అమరావతి విషయంలో జగన్ స్ట్రాంగ్ డెసిషన్ ?
అమరావతితో పెట్టుకుని రాజకీయంగా భారీ మూల్యాన్ని వైసీపీ ఇప్పటికే చెల్లించింది.
By: Tupaki Desk | 10 May 2025 2:30 AMఏపీలో అమరావతి రాజధాని పునర్ నిర్మాణ పనులు మొదలయ్యాయి. శరవేగంగా జరుగుతున్నాయి. టీడీపీ కూటమి ప్రభుత్వం మూడేళ్ళ వ్యవధిలో పూర్తి చేస్తామని అంటోంది. అయితే 2029 ఎన్నికల ముందు నాటికి ఒక షేప్ వచ్చినా కూడా కూటమి సక్సెస్ అయినట్లే. అంతే కాదు ఒకవేళ జగన్ ముఖ్యమంత్రి అయినా కూడా అమరావతిని టచ్ చేయకుండా చట్టబద్ధత తో కూడిన ఫుల్ సెక్యూరిటీతో టైట్ చేస్తున్నారు. దాంతో అమరావతి రాజధానికి వచ్చిన ఇబ్బంది ఏమీ లేదు అన్నది అంతా అంటున్నారు.
అయితే ఇంతలా అమరావతి విషయంలో కూటమి గట్టి నిర్ణయాలు తీసుకుంటున్నా జగన్ వరకూ వైసీపీ వరకూ చూస్తే కనుక అమరావతి రాజధాని విషయంలో స్ట్రాంగ్ డెసిషన్ తోనే ఉన్నారని అంటున్నారు. మళ్ళీ సీఎం అయినా అమరావతి రాజధానిని కదల్చే ఆలోచన కలలో కూడా జగన్ కి లేదు అని వైసీపీ వర్గాలు అంటున్నాయి. అమరావతితో పెట్టుకుని రాజకీయంగా భారీ మూల్యాన్ని వైసీపీ ఇప్పటికే చెల్లించింది.
అమరావతి రాజధాని అంటే కొన్ని ప్రాంతాలకే కొన్ని వర్గాలకే అనుకుని తప్పుడు అంచనాలతో ఉండిపోయింది కానీ అది ఏపీకి అతి పెద్ద సెంటిమెంట్ గా మారింది అన్నది ఓడాక కానీ వైసీపీకి తెలిసి వచ్చింది కాదని అంటున్నారు. దాంతో అమరావతి విషయంలో వైసీపీ వైఖరిలో పూర్తి గా మార్పు వచ్చిందని అంటున్నారు అమరావతి పునర్ నిర్మాణ పనులకు జగన్ హాజరు కాకపోవడానికి వేరే రాజకీయ కారణాలు ఉండొచ్చు కానీ రాజధాని పూర్తి కావాలనే ఆయనతో పాటు వైసీపీ వర్గాలు కోరుకుంటున్నాయట.
మరో వైపు చూస్తే అమరావతి రాజధాని విషయంలో వైసీపీ ఇంత స్పష్టంగా ఉందని కానీ బయటకు ఎందుకు ఇదీ తన నిర్ణయం అని ప్రకటించదు అంటే ఓడి ఏడాది కూడా కాలేదు అన్నది ఒకటి ఉంది. పైగా మూడు రాజధానుల విషయంలో వైసీపీ ప్రతిష్టగా తీసుకుని ముందుకు దూకుడుగా సాగింది. మరి తాను అంతలా నమ్మిన ఒక డెసిషన్ నుంచి తొందరగా వెనక్కి వచ్చినా బాగుండదని జనాలు కూడా నమ్మరని అంటున్నారు
అందుకే సరైన సమయంలో సరైన వేదిక మీదనే అమరావతి రాజధాని మీద వైసీపీ తన అభిప్రాయం వ్యక్తం చేస్తుందని అంటున్నారు ఇక అమరావతి రాజధాని పేరు మీద ఏదైనా అక్రమాలు అవినీతి వంటి వాటివి జరిగితే వాటి మీదనే వైసీపీ పోరాటమే అని అంటున్నారు. ఈ విధంగా వైసీపీ అమరావతి జోలికి వెళ్ళరాదు అని నిర్ణయించుకుంది అంటున్నారు.
అదే సమయంలో సమగ్రమైన అభివృద్ధి అన్ని ప్రాంతాలలో ప్రగతి కనిపించాలని వైసీపీ ఆలోచనగా చెబుతున్నారు అందువల్ల వైసీపీ వెనకబడిన వర్గాల ప్రజలతో పాటు వెనకబడిన ప్రాంతాలకు బాసటగా ఉండేలా తన యాక్షన్ ప్లాన్ తో ముందుకు సాగుతుందని అంటున్నారు
మొత్తానికి అమరావతి ఏపీకి శాశ్వత రాజధాని అన్నది రూఢీ అయిపోయింది. చట్టబద్ధత ఎటూ వస్తుంది. రాజకీయంగా కూడా వైసీపీ కూడా ఏమీ అడ్డుపడకూడదని భావిస్తోందని ప్రచారంలో ఉంది అని అంటున్నారు. చూడాలి మరి అమరావతి రాజధాని రాజకీయ అంశంగా మారకుండా ఉంటే కొన్ని దశాబ్దాల తరువాత అయినా ఏపీకి శాశ్వత రాజధాని వచ్చినట్లు అవుతుంది.