జెన్సీ ట్రైనింగ్ తప్పనిసరి.. హైవేల్లో హై టెన్షన్ వైర్లు రోడ్డుకు 20 మీటర్ల దూరంలో ఉంచాలి, వార్నింగ్ సైన్స్ పెట్టాలి. NHAI, స్టేట్ హైవే అథారిటీలు జాయింట్ ఆడిట్స్ చేయాలి. డ్రంక్ డ్రైవింగ్‌పై జీరో టాలరెన్స్ AI కెమెరాలు, బ్రీత్ అనాలైజర్ చెకప్ లు, పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్‌లో బీమా, కాంపెన్సేషన్ ఫండ్ ఏర్పాటు చేయాలి. లేబరర్లు, డ్రైవర్లకు సేఫ్టీ వర్క్‌షాప్‌లు. సెంట్రల్ మోటార్ వెహికల్స్ రూల్స్‌ను అప్‌డేట్ చేసి, ఎలక్ట్రిక్ వెహికల్స్‌కు స్పెషల్ గైడ్‌లైన్స్ తీసుకోవాలి. ఎమర్జెన్సీ సర్వీసెస్ (అంబులెన్స్, ఫైర్ టెండర్లు)ను 15 నిమిషాల్లో చేరేలా బలోపేతం చేయాలి.

జైపూర్, కర్నూల్, జైసల్మేర్ ఘటనలు దేశ రోడ్డు భద్రతా వ్యవస్థ యొక్క లోపాలను స్పష్టంగా సూచిస్తున్నాయి. ఈ మరణాలు ‘అనుకోకుండా’ కాదు.. నిర్లక్ష్యం, లోపాల ఫలితాలు. ప్రభుత్వాలు, ఆపరేటర్లు, పబ్లిక్ అందరూ సహకరించి.. జీరో టాలరెన్స్ పాలసీ అమలు చేస్తే.. ఈ దుర్గతి తగ్గవచ్చు.