వైనాట్ పదం కొంపముంచుతోందా ?
వైనాట్ ఈ పదం ఎక్కడో విన్నట్లుగా అనిపిస్తోంది కదూ. ఎక్కడో కాదు, ఇక్కడే ఈ ఆంధ్ర నేల మీదనే.
By: Satya P | 20 Oct 2026 7:00 PM ISTవైనాట్ ఈ పదం ఎక్కడో విన్నట్లుగా అనిపిస్తోంది కదూ. ఎక్కడో కాదు, ఇక్కడే ఈ ఆంధ్ర నేల మీదనే. సరిగ్గా రెండున్నరేళ్ళ క్రితం వైసీపీ అధినాయకత్వం నోట పదే పదే వినిపించిన పదం అది. పదం అనే కంటే నినాదం అంటే బెటరేమో. వైసీపీ దీనిని ఒక బలమైన నినాదంగా అటు జనంలోకి ఇటు పార్టీ జనంలోకి పంపించి తమ సత్తా చాటాలని ఆశపడింది. నూటికి నూరు శాతం ఫలితాలు అంటే 175 అసెంబ్లీ సీట్లను కైవశం చేసుకుటామన్న ధీమా ప్రదర్శించింది. అయితే ఈ వైనాట్ వెనక అతి విశ్వాసం, అతి అహంకారం అనేది జనాలకే కాదు పార్టీ వారికీ కనిపించాయి, వినిపించాయి. కట్ చేస్తే ఫలితం భారీగానే తేడా కొట్టింది. వైసీపీ 2024 ఎన్నికల్లో పొలిటికల్ పెర్ఫార్మెన్స్ ఎలా ఉంది అంటే డిజాస్టర్ అన్న మాటే ఆ మీదట వినిపించింది. అంతలా వైనాట్ పదం వైసీపీ కొంప ముంచేసింది. మరి ఇపుడు ఎందుకు ఈ వైనాట్ అంటే ఏపీ రాజకీయాల్లో ఈ పదానికి ఇంకా పొలిటికల్ వాల్యూ ముగిసిపోలేదు. అందుకే గట్టిగా మరోసారి చెప్పుకోవాల్సి వస్తోంది.
వైనాట్ పులివెందుల :
ఇపుడు అధికారంలో టీడీపీ కూటమి ఉంది. అందులో ప్రధాన వాటా పెద్దన్న టీడీపీ అన్నది తెలిసిందే. జగన్ వైనాట్ 175 అంటే చంద్రబాబు వైనాట్ పులివెందుల అంటున్నారు. ఇలా వైనాట్ అన్న పదం ఇద్దరినీ ఇబ్బంది పెడుతోంది అనే చెప్పాలి. ఆల్రెడీ ఈ పదాన్ని పదే పదే అని వినీ జగన్ పూర్తిగా ఫెయిల్ అయ్యి ఏకంగా ఇంట్లో కూర్చున్నారు. అలాంటి వైనాట్ పదాన్ని పట్టుకుని చందబాబు రాజకీయ సంచలనానికి తెర తీయాలని చూస్తున్నారు. బీటెక్ రవి పులివెందుల టీడీపీ ఇంచార్జ్. ఆయన మాట విని టీడీపీ చంద్రబాబు దూకుడు చేస్తున్నారు అని అంటున్నారు. ప్రజాస్వామ్యం తీసుకుంటే వైనాట్ అనేది అన్ని చోట్లా చెల్లడు, ప్రజాస్వాయం అంటేనే భిన్న వైఖరులుగా తీర్పులు మార్పులు ఉంటాయి. అన్నీ ఒకేలా అంతటా ఒకే విధమైన తీర్పు అందులోనూ ఒకరికే ఎలా వస్తుంది అన్నది కూడా ఆలోచించాలి. ప్రత్యేకించి బలమైన నియోజకవర్గాలలో ఈ పదం పెద్దగా వర్కౌట్ కాదు, ఎందుకంటే వైనాట్ అన్నదే ఒక విచిత్రమైన రాజకీయ పదం అన్న మాట.
ప్రతిపక్షం లేకుండానే :
ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షం లేకుండా ఎలా ఉంటుంది అన్నది పార్టీలు ఆలోచించాలి. అంతే కాదు ప్రతిపక్షం కూడా ప్రజాస్వామ్యంలో కీలకమైనది అని గుర్తెరగాలి. గతంలో చూస్తే స్థానిక సంస్థల ఎన్నికలు వైసీపీ హయాంలో జరిగితే మొత్తం ఏకపక్షం అయినట్లుగా వైసీపీ ప్రకటించుకుంది. ఆనాడు కూడా ఇదే తీరున వ్యవహారం సాగింది. ఎన్నికలు అంటే రెండు రాజకీయ పార్టీలే ఉండవు, మధ్యలో ప్రజలు ఉంటారు, ఎన్నికల్లో ఏకపక్షాలు ఉండొచ్చు, టెక్నికల్ గా ప్రత్యర్ధులను పక్కకు నెట్టి ఏకగ్రీవాలు చేసుకోవచ్చు. కానీ ప్రజలు అన్న ఫ్యాక్టర్ అలాగే ఉంటుంది, వారు ఏమనుకుంటున్నారు. అనేది తరువాత ఎన్నికల్లో అయినా బయటపడుతుంది. వైసీపీ విషయం తీసుకుంటే అదే జరిగింది. 2024 ఎన్నికల నాటికి వైసీపీకి తత్వం బోధ పడేసరికి నిండా మునిగిపోయింది. అదే స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజల మూడ్ అన్నది బయటకు వచ్చి ఉంటే ఎంతో కొంత గ్రహించి ఉంటే ఈ దారుణమైన ఫలితాలు వచ్చి ఉండేవి కావు కదా అన్నది ఒక విశ్లేషణ గా ఉంది.
పులివెందుల ఏకగ్రీవం అయితే :
ఇక పులివెందుల విషయానికి వస్తే అక్కడ వైసీపీకి మొదటి నుంచి బలం ఉంది. అలాంటి చోట్ల వైసీపీ వారిని రానీయకుండా అన్ని చోట్ల ఏకగ్రీవాలు చేసుకుంటూ టీడీపీ పోతోంది. కానీ ఓటర్లు మధ్యన ఉన్నారు అన్నది టీడీపీ కూడా ఆలోచించాలి అని అంటున్నారు. ఈ రోజున ఏకగ్రీవాలు అయితే కావచ్చు. మరో రోజున అక్కడ ఎన్నికలు పెడితే జనం మూడ్ టీడీపీ కూడా చూడాల్సి వస్తుంది కదా అని అంటున్నారు. ఎన్నికలు అంటే ఓటర్లతో వారి మనోభావాలతో ముడి పడి ఉంటాయి. ఓటర్లు ఎపుడూ విలక్షణంగా ఆలోచిస్తారు, తీర్పు అలాగే ఉంటుంది. ఓటర్ల తీర్పుని కొన్ని సార్లు అధికారంలో ఉన్న వారు ఏకగ్రీవాల పేరుతో వేరే విధంగా బయటకు రానీయకపోవచ్చు. కానీ అసలు ఎన్నికల్లో వారు తమ గొంతు విప్పితే అపుడు వచ్చే రిజల్ట్ వేరేగా ఉంటుంది. అందువల్ల ప్రజాస్వామ్యంలో ఎన్నికలు ఎంత సాఫీగా సజావుగా జరిగితే అధికారంలో ఉన్న వారికి పాలకులకే అంత ఉపయోగం. తప్పులు తెలుసుకుని సరిదిద్దుకోవడానికి చాన్స్ ఉంటుంది. అలా కాదని మెహర్బానీ కోసం ఏకగ్రీవ పాట పాడితే ఆ తరువాత ఇబ్బందులు తప్పవు. నిన్న జగన్ కి అదే బ్యాడ్ రిజల్ట్ వచ్చింది. టీడీపీ ఈ విషయంలో జాగ్రత్తలు వహించకపోతే ఇబ్బందులే అని అంటున్నారు.
