Begin typing your search above and press return to search.

'జ‌గ‌న్ సారు.. మ‌రో మారు`.. అధిరిపోతున్న సోగ‌న్లు!

మా న‌మ్మ‌కం నువ్వే జ‌గ‌న్‌, జ‌గ‌న‌న్నే మా న‌మ్మ‌కం.. రావాలి జ‌గ‌న్‌, కావాలి జ‌గ‌న్‌.. వంటివి ఇప్ప‌టికే పాపుల‌ర్ అయ్యాయి.

By:  Tupaki Desk   |   29 Dec 2023 3:00 AM GMT
జ‌గ‌న్ సారు.. మ‌రో మారు`.. అధిరిపోతున్న సోగ‌న్లు!
X

మ‌రో మూడు మాసాల్లో జ‌ర‌గ‌నున్న ఎన్నిక‌ల‌కు సంబంధించి నినాదాల ప్రిప‌రేష‌న్‌లో ప్ర‌ధాన పార్టీలు బిజీగా ఉన్నాయి. టీడీపీ, వైసీపీలు ఈ విష‌యంలో దూకుడుగా ఉన్నాయి. ఇప్ప‌టికే వైసీపీ నుంచి అనేక నినాదాలు హ‌ల్చ‌ల్ చేస్తున్నాయి. మా న‌మ్మ‌కం నువ్వే జ‌గ‌న్‌, జ‌గ‌న‌న్నే మా న‌మ్మ‌కం.. రావాలి జ‌గ‌న్‌, కావాలి జ‌గ‌న్‌.. వంటివి ఇప్ప‌టికే పాపుల‌ర్ అయ్యాయి. ఇక‌, తాజాగా ఇస్తున్న నినాదాలు కూడా పార్టీని ప‌రుగులు పెట్టిస్తున్నాయి.

జ‌గ‌న్ సారు మ‌రో మారు.. నినాదం.. సోష‌ల్ మీడియాలో హ‌ల్చ‌ల్ చేస్తోంది. అదేవిధంగా జ‌గ‌న‌న్న‌.. మ‌రో సారి నువ్వే అన్నా! నినాదానికి కూడా నెటిజ‌న్లు ఫిదా అవుతున్నారు. గత ఎన్నిక‌ల స‌మ‌యంలో పాట‌ల రూపంలో దంచికొట్టిన ప్ర‌చారాన్ని మ‌రిపించేలా ఇప్పుడు కూడా అంతే స్థాయిలో ప్ర‌చారం ఉండాల‌న్న ల‌క్ష్యంతో వైసీపీ ముందుకు సాగుతోంది. ఈ క్ర‌మంలో స‌రికొత్త నినాదాల దిశ‌గా పార్టీ నాయ‌కులు, కార్య‌క‌ర్త‌ల‌ను ముందుకు న‌డిపిస్తోంది.

ఇక‌, టీడీపీ కూడా కొత్త నినాదాల‌పై దృష్టి పెట్టింది. చంద్ర‌న్న.. విజ‌న్‌, ఏపీ భ‌విత‌కు బాబు భ‌రోసా, బాబు భ‌రోసా.. భ‌విష్య‌త్తు గ్యారెంటీ వంటివి ప్ర‌జ‌ల్లోకి బాగానే వెళ్లాయి. ఇక‌, ఉద్య‌మ నినాదాలు కూడా ప్ర‌చారం లో ఉన్నాయి. అయితే.. ఎన్నిక‌ల‌ను దృష్టిలో పెట్టుకుని మ‌రిన్ని నినాదాల దిశ‌గా పార్టీ క‌స‌ర‌త్తు ప్రారం భించింది. ఐటీడీపీ స‌హా ఎన్నారై టీడీపీ కూడా నినాదాల రూప‌క‌ల్ప‌న దిశ‌గా క‌స‌ర‌త్తు చేస్తున్నారు.

మొత్తానికి ఒక‌వైపు నియోజ‌క‌వ‌ర్గాల్లో పార్టీ వ్యూహ‌లు.. మ‌రోవైపు నినాదాల క‌స‌ర‌త్తుతో పార్టీలు బిజీబిజీగా ఉండ‌డం గ‌మ‌నార్హం. ఈ క్ర‌మంలో కొత్త నినాదాల కోసం కూడా ప్ర‌య‌త్నాలు చే్స్తున్నారు. ఇక‌, ఎన్నిక‌ల స‌మ‌యంలో పాట‌లు రాసేందుకు, మ్యూజిక్ కంపోజ్ చేసేందుకు ఇప్ప‌టికే వైసీపీ, టీడీపీలు కాంట్రాక్టులు కుదుర్చుకున్న‌ట్టు స‌మాచారం. వ‌చ్చే ఎన్నిక‌ల్లో స‌వాల్‌గా మారిన నేప‌థ్యంలో పార్టీలు ఎక్క‌డా వెన‌క్కి త‌గ్గ‌కుండా దూకుడు ప్ర‌ద‌ర్శిస్తుండ‌డం గ‌మ‌నార్హం.