Begin typing your search above and press return to search.

కెప్టెన్ జగన్ చెప్పినట్లు ఫీల్డింగ్ చేస్తా... మంత్రి ఆసక్తికర వ్యాఖ్యలు!

కాగా... ఎప్పటినుంచో నానుతున్నట్లుగా ఇన్ ఛార్జ్ ల మార్పు విషయంలో వైఎస్ జగన్ తాజాగా కీలక నిర్ణయాలు తీసుకున్న సంగతి తెలిసిందే.

By:  Tupaki Desk   |   12 Dec 2023 10:01 AM GMT
కెప్టెన్  జగన్  చెప్పినట్లు ఫీల్డింగ్  చేస్తా... మంత్రి ఆసక్తికర వ్యాఖ్యలు!
X

అధికార వైసీపీలో 11 నియోజకవర్గాల్లో కొత్త వారికి బాధ్యతలు అప్పగిస్తూ కీలక నిర్ణయాలు వెలువడిన సంగతి తెలిసిందే. ఈ సమయంలో... “టార్గెట్ 175 - వ్యక్తులు కాదు పార్టీ ముఖ్యం - గెలుపే లక్ష్యం” అన్నట్లుగా ముందుకు వెళ్తున్నప్పుడు ఈ మాత్రం సర్ధుబాట్లు అత్యంత సహజం అనే కామెంట్లు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో తాజాగా నియోజకవర్గ మార్పుపై మంత్రి ఆదిమూలపు సురేష్ స్పందించారు. ఈ సందర్భంగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

అవును... ప్రస్తుతం రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖా మంత్రి డాక్టర్‌ ఆదిమూలపు సురేష్‌ యర్రగొండపాలెం శాసనసభ్యుడుగా ఉండగా... తాజా మార్పుల్లో భాగంగా ఆయనను కొండపి నియోజకవర్గానికి ఇన్‌ చార్జిగా ప్రకటించారు. ఈ క్రమంలో ఇప్పటికే కొండపి ఇన్‌ చార్జిగా బాధ్యతలు నిర్వహిస్తున్న వరికూటి అశోక్‌ బాబును బాపట్ల జిల్లా వేమూరు నియోజకవర్గ ఇన్‌ చార్జిగా ప్రకటించారు. దీంతో ఈ విషయాలపై స్పందించిన సురేష్... ఇదంతా జగన్ ఫీల్డ్ సెట్టింగ్ అని అన్నారు.

ఇందులో భాగంగా... టార్గెట్ 175.. జగనన్న మా టీం కెప్టెన్.. వచ్చే మ్యాచ్ గెలవాలంటే సీఎం వైఎస్‌ జగన్ కూర్పు ఎలా ఉన్నా ఆయన ఫీల్డ్ సెట్టింగ్ ప్రకారం నడుచుకుంటాం అని అంటున్నారు ఆదిమూలపు. ఈ సందర్భంగా కొండేపి నియోజకవర్గంలో కార్యకర్తలను సమన్వయం చేసుకుంటూ అందరినీ కలుపుకుని పార్టీని బలోపేతం చేస్తాం అని తెలిపారు.

ఇదే సమయంలో కొండేపి నియోజకవర్గంలో గెలవాలన్న ధృడ సంకల్పంతో ముందుకు వెళ్తామని తెలిపిన మంత్రి ఆదిమూలపు సురేష్‌.. గతంలో పనిచేసిన ఇంఛార్జ్‌ లను కలుపుకుని, వారి సహాయ సహకారాలతో తీసుకుంటూ ముందుకు వెళ్తామని తెలిపారు. ఈ క్రమంలో వైఎస్ జగనన్న చేసిన మేలును ప్రజల్లోకి తీసుకెళ్తాం మని.. ఫలితంగా రాబోయే ఎన్నికల్లో కొండేపిలో వైసీపీ గెలుపు బావుటా ఎగుర వేస్తుందని ఆశిస్తున్నట్లు తెలిపారు.

కాగా... ఎప్పటినుంచో నానుతున్నట్లుగా ఇన్ ఛార్జ్ ల మార్పు విషయంలో వైఎస్ జగన్ తాజాగా కీలక నిర్ణయాలు తీసుకున్న సంగతి తెలిసిందే. వచ్చే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా జగన్ చకచకా పావులు కదుపుతున్నారు. కేడర్ లో ఆందోళన వచ్చే లోపు పరిష్కారం ఇచ్చేస్తున్నారు. ఈ క్రమంలో గెలుపు గుర్రాలనే రంగంలోకి దింపే క్రమంలో కొన్ని సర్ధుబాట్లు తప్పవని సంకేతాలు ఇస్తున్నారు.

ఈ క్రమంలోనే తాజాగా 11 నియోజకవర్గాల్లో కొత్త వారికి బాధ్యతలు అప్పగించారు వైఎస్ జగన్. ఇందులో ప్రధానంగా 5 ఎస్సీ రిజర్వర్డ్ నియోజకవర్గాలు ఉండగా.. నలుగురికి స్థానచలనం కల్పించారు. ఇందులో ప్రధానంగా మంత్రి ఆదిమూలపు సురేశ్‌ కు కొండేపి, మేరుగ నాగార్జునకు సంతనూతలపాడు, మేకతోటి సుచరితకు తాడికొండ బాధ్యతలు అప్పగించారు. మరో బీసీ మంత్రి విడుదల రజినికి చిలకలూరిపేట నుంచి గుంటూరు పశ్చిమ బాధ్యతలు అప్పగించారు.

ఈ క్రమంలోనే టార్గెట్ 175 పెట్టుకున్న నేపథ్యంలో కెప్టెన్ వైఎస్ జగన్ సెట్ చేసిన ఫీల్డింగ్ కి తగ్గట్లుగా పనిచేస్తామని మంత్రి ఆదిమూలపు సురేష్ చెబుతున్నారు.