Begin typing your search above and press return to search.

పార్వతీపురం వివాహితను అనంతపురం జైలర్ ఎంతలా వేధించాడంటే?

అతడో జైలర్. కానీ.. తన వక్రబుద్ధిని ప్రదర్శిస్తూ ఒక వివాహితను ఎంతలా వేధించాడో తెలిస్తే షాక్ తో నోట మాట రాదంతే.

By:  Tupaki Desk   |   12 April 2025 10:38 AM IST
Jailer Accused of Harassing Married Woman
X

అతడో జైలర్. కానీ.. తన వక్రబుద్ధిని ప్రదర్శిస్తూ ఒక వివాహితను ఎంతలా వేధించాడో తెలిస్తే షాక్ తో నోట మాట రాదంతే. ఆన్ లైన పరిచయం కాస్తా స్నేహంగా మారి.. వివాహితను వేధింపులకు గురి చేసిన వైనం వెలుగు చూడటం సంచలనంగా మారింది. న్యూడ్ కాల్ చేయాలని.. అకౌంట్ నెంబరు పెడితే డబ్బులు పంపిస్తానని చెబుతూ.. తాను చెప్పినట్లుగా చేయాలని వేధింపులకు గురి చేస్తున్న జైలర్ ను అరెస్టుకు ప్రయత్నిస్తే.. అతగాడు ముందస్తు బెయిల్ పొంది గాయబ్ అయిన వైనం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.

పోలీసు వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం ఉత్తరాంధ్రలోని పార్వతీపురం మన్యం జిల్లాకు చెందిన వివాహిత ఫేస్ బుక్ అకౌంట్ కు కొన్నాళ్ల క్రితం జైలర్ సుబ్బారెడ్డి నుంచి ఫ్రెండ్ రిక్వెస్టు వచ్చింది. తాను జైలర్ గా పని చేస్తున్నట్లుగా చెప్పి పరిచయం పెంచుకున్నాడు. సదరు వివాహిత ఫ్రెండ్ రిక్వెస్టును ఓకే చేయటంతో వారిద్దరి మధ్య చాటింగ్ మొదలైంది. స్నేహంగా ఉన్నట్లుగా నటిస్తూ..కొన్నాళ్లకు తన పాడు బుద్ధిని బయటపెట్టాడు.

న్యూడ్ కాల్స్ చేయటం.. అసభ్య మెసేజ్ లతో వేధించటం మొదలు పెట్టాడు. సదరు వివాహిత భర్త.. వారి బంధువు పోలీసు శాఖలోనే పని చేస్తుండటంతో.. తనకు ఎదురైన వేధింపుల గురించి వివాహిత తన భర్తకు చెప్పింది. బంధువు ఏసీపీగా పని చేస్తుంటే.. బాధితురాలి భర్త ఎస్ఐగా పని చేస్తుంటారు. దీంతో.. వారు జైలర్ కు ఫోన్ చేసి హెచ్చరించారు. వేధింపులు తక్షణం ఆపేయాలని చెప్పారు. తాను స్నేహంలో భాగంగానే మెసేజ్ లు పంపానని.. తప్పుగా అనుకోవద్దని.. సారీ చెప్పి మెసేజ్ లు పంపటం ఆపేశాడు.

మళ్లీ మార్చి 25 నుంచి పాడు మెసేజ్ లు చేయటం మొదలు పెట్టాడు. దీంతో.. జైలర్ వేధింపులు భరించలేని సదరు వివాహిత వివాఖ పోలీస్ కమిషనర్ శంకబ్రత బాగ్చికి ఫోన్ చేసి కంప్లైంట్ చేసింది. ఆయన ఈ అంశాన్ని తీవ్రంగా పరిగణిస్తూ తక్షణం ఈ కేసును సైబర్ క్రైం పోలీసులకు అందజేశారు. వారు కేసు నమోదు చేసి.. జైలర్ ను అరెస్టు చేసేందుకు అనంతపురం వెళ్లారు. కానీ.. అప్పటికే అతడు అక్కడి నుంచి పరారయ్యాడు. ఈ వ్యవహారంలో మరో ట్విస్టు ఏమంటే.. విశాఖకు వచ్చి 5వ ఏడీజే కోర్టులో ముందస్తు బెయిల్ తీసుకున్నాడు. రెండో రోజుల క్రితం విశాఖ పోలీసుల్ని కలిసి ముందస్తు బెయిల్ పత్రాల్ని అందించాడు. తాజా పరిణామాలతో జైళ్ల శాఖ డీజీకి విశాఖ పోలీసు కమిషనర్ బాగ్చి లేఖ రాశారు. ముందస్తు బెయిల్ ను రద్దు చేయాలంటూ పోలీసులు ప్రయత్నిస్తున్నారు. ఈ ఉదంతం ఏపీ పోలీసు శాఖలో తీవ్ర అలజడిని రేపటమే కాదు.. హాట్ టాపిక్ గా మారింది.