Begin typing your search above and press return to search.

జగన్ తో అదానీ.. మీటింగ్ విత్ డిన్నర్

బిజినెస్ టైకూన్ ఆల్ ఇండియా లెవెల్ లో వాణిజ్య దిగ్గజం అదానీ గ్రూప్ అధినేత అయిన గౌతం అదాని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డితో గురువారం రాత్రి భేటీ కావడం ఆసక్తిని కలిగిస్తోంది.

By:  Tupaki Desk   |   29 Sep 2023 4:45 AM GMT
జగన్ తో అదానీ.. మీటింగ్ విత్ డిన్నర్
X

బిజినెస్ టైకూన్ ఆల్ ఇండియా లెవెల్ లో వాణిజ్య దిగ్గజం అదానీ గ్రూప్ అధినేత అయిన గౌతం అదాని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డితో గురువారం రాత్రి భేటీ కావడం ఆసక్తిని కలిగిస్తోంది. జగన్ని కలవడం కోసం ఆయన నేరుగా అహ్మదాబాద్ నుంచి ప్రత్యేక విమానంలో గన్నవరం విమానాశ్రానికి చేరుకున్నారు.

ఇక అదానీ అక్కడి నుంచి తాడేపల్లిలోని ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయానికి చేరుకున్నారు. ఈ టూర్ అన్నది లాస్ట్ మినిట్ వరకూ తెలియదు. ఇక పలు అంశాలపై సీఎం జగన్‌తో అదానీ చర్చించినట్లుగా తెలుస్తోంది. ఆ తర్వాత ఇరువురు కలిసి డిన్నర్ మీట్ కూడా పెట్టుకున్నారు. అదానీకి ఏపీలో పలు ప్రాజెక్టులు రాష్ట్ర ప్రభుత్వం అప్పగించింది.

విశాఖ గంగవరం పోర్టులో ప్రభుత్వ వాటాను కూడా కొనుగోలు చేసి మొత్తం హక్కులు అదానీ గ్రూప్ తీసుకుంది. విశాఖ స్టీల్ ప్లాంట్ ని అదానీకి కేంద్రం అప్పగిస్తుంది అని అంటున్నారు. అయితే తమకు ఆసక్తి లేదని ఆ మధ్య అదానీ గ్రూప్ నుంచి ప్రకటన వచ్చింది. కానీ విశాఖలో అదానీ అనేక రకాలుగా ప్రాజెక్టులు చేపడుతోంది.

ఇంకో వైపు చూస్తే అదానీ పాక్ కూడా విశాఖలో ఉంది. అదానీ పోర్టులలో కూడా పెట్టుబడులు పెడుతోంది. మరిన్ని పెట్టుబడులు ఏపీలో పెట్టేందుకు అదానీ సుముఖంగా ఉన్నారని అంటున్నారు. దాని మీదనే ముఖ్యమంత్రితో చర్చించేందుకు ఆయన స్పెషల్ ఫ్లైట్ లో వచ్చారు అని అంటున్నారు.

ఏపీలో పెట్టుబడులు లేవు అని అంటున్నారు. దాంతో రానున్న ఆరు నెలల్లో మరిన్ని కొత్త ప్రాజెక్టులకు రూపకల్పన చేయాలని జగన్ చూస్తున్నారు అని అంటున్నారు. విశాఖను రాజధానిగా మార్చుకోవాలని వైసీపీ ఆలోచన ఉంది.

వచ్చే నెలలో సీఎం విశాఖకు తన మకాం మారుస్తున్నారు. దాంతో విశాఖలో మరింత ఫోకస్ పెట్టాలని చూస్తున్నారు. ఈ నేపధ్యంలో అదానీ విశాఖలో ఏమైనా కొత్త ప్రాజెక్టులు చేపడతారా అన్న చర్చ కూడా నడుస్తోంది. ఏది ఏమైనా ఒక వైపు చూస్తే ఏపీలో రాజకీయ కాక రంజు మీద ఉన్న వేళ బిజినెస్ టైకూన్ అదానీ సీఎం తో ప్రత్యేక చర్చలు జరపడాన్ని విశేషంగానే చూస్తున్నారు. ఈ భేటీకి సంబంధించిన అవుట్ పుట్ ఏంటి అన్నది తొందరలో తెలుస్తుంది అంటున్నారు.