Begin typing your search above and press return to search.

జగన్ 175...మోడీ 400 అంటే బూజింగ్ నేనా...!?

ఇలా చూస్తే కనుక ఇటు జగన్ అటు నరేంద్ర మోడీ ఇద్దరూ కూడా వై నాట్ అంటున్నారు. మరి ఇది నిజంగా సాధ్యమేనా అనేది ఇపుడు వేడి వేడి చర్చకు ఆస్కారం ఇస్తోంది

By:  Tupaki Desk   |   5 March 2024 11:30 AM GMT
జగన్ 175...మోడీ 400 అంటే బూజింగ్ నేనా...!?
X

ఏపీ సీఎం గత ఏడాది కాలంగా వై నాట్ 175 అని ఒక స్లోగన్ అందుకున్నారు. రాజకీయాల్లో ఎన్నడూ వినని స్లోగన్ ఇది అతి విశ్వాసానికి పరాకాష్టగా ఈ నినాదం ఉందని అంతా అంటున్నారు. ప్రజాస్వామ్యంలో విపక్షం లేకుండా మొత్తానికి మొత్తం సీట్లు దక్కిన చరిత్ర ఎక్కడైనా ఉంటుందా అన్నది నాటి నుంచే చర్చగా ముందుకు వచ్చింది.

ఇక కేంద్రంలో చూస్తే ప్రధాని నరేంద్ర మోడీ గత కొద్ది నెలలుగా బీజేపీకి నాలుగు వందల ఎంపీ సీట్లు తగ్గవని అంటున్నారు. అలాగే ఎన్డీయే కూటమి ఈసారి థంపింగ్ మెజారిటీతో పార్లమెంట్ లో అడుగుపెడుతుందని కూడా అంటున్నారు. దీని భావమేమి అన్నది దేశ రాజకీయాల్లో కూడా కొత్త చర్చకు దారి తీసింది.

ఇలా చూస్తే కనుక ఇటు జగన్ అటు నరేంద్ర మోడీ ఇద్దరూ కూడా వై నాట్ అంటున్నారు. మరి ఇది నిజంగా సాధ్యమేనా అనేది ఇపుడు వేడి వేడి చర్చకు ఆస్కారం ఇస్తోంది. ఇక వైసీపీ 175 అన్న స్లోగన్ చూస్తే కనుక ఆ పేరుతో చాలా మందికి సీట్లు ఇవ్వకుండా వారిని వీరినీ ట్రాన్స్ ఫర్ చేస్తూ క్యాడర్ దగ్గర చీప్ అయింది అని అంటున్నారు.

ఇక రాజకీయ విశ్లేషకులు సైతం ఇది కరెక్ట్ కాదు అని అంటున్నారు. జగన్ చేస్తున్న ప్రయోగాలు రాజకీయంగా ఇబ్బందులు తెచ్చేవి అని అంటున్నా చేసుకుని పోతున్నారు. అదే సమయంలో ఆయన వై నాట్ 175 అన్న పేరు పెట్టి సీట్లు ఇవ్వకుండా చేస్తున్నారు అన్న విమర్శలు కూడా వస్తున్నాయి.

ఇదిలా ఉంటే బీజేపీ విషయం తీసుకున్నా అలాగే ఉందా అన్న చర్చ అయితే సాగుతోంది. మోడీ కూడా 400 ఎంపీ సీట్లు అనడం వెనక ఎలాంటి పొలిటికల్ లాజిక్ కనిపించడంలేదు అని అంటున్నారు. ఎందుకంటే అప్పుడెపుడో తొలి ప్రధానిగా పండిట్ నెహ్రూ ఉన్న టైం లో సరైన అపోజిషన్ లేక కాంగ్రెస్ కు దాదాపుగా నూటికి ఎనభై నుంచి తొంబై శాతం ఎంపీ సీట్లు దక్కాయని చరిత్ర చెబుతోంది.

ఆ తరువాత మళ్ళీ 1984లో ఆ రికార్డుని బద్ధలు కొట్టింది ఆయన మనవడు రాజీవ్ గాంధీ. అది కూడా ఇందిరా గాంధీ దారుణ హత్య వల్ల వచ్చిన సానుభూతి. అప్పటికి విపక్షాలు పూర్తిగా సర్దుకోకముందే ఎన్నికలు పెట్టి 400 సీట్లతో ఆ రాజకీయ లాభాన్ని కాంగ్రెస్ సొంతం చేసుకుంది. ఇలా రెండు సందర్భాలలో తప్ప దేశంలో ఎపుడూ ఒక పార్టీకి బండ మెజారిటీ వచ్చిన సందర్భం అయితే లేదు.

కానీ బీజేపీ మాత్రం ఏకంగా 400 సీట్లు అంటోంది. దానికి ప్రాతిపదిక ఏమిటి అన్నది మాత్రం అర్ధం కావడం లేదు. దేశంలో దక్షిణ భారతాన ఏకంగా 129 సీట్లు ఉంటే అందులో బీజేపీకి గట్టిగా దక్కేవి నాలుగవ వంతు కూడా ఉండవని అంటున్నారు. ఇక బీజేపీ సీట్ల గెలుపులో పీక్స్ ని చూసేసింది 2019లో అని అంటున్నారు. అంతకంటే పెరగదు అని అంటున్నారు.

అలాంటిది మరో వంద సీట్లు బీజేపీకి అదనంగా వస్తాయని ఎలా చెబుతున్నారు అన్నదే చర్చగా ఉంది. అంటే ఇలా అసాధ్యం అన్న దాన్ని ముందు పెట్టి సంచలన ప్రకటనలు చేయడం ద్వారా రాజకీయంగా విపక్షాలను కార్నర్ చేయడం అలాగే జనంలో పాజిటివిటీని పెంచుకోవడం వంటి ఎత్తుగడలను అటు జగన్ కానీ ఇటు నరేంద్ర మోడీ కానీ చేస్తున్నారు అని అంటున్నారు.

ఇక అసాధ్యాలను సుసాధ్యం చేయడం కష్టం కాకపోయినా దానికి ఒక లెక్క ఉంటుంది. తర్కానికి అందాల్సి ఉంటుంది. అవేమీ లేకుండా బోల్డ్ స్టేట్మెంట్ ఇచ్చేస్తే దాని వల్ల కలిగే ఇబ్బందులు జరిగే పరిణామాలు పర్యవసానాలు ఫలితాలు అన్నీ కూడా చూసుకోవాల్సి ఉంటుంది కదా అన్న చర్చ సాగుతోంది.

ఇంతటి బిగ్ టాస్క్ ని కోరి తమ మీద వేసుకుని ఈ ఇద్దరు నేతలూ అభాసుపాలు అవుతారా అన్నది మాత్రం ఇపుడు పెద్ద ఎత్తున చర్చ సాగుతోంది. ప్రకటనలు ఎంత చేసినా అందులో వాస్తవికత ఉండాలి. అది లేని నాడు అవి వట్టివిగానే మిగిలిపోతాయి.ఆ మీదట అధినేతలు ఏమి చెప్పినా నమ్మే సీన్ ఉండదు అని కూడా అంటున్నారు. క్యాడర్ కూడా నమ్మేలా ఏదైనా ఉండాలి కదా అన్నదే ఇపుడు ఈ రెండు ప్రకటనలు ఇస్తున్న నినాదాలు చూసిన వారు వేస్తున్న సెటైర్లుగా ఉన్నాయి.