Begin typing your search above and press return to search.

గుడివాడలో మేమంతా సిద్ధం... దేవుడు పెద్ద స్క్రిప్ట్‌ రాశాడని దానర్థం!

తాజాగా కృష్ణాజిల్లాలో జగన్ చేపట్టిన "మేమంతా సిద్ధం" బస్సు యాత్రకు రోడ్ల పొడవునా ఇసుకవేస్తే రాలనంత జనం జగన్ కి తోడుగా నిలవగా... గుడివాడలో జరిగిన బహిరంగ సభలో ఒక మహా ప్రజా సముద్రం దర్శనమిచ్చినట్లు ఉందని అంటున్నారు!

By:  Tupaki Desk   |   15 April 2024 3:23 PM GMT
గుడివాడలో మేమంతా సిద్ధం... దేవుడు  పెద్ద స్క్రిప్ట్‌  రాశాడని దానర్థం!
X

జగన్ బలం అంతా రాయలసీమలోనే! కడప పొలిమేర, రాయలసీమ హద్దులు దాటితె జగన్ కు అంత బలం లేదు! మిగిలిన ఆంధ్రా ప్రాంతంలో జగన్ కి అంత ఫాలోయింగ్ ఏమీ లేదు! పైగా కృష్ణా, గుంటూరు జిల్లాల సంగతైతే ఇంక ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరంలేదు.. అక్కడ జగన్ ప్రభావం అతిస్వల్పం! ఈ రెండు జిల్లాలు టీడీపీ కంచుకోటలు! వాస్తవానికి 2019 ఎన్నికలకు ముందు ఒక వర్గం నేతల్లో, ఒక వర్గం మీడియాలో బలంగా కనిపించిన వాక్యాలివి!!

రాజకీయాలను, అభిమానాలను, విశ్వాసాలను.. కులాలతోనూ, మతాలతోనూ, ప్రాంతాలతోనూ ముడిపెట్టే నాయకులు, వారి అనుంగులూ చెప్పిన మాటలు ఇవి! అభిమానానికి అలాటివి ఏమీ ఉండవని.. పార్టీలకు కంచుకోటలు అనే రోజులు పోతున్న దశలో అంతా ఉన్నామని.. కొన్ని ప్రాంతాల్లో జగన్ కు అభిమానులు ఉండరని, జనాలు వెంటరారని భ్రమపడినవారి ఆశలు నీరుగార్చిన తాజా ఉదాహరణం ఇప్పుడు కృష్ణాజిల్లాలో దర్శనమిచ్చింది.

అవును... 2019లో ఏదో వేవ్ లో అలా జరిగిపోయిందండీ.. ఈసారి కుదరదు అంటూ కబుర్లు చెబుతున్న వారికి "సిద్ధం" సభల అనంతరం కొంచెం కొంచెం కనువిప్పు కలగడం మొదలవ్వగా... "మేమంతా సిద్ధం" బస్సు యాత్ర, సభలతో మొత్తంగా కళ్లు తెరుచుకుంటున్నాయని.. మరోసారి ఫ్యాన్ 2019కి మించిన స్పీడ్ లో తిరిగేలా ఉందనే సృహ వస్తుందని కామెంట్లు వినిపిస్తున్నాయి.


ఇదిగో.. ఇక్కడ కనిపిస్తున్న ఫోటో ఎన్నో రాజకీయ విమర్శలకు, అంచనాలకు, అనాలోచిత ప్రకటనలకు, అడ్డగోలు రాతలకు, ముతక వైఖరి నేతలకు సమాధానంగా నిలిచిందనే కామెంట్లను సొంతం చేసుకుంటుంది! కృష్ణమ్మ సాక్షిగా అన్నట్లుగా... తాజాగా కృష్ణాజిల్లాలో జగన్ చేపట్టిన "మేమంతా సిద్ధం" బస్సు యాత్రకు రోడ్ల పొడవునా ఇసుకవేస్తే రాలనంత జనం జగన్ కి తోడుగా నిలవగా... గుడివాడలో జరిగిన బహిరంగ సభలో ఒక మహా ప్రజా సముద్రం దర్శనమిచ్చినట్లు ఉందని అంటున్నారు!

దీంతో... రాష్ట్ర ప్రజల దృష్టిలో 2019 కంటే ఎక్కువగా జగన్ పై అభిమానం, అంతకు మించి “నమ్మకం” పెరిగినట్లుందనే చర్చ రాజకీయ వర్గాల్లో బలంగా వినిపిస్తుందని తెలుస్తుంది! పైగా రాష్ట్ర స్థాయి స్టార్లు, జాతీయ స్థాయి స్టార్లు హాజరవుతున్న సభల్లో... “సిద్ధం”, “మేమంతా సిద్ధం” సభల్లో కనిపించిన జనంలో సగం కూడా కనిపించడం లేదనే కామెంట్లు.. ఇప్పుడు ఏపీలో జగన్ “గాలి”ని సూచిస్తున్నాయని అంటున్నారు!

మరోపక్క.. గుడివాడలోని "మేమంతా సిద్ధం" సభలో మైకందుకున్న జగన్... "నా నుదుటి మీద వారు చేసిన గాయం బహుశా 10 రోజుల్లో తగ్గిపోతుందేమో కానీ, పేదల విషయంలో చంద్రబాబు చేసిన గాయాలు ఎప్పటికీ మానవు. నుదుటి మీద వారు చేసిన గాయంతో బయటపడ్డానంటే... దేవుడు మీ బిడ్డ విషయంలో ఇంకా పెద్ద స్క్రిప్ట్‌ రాశాడు అని దానర్థం" అంటూ వ్యాఖ్యానించారు. దీంతో... ఈ జనంతో పాటు జగన్ ప్రసంగం కూడా ఆసక్తిగా మారింది!