Begin typing your search above and press return to search.

నేరం చేయకున్నా 18 ఏళ్లకు జైలు.. లా చదివి నిర్దోషిగా బయటకు

కొన్ని రియల్ ఉదంతాలు రీల్ కు మించినట్లుగా ఉంటాయి. ఆ కోవలోకే వస్తుంది తాజా ఉదంతం. చేయని నేరానికి పద్దెనిమిదేళ్ల వయసులో జైలుపాలయ్యాడో వ్యక్తి.

By:  Tupaki Desk   |   11 Dec 2023 5:30 PM GMT
నేరం చేయకున్నా 18 ఏళ్లకు జైలు.. లా చదివి నిర్దోషిగా బయటకు
X

కొన్ని రియల్ ఉదంతాలు రీల్ కు మించినట్లుగా ఉంటాయి. ఆ కోవలోకే వస్తుంది తాజా ఉదంతం. చేయని నేరానికి పద్దెనిమిదేళ్ల వయసులో జైలుపాలయ్యాడో వ్యక్తి. తన కర్మ అంటూ అక్కడితో ఆగని అతడు.. రీల్ లో మాదిరి రియాక్టు అయ్యారు. పట్టుదలతో లా చదివి.. తన కేసును తాను వాదించుకొని.. చివరకు నిర్దోషిగా జైలు నుంచి బయటకు వచ్చిన ఈ ఉదంతం ఇప్పుడు అందరిని ఆకర్షిస్తోంది. ఇక్కడ మరో ఆసక్తికరమైన విషయం ఏమంటే.. ఈ కేసులో అన్యాయం ఇరుక్కున్న మరో పదమూడు మందిని తనతో పాటు జైలు నుంచి విముక్తి అయ్యేలా చేశాడు.

పన్నెండేళ్ల క్రితం యూపీలోని మేరఠ్ పట్టణంలో ఇద్దరు పోలీసు కానిస్టేబుళ్లు హత్యకు గురయ్యారు. అప్పట్లో ఈ ఉదంతం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది. ఈ హత్యలకు పాల్పడిన నిందితుల్ని తక్షణమే అరెస్టు చేయాలంటూ అప్పటి ముఖ్యమంత్రి మాయావతి సైతం స్పందించి ఆదేశాలు జారీ చేశారు. ఈ నేపథ్యంలో పోలీసులు హడావుడితో మొత్తం17 మందిని అరెస్టు చేశారు.

అలా అరెస్టు అయిన వారిలో అమిత్ చౌదరి ఒకరు. రెండేళ్లు జైల్లో ఉన్న అతను 2013లో బెయిల్ మీద విడుదల అయ్యాడు. బయటకు వచ్చినంతనే లా కోర్సులో చేరాడు. బీఏ.. ఎల్ఎల్ బీ.. ఎల్ఎల్ఎం పూర్తి చేశాడు. బార్ కౌన్సిల్ పరీక్షలోనూ పాస్ అయ్యాడు. తన మీద ఆరోపణలున్న హత్య కేసును తనకు తానే వాదించుకోవటం మొదలుపెట్టాడు. ఈ క్రమంలో ఈ కేసును దర్యాప్తు చేస్తున్న అధికారిని బోనులో నిలబెట్టి ప్రశ్నించే క్రమంలో.. లాయర్ గా ఉన్న వ్యక్తి నిందితుడిగా ఆరోపణలు ఉన్న విషయాన్ని కనీసం గుర్తించలేకపోయారు.

మొత్తంగా తన కేసును తాను వాదించుకున్న అమిత్.. జరిగినదేమిటన్న విషయంతో పాటు.. పోలీసుల విచారణ ఏ మాత్రం సరిగా సాగలేదన్న విషయాన్ని న్యాయమూర్తి సైతం గుర్తించారు. దీంతో..అమిత్ తో పాటు మరో 13 మందిని నిర్దోషిగా ప్రకటిస్తూ కోర్టు తీర్పును ఇచ్చింది. ఈ కేసులో సుమిత్ కైల్.. నీతూ.. ధర్మేంద్రలు అసలు నిందితులుగా గుర్తించింది. వీరిలో సుమిత్ కైల్ 2013లో జరిగిన ఎన్ కౌంటర్ లో మరణించగా.. ధర్మేంద్ర క్యాన్సర్ తో చనిపోయాడు. నీతూకు మాత్రం యావజ్జీవంతో పాటు రూ.20వేల ఫైన్ విధిస్తూ న్యాయమూర్తి తీర్పును ఇచ్చారు.ఈ ఉదంతం పలువురిని ఆకర్షిస్తోంది.