Begin typing your search above and press return to search.

చెల్లికి న్యాయం చేయడం కోసం తమ్ముడికి అన్యాయం... జగన్ కీలక వ్యాఖ్యలు!

ఈ సమయంలో తాజాగా ఒక టీవీ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో జగన్ స్పందించారు.

By:  Tupaki Desk   |   9 May 2024 5:21 AM GMT
చెల్లికి న్యాయం చేయడం కోసం తమ్ముడికి అన్యాయం... జగన్  కీలక వ్యాఖ్యలు!
X

సార్వత్రిక ఎన్నికల వేళ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోకి వైఎస్ షర్మిళ ఎంట్రీ ఇచ్చిన తర్వాత.. వైఎస్ వివేకా హత్య కేసు వ్యవహారం పీక్స్ కి చేరిన సంగతి తెలిసిందే! ఆమె పీసీసీ చీఫ్ గా ఏపీలో ఎంటరైన తర్వాత.. ప్రధానంగా కడప ఎంపీగా ఆమె పోటీ చేస్తున్నట్లు ప్రకటించిన తర్వాత ఈ వ్యవహారం రాజకీయంగా తీవ్ర చర్చనీయాంశం అయిన పరిష్తితి.

కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థిగా షర్మిళ కడప నుంచి పోటీ చేస్తున్న సమయంలో... వైఎస్ వివేకా హత్య కేసు - అందులో నిందితుడిగా సీబీఐ అవినాష్ పేరు చేర్చిందనే విషయం - అయినప్పటికీ అవినాష్ కు జగన్ ఎంపీ టిక్కెట్ ఇచ్చారు అనే విషయాలపైనే ప్రధానంగా ప్రచారం చేస్తూ ముందుకు కదులుతున్నారు షర్మిళ. దీంతో... ఇతర ప్రత్యర్థులకు కూడా ఈ విషయం ట్రంప్ కార్డులా దొరికిందనే కామెంట్లు వినిపించాయి!

ఈ నేపథ్యంలో పులివెందులలో నామినేషన్ వేయడానికి వెళ్లిన సందర్భంగా స్పందించిన జగన్... వివేకా హత్య కేసులో అవినాష్ చెబుతున్న వెర్షన్ చాలా సహేతుకమైందని.. ప్రజలు నమ్ముతున్నారని.. అతడిని చిన్నపిల్లాడిని చేసి ఇబ్బంది పెట్టడం కరెక్ట్ కాదన్నట్లుగా జగన్ మట్లాడారు. దీంతో... వాతావరణం మరింత వేడెక్కింది. అప్పటి నుంచి షర్మిళ, సునీతలు అవినాష్ - జగన్ ని మరింత టార్గెట్ చేస్తూ విమర్శలు చేశారు.

ఈ సమయంలో తాజాగా ఒక టీవీ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో జగన్ స్పందించారు. ఒక చెల్లెలికి న్యాయం చేయడం కోసం ఒక తమ్ముడికి అన్యాయం చేయడం అనే అంశాన్ని లేవనెత్తారు. ఇందులో భాగంగా... వివేకానంద రెడ్డి హత్య కేసులో అవినాష్‌ రెడ్డి చెప్తున్న మాటలను ప్రజలు నమ్ముతున్నారని చెప్పిన జగన్... కడప ప్రజలకు అవినాష్‌ రెడ్డి ఎలాంటి వాడో తెలుసని అన్నారు. ఇదే క్రమంలో... అవినాష్‌ చెప్తున్న విషయాలను తాను నమ్ముతున్నానని జగన్‌ స్పష్టం చేశారు.

ఇదే క్రమంలో... బాబాయ్‌ హత్యా కేసును ఒక రాజకీయ అంశంగా మార్చి, రాజకీయంగా ఒక వ్యాక్యూం సృష్టించే ప్రయత్నం చేశారని చెప్పిన జగన్... ఈ కేసును తప్పుదారి పట్టిస్తూ వాళ్లే కోర్టును ఆశ్రయించారని వివరించారు. అదేవిధంగా... ఈ ఎన్నికను కడప సెంట్రిక్‌ గా మార్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని అన్నారు.

ఇదే సమయంలో... వివేకా రెండో భార్య, ఆమె కొడుకు కోణంలో ఎందుకు విచారణ జరపడం లేదంటూ అవినాష్‌ అడుగుతున్న దాంట్లో తప్పేముందని సీఎం జగన్‌ అన్నారు. ఈ పరంగా అవినాష్ అడుగుతున్న విషయాలు సహేతుకమే కదా.. ఈ సమయంలో అవినాష్ మాటలు సహేతుకంగా ఉన్నాని అంటున్నవారిపైనా విరుచుకుపడుతున్నారని తెలిపారు!

ఇదే క్రమంలో... తప్పు చేయని వ్యక్తిని తప్పుచేశారని అనడం ఇంకా తప్పు అని జగన్ వెల్లడించారు. అదేవిధంగా చెల్లెల్లకు న్యాయం చేయడం కోసం మరొకరికి అన్యాయం చేయాలనడం దారుణం అని తెలిపారు.