Begin typing your search above and press return to search.

జ‌గ‌న్ వ‌ర్సెస్ చంద్ర‌బాబు: ఈ తేడా గ‌మ‌నించారా ..!

దీనిలో ప్రధానంగా గత ఎన్నికలకు ముందు జగన్ కొన్ని కొన్ని హామీలను ఇచ్చేందుకు వెనకాడారు. వెనకంజ‌ వేశారు.

By:  Garuda Media   |   14 Oct 2025 12:00 PM IST
జ‌గ‌న్ వ‌ర్సెస్ చంద్ర‌బాబు:  ఈ తేడా గ‌మ‌నించారా ..!
X

జగన్ వర్సెస్ చంద్రబాబు అనే మాట త‌ర‌చుగా వినిపిస్తోంది. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా సహజంగానే ప్రధాన పార్టీల‌లో నాయకులు, ప్రధాన‌ పార్టీల అధినేతల మధ్య ఉన్న పోలికను, లేకపోతే వారి మధ్య ఉన్న తేడాను కూడా ప్రజలు చర్చిస్తూ ఉంటారు. మీడియాలోనూ చర్చలు వస్తూ ఉంటాయి. దానికి భిన్నంగా గడిచిన 15 మాసాల్లో చంద్రబాబు అమలు చేసిన పథకాలు, ఆయన ఇచ్చిన వాగ్దానాలు ప్రజలకు చేరువవుతున్న తీరు వంటివి గమనిస్తున్న కొంతమంది విశ్లేషకులు జగన్‌కు చంద్రబాబుకి మధ్య తేడా గమనించారా అంటూ ఆసక్తికర విశ్లేషణలు చేస్తున్నారు.

దీనిలో ప్రధానంగా గత ఎన్నికలకు ముందు జగన్ కొన్ని కొన్ని హామీలను ఇచ్చేందుకు వెనకాడారు. వెనకంజ‌ వేశారు. తాను చేయలేని కూడా చెప్పారు. కానీ, అవే హామీలను టిడిపి అధినేత గా ఆరోజు చంద్రబాబు ప్రజలకు హామీలు ఇచ్చారు. వీటిలో ముఖ్యంగా ఆర్టీసీలో మహిళలకు ఉచిత ప్రయాణం కీలకంగా ఉంది. దీనివల్ల నెలకు 250 నుంచి 350 కోట్ల వరకు రాష్ట్ర ప్రభుత్వం పై భారం పడుతుంది. అప్పట్లో జగన్ ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ అలా చేయలేరని, దీని వల్ల ఆర్టీసీ దివాలా తీస్తుందని చెప్పుకొచ్చారు.

కానీ గడిచిన ఆగస్టు 15 తారీకు నుంచి అమ‌ల‌వుతున్న ఈ పథకం ద్వారా ఎక్కడా ఆర్టీసీకి ఇబ్బందులు అయితే వచ్చిన పరిస్థితి లేదు. ఆ పథకాన్ని మహిళలు కూడా సద్వినియోగం చేసుకుంటున్నారు. సో ఈ విషయంలో జగన్ వెనకబడ్డారని చెబుతున్నారు విశ్లేషకులు. ఇక‌, రెండోది డీఎస్సీ నియామకాలు. వైసీపీ హయంలో ఒక టీచర్ ఉద్యోగాన్ని కూడా భర్తీ చేయకపోగా ఉన్నవారిని వాలంటీరీ రిటైర్మెంట్ చేయాలని లేదా స్వచ్చందంగా ఉద్యోగాలు వదిలేయాలని వ‌త్తిడి చేశారన్న వార్తలు వచ్చాయి.

కానీ ప్రస్తుతం కూటమి ప్రభుత్వం వచ్చిన 15 మాసాల్లోనే 16,347 డిఎస్సీ ఉద్యోగాలతో నోటిఫికేషన్ ఇవ్వడం వాటిని భర్తీ చేయడం కనిపిస్తోంది. తాజాగా సోమవారం 15,500 కొత్త టీచర్లు విధుల్లో కూడా చేరారు. ఈ విషయంలోను వైసీపీ అధినేత జగన్ మైనస్ అయ్యారు అనేది విశ్లేషకులు చెబుతున్న మాట. ఇక ఎంతో ప్రతిష్టాత్మకంగా జగన్ అమలు చేసిన అమ్మఒడి పథకం విషయంలో కూడా ఆయనను చంద్రబాబు బీట్ చేశారని విశ్లేషకులు స్పష్టం చేస్తున్నారు.

గతంలో కేవలం ఒక కుటుంబంలో ఒక పిల్లాడికి మాత్రమే జగన్ అమ్మవ‌డి కింద 13 వేల రూపాయలు ఇవ్వగా ప్రస్తుతం చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి 13 వేల రూపాయలు చొప్పున అందించారు. ఇప్పటికీ కొన్ని కొన్ని జిల్లాల్లో ఈ పథకం కింద అర్హులై అందని వారికి కూడా నిధులు జమ చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. దీంతో ఈ మూడు కీలక అంశాల్లో చంద్రబాబు సక్సెస్ కాగా జగన్ వెనుకబడ్డారు అనేది ఒక రకంగా సక్సెస్ కాలేకపోయారనేది విశ్లేషకులు చెబుతున్న మాట.

ఈ పరిణామాల క్రమంలో వైసిపి మరోసారి ఆలోచన చేసుకోవాలి. వచ్చే ఎన్నికలనాటికి పరిస్థితి ఇంకా భిన్నంగా ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ మేరకు పార్టీ వ్యూహాత్మకంగా ముందుకు సాగాల‌ని పరిశీల‌కులు చెబుతున్నారు.