Begin typing your search above and press return to search.

కాంగ్రెస్ జగ్గారెడ్డికి ఆమె అసలైన ప్రత్యర్ధి

కాంగ్రెస్ పార్టీలో ఒక్కో నేతది ఒక్కో స్టైల్. అలాగే సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డిది మరో స్టైల్. ఆయన కుండ బద్దలు కొడతారు

By:  Tupaki Desk   |   6 Nov 2023 5:41 PM GMT
కాంగ్రెస్ జగ్గారెడ్డికి ఆమె అసలైన ప్రత్యర్ధి
X

కాంగ్రెస్ పార్టీలో ఒక్కో నేతది ఒక్కో స్టైల్. అలాగే సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డిది మరో స్టైల్. ఆయన కుండ బద్దలు కొడతారు. ఏది మాట్లాడినా కూడా గట్టిగానే ఉంటుంది. ఆయన మాటలు బాంబుల మాదిరిగా ఉంటాయి. అవసరం అయితే సొంత పార్టీ వారిని కూడా చీల్చి చెండాడుతారు.

అదే సమయంలో తనకు గిట్టని వారు అంటే మండిపోతారు. శపధాలు చేస్తారు, సవాళ్ళు చేస్తారు. ఇక తన గురించి తానే జోస్యాలు చెప్పుకుంటారు. ఎదుటి వారి జోస్యాలు చెబుతారు. అలాంటి జగ్గారెడ్డికి అసలైన ప్రత్యర్ధి ఎవరు అంటే ఆయన చెప్పిన సమాధానం ఆసక్తిగా ఉంది.

నా కూతురే నాకు అపోజిషన్ అని అన్నారు. జగ్గారెడ్డి కూతురు జయ రెడ్డి తండ్రికి రాజకీయంగా అండగా ఉంటూ ఉంటారు. ఆమెకు రాజకీయాల పట్ల ఆసక్తి ఉందని కూడా ప్రచారంలో ఉన్న మాట. తండ్రి ఎన్నికలలో గెలవాలని జయా రెడ్డి పెద్ద ఎత్తున గతంలో ప్రచారం చేశారు. ఇపుడూ చేస్తున్నారు.

ఇదిలా ఉంటే కాంగ్రెస్ ఎన్నికల హామీలను ఇచ్చింది. అవన్నీ కచ్చితంగా నెరవేరాలని జయా రెడ్డి తండ్రినే కోరిందని జగ్గారెడ్డి మీడియా ముఖంగా చెప్పారు. మీ ప్రభుత్వం వస్తే చెప్పినవి అన్నీ చేయాలని తన కుమార్తె కోరిందని జగ్గారెడ్డి చెప్పారు.

ఒకవేళ నేను కనుక ఇచ్చిన హామీలు చేయకపోతే ఎవరో నన్ను అడగనవసరం లేదు నా కుమార్తె అడ్డం పడుతుంది అని జగ్గారెడ్డి చెప్పడం విశేషం. ఇదిలా ఉంటే జగ్గారెడ్డి మనసులో ఏదీ దాచుకోరు అన్నది ఆయన వైఖరి చూస్తే అర్ధం అవుతుంది. ఈసారి కాంగ్రెస్ గెలుస్తుంది అది కూడా డెబ్బై సీట్లకు తక్కువ కాకుండా అని జగ్గారెడ్డి జోస్యం చెప్పారు.

కాంగ్రెస్ కి సీఎం ఎవరు అవుతారు అంటే ఆయన సోనియా గాంధీ మల్లికార్జున ఖర్గె నిర్ణయం తీసుకుంటారని చెప్పారు తప్ప పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి పేరు ఎత్తలేదు బహుశా ఆయనకు రేవంత్ అవుతారు అన్నది ఇష్టం లేదా అన్న చర్చ వస్తోంది. ఇక తాను కూడా ఏదో నాటికి సీఎం ని అవుతాను అని ఆయనే చెప్పుకున్నారు. దానికి పదేళ్ల సమయం పట్టవచ్చు అని అంటున్నారు. అంటే జగ్గారెడ్డి సీఎం కోరిక తీరడానికి టెన్ ఇయర్స్ ని టార్గెట్ గా పెట్టుకున్నారు అన్న మాట.

ఇక తన రాజకీయ వారసురాలిగా కుమార్తె జయా రెడ్డిని తీసుకుని రావాలని ఆయన చూస్తున్నారు.ఈసారికే సంగారెడ్డిలో తన కుమార్తెను కాంగ్రెస్ అభ్యర్ధిగా నిలబెట్టాలని ఆయన చూశారని అయితే హై కమాండ్ టికెట్ ఇవ్వలేదని జగ్గారెడ్డినే పోటీ చేయమని కోరిందని అంటున్నారు. ఏది ఏమైనా జగ్గారెడ్డి అపోజిషన్ ఎవరో తెలిసిపోయింది కాబట్టి జనాలు ఆయనకు ఓటు వేయాలనుకుంటే నిర్భయంగా వేయవచ్చు, జగ్గారెడ్డి ఏమి చేయకపోయినా ఇంట్లోనే నిలదీసే సీన్ ఉంది మరి.