Begin typing your search above and press return to search.

రాజన్న దొర ఎంత పొగిడినా జగన్ కరుణించలేదా..?

కానీ ఎక్కడా రాజన్నదొర ప్రస్తావన తేలేదు ఆయనను గెలిపించాలని ప్రజలకు పిలుపు ఇవ్వలేదు దాంతోనే దొర ఫుల్ గా డల్ అయ్యారని అంటున్నారు.

By:  Tupaki Desk   |   28 Aug 2023 11:30 PM GMT
రాజన్న దొర ఎంత పొగిడినా జగన్ కరుణించలేదా..?
X

ఉమ్మడి విజయనగరం జిల్లాలోని సాలూరు నియోజకవర్గం ఎమ్మెల్యే, ఉప ముఖ్యమంత్రి అయిన పీడిక రాజన్నదొరకు జగన్ రెడ్ సిగ్నల్ చూపిస్తున్నారా అంటే జిల్లా రాజకీయాలను పరిశీలించిన వారు అంతా అవును అంటున్నారు. జగన్ తాజాగా రాజన్నదొర సొంత నియోజకవర్గంలో పర్యటించారు. కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయాన్ని ఆయన ప్రారంభించారు.

ఈ సందర్భంగా జరిగిన సభలో జగన్ ఏకంగా ఒక నలభై నిముషాల పాటు ప్రసంగించారు. కానీ ఎక్కడా రాజన్నదొర ప్రస్తావన తేలేదు ఆయనను గెలిపించాలని ప్రజలకు పిలుపు ఇవ్వలేదు దాంతోనే దొర ఫుల్ గా డల్ అయ్యారని అంటున్నారు. అదే విధంగా ఆయన అనుచర వర్గం డీలా పడింది అని అంటున్నారు. ఇలా ఎందుకు విశ్లేషించుకుంటున్నారు అంటే దీనికి సరిగ్గా నెల ముందు కురుపాం జరిగిన సభలో జగన్ మాట్లాడుతూ తన చెల్లెమ్మ మాజీ ఉప ముఖ్యమంత్రి పుష్ప శ్రీవాణిని గెలిపించమని జనం ముందే కోరారు.

అంటే ఆమె అభ్యర్ధిత్వం ఖరారు అయింది అని అంటున్నారు. ఇక ఇదే ఉత్సాహంతో రాజన్న దొర కూడా జగన్ సభలో చాలా సేపు మాట్లాడారు. సీఎం ని వేణ్ణోళ్ల కీర్తించారు. కానీ జగన్ మైక్ అందుకోగానే మొత్తం సీన్ మారింది. రాజన్నకే టికెట్ అన్నట్లుగా ఎలాంటి సంకేతాలు రాలేదు. దాంతో రాజన్న దొరకు టిక్కు పెట్టేశారా అన్న డౌట్లు వస్తున్నాయట.

ఇదిలా ఉంటే నియోజాకవరంలో దొర పట్టు సాధించలేకపోవడం పార్టీలో కూడా అంతర్గత సమస్యలను ఒక కొలిక్కి తీసుకుని రాలేకపోవడం వంటివి ఐ ప్యాక్ సహా చాలా సర్వే నివేదికల ద్వారా జగన్ దృష్టికి వచ్చాయని అంటున్నారు. అదే విధంగా చూస్తే దొర పనితీరు మీద కూడా విమర్శలు ఉండడంతో జగన్ ఆయన టికెట్ ని పెండింగులో పెట్టారని అంటున్నారు.

ఇక రాజన్నదొర రాజకీయం 2004లో మొదలైంది. ఆయన అప్పట్లో అతి తక్కువ ఓట్లతో ఓడారు. 2009లో కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. 2014, 2019లలో వైసీపీ నుంచి గెలిచారు. ఆయనకు 2019లోనే అత్యధిక మెజారిటీ వచ్చింది. ఆయనకు జనంలో మంచి పేరు ఉంది కానీ దూకుడుగా రాజకీయాలు చేయలేకపోవడం మైనస్ గా మారింది. అదే సమయంలో టీడీపీ నుంచి మాజీ ఎమ్మెల్సీ గుమ్మడి సంధ్యారాణికి టికెట్ ఇస్తున్నారు. ఆమెను ఎదుర్కొని గెలవడం కొంచెం కష్టం అని సర్వే నివేదికలు చెబుతునాయట.

ఇక వైసీపీ మనసులో జీసీసీ చైర్ పర్సన్ అయిన స్వాతీరాణి పేరు ఉందని అంటున్నారు.ఆమెకు ఈ దఫా టికెట్ ఇస్తే గెలుపు ఖాయం అవుతుందని లెక్కలేవో ఉన్నాయని అంటున్నారు. రాజన్న దొర నాలుగు సార్లు పోటీ చేసి మూడు సార్లు గెలవడంతో యాంటీ ఇంకెంబెన్సీని తట్టుకోవాలంటే కొత్త ముఖాన్ని దించాలని వైసీపీ డిసైడ్ అయింది అని అంటున్నారు. దాంతో దొరకు చెల్లు చీటే నని అంటున్నారు. చూడాలి మరి ఏమి జరుగుతుందో.