Begin typing your search above and press return to search.

ఏ భార్యతో కాపురం చేయడు కానీ బాబుతో అన్నేళ్లు ఉండాలట

ఇలాంటి ఆయన ఏ భార్యతోను మూడు నాలుగు సంవత్సరాలు కాపురం చేయలేడు కానీ పొలిటికల్ లైఫ్ లో మాత్రం చంద్రబాబుతో కనీసం 10-15 ఏళ్లైనా ఉండాల్సిందేనని తన క్యాడర్ కు చెబుతున్నారన్నారు.

By:  Tupaki Desk   |   30 Dec 2023 4:42 AM GMT
ఏ భార్యతో కాపురం చేయడు కానీ బాబుతో అన్నేళ్లు ఉండాలట
X

ఏపీలో ఎన్నికల ఫీవర్ వచ్చేసింది. మరో నాలుగు నెలల్లో ఎన్నికలు వచ్చేస్తున్న వేళ.. ఏ పార్టీకి ఆ పార్టీ వివిధ అంశాలపై తమదైన వాదనలు వినిపిస్తున్నాయి. కొన్ని కీలక విమర్శలు చేస్తున్నారు. ఇదంతా ఒక ఎత్తు అయితే తాజాగా భీమవరంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మాట్లాడిన సీఎం జగన్మోహన్ రెడ్డి..జనసేన అధినేత పవన్ కల్యాణ్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన మూడు పెళ్లిళ్ల పైనే దాదాపు నాలుగైదు నిమిషాలు మాట్లాడిన సీఎం జగన్మోహన్ రెడ్డి షాకింగ్ వ్యాఖ్యలు చేయటం గమనార్హం.

పవన్ మూడు పెళ్లిళ్లు.. ఆయన కాపురం గురించి మాత్రమే కాదు.. తనకున్న ఇద్దరు ఆడపిల్లల ప్రస్తావనను కూడా సీఎం జగన్ చేయటం గమనార్హం. ఇంతకూ పవన్ పై తీవ్ర స్థాయిలో నిప్పులు చెరిగిన సీఎం జగన్.. "ప్రజల కోసం త్యాగాలు చేసే వారిని చూశాం. ప్యాకేజీల కోసం త్యాగాలు చేసే వారిని ఎప్పుడూ చూసి ఉండం. ప్యాకేజీల కోసం త్యాగాలు చేసే త్యాగాల త్యాగరాజును చూస్తున్నాం. రియల్ లైఫ్ లో ఈ పెద్ద మనిషి ఏ భార్యతో ముచ్చటగా మూడు నాలుగు సంవత్సరాలు కాపురం చేసి ఉండరు ఈ మ్యారేజ్ స్టార్. ఆడవాళ్లను ఆట వస్తువులుగా మాత్రమే చూస్తుంటారు" అని ఫైర్ అయ్యారు.

పెళ్లి అనే పవిత్ర వ్యవస్థను.. సంప్రదాయాన్ని మంట గలుపుతూ నాలుగేళ్లకు ఒకసారి పెళ్లి చేసుకోవటం.. మళ్లీ విడాకులు ఇచ్చేయటం.. మళ్లీ పెళ్లి చేసుకోవటం.. మళ్లీ విడాకులు ఇచ్చేయటం.. ఏకంగా కార్లు మార్చినట్లుగా భార్యల్ని మారుస్తున్న ఈ పెద్ద మనిషి ఇప్పటికే ముగ్గురు భార్యలు అయిపోయారు. నాకూ ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు. మనకు చెల్లెల్లు ఉన్నారు. మన ఇళ్లలో ఆడబిడ్డలు ఉన్నారు. ఇలాంటి వారు నాయకులు.. ముఖ్యమంత్రులు.. ఎమ్మెల్యేలు అయితే.. ఇలాంటి వారిని స్ఫూర్తిగా తీసుకొని ఇదే మాదిరి ప్రతి ఒక్కడూ చేయటం మొదలు పెడితే.. మన ఆడబిడ్దల పరిస్థితి ఏమిటి?" అంటూ సూటి ప్రశ్నను సంధించారు.

ఇలాంటి ఆయన ఏ భార్యతోను మూడు నాలుగు సంవత్సరాలు కాపురం చేయలేడు కానీ పొలిటికల్ లైఫ్ లో మాత్రం చంద్రబాబుతో కనీసం 10-15 ఏళ్లైనా ఉండాల్సిందేనని తన క్యాడర్ కు చెబుతున్నారన్నారు. "రాజకీయాల్లో ఇలాంటి వారికి కనీసం ఓటు వేయటం కూడా ధర్మమేనా?" అంటూ మండిపడ్డారు. రెండు విషాలు కలిస్తే అమ్రతం తయారవుతుందా? నలుగురు వంచకులు కలిస్తే మంది పెరుగుతారు కానీ ప్రజలకు మంచి చేసే అవకాశం ఉండదన్నారు. ఒకరేమో పిల్లను ఇచ్చిన మామను వెన్నుపోటు పొడిచిన క్యారెక్టర్ అని.. ఇంకొకరు ప్యాకేజీల కోసం తన వారిని తాకట్టు పెడుతున్న దత్తపుత్రుడని పేర్కొన్నారు. ఇలాంటి క్యారెక్టర్ లేని.. విశ్వసనీయత లేని ఇలాంటి వ్యక్తుల పాలనలో ప్రజలకు మంచి జరుగుతుందా?" అంటూ ప్రశ్నలు సంధించారు. మొత్తంగా పవన్ ను ఈ స్థాయిలో విరుచుకుపడిన మొదటి వ్యక్తి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిగా చెప్పక తప్పుదు.