Begin typing your search above and press return to search.

నిన్న నెల్లూరు...నేడు చిత్తూరు...జగన్ కే ఎందుకిలా ?

అయితే చివరి నిముషంలో జగన్ టూర్ రద్దు కావాల్సి వచ్చింది. దానికి కారణం జగన్ హెలికాప్టర్ ని సేఫ్ గా ల్యాండ్ చేయడానికి అవసరం అయిన మైదానాన్ని చూపించలేకపోయారు అని వైసీపీ నేతలు చెబుతున్నారు.

By:  Tupaki Desk   |   4 July 2025 9:16 PM IST
నిన్న నెల్లూరు...నేడు చిత్తూరు...జగన్ కే ఎందుకిలా ?
X

వైసీపీ అధినేత అయిదేళ్ల అధికారమే ఇపుడు ఆయన ప్రతిపక్ష పాత్రకు ప్రతి బంధం అవుతోందా అన్న చర్చ అయితే వస్తోంది. ఏకంగా మూడు దశాబ్దాల పాటు తామే అధికారంలో ఉంటామని అతి ధీమాకు పోయిన వైసీపీ టీడీపీకి తమ ఏలుబడిలో ఇబ్బందులు పెట్టింది. అలా టీడీపీకి ఏమి చేయవచ్చో చెప్పింది. నిజానికి టీడీపీకి ఇలాంటివి తెలియక కాదు.

జనామోదం వీటికి ఉండదు అన్న ఆలోచనతోనే 2014 నుంచి 2019 దాకా జగన్ ని వ్యూహాత్మకంగానే కట్టడి చేస్తూ వచ్చింది. అంతే తప్ప ఆయన పర్యటనలకు ఎక్కడా అభ్యంతరం కానీ అడ్డు కానీ చెప్పలేదు. అయితే వైసీపీ అధికారంలో ఉన్నపుడు విపక్షాలను వీలైనంతగా కట్టడి చేయడం చేస్తూ వచ్చింది. దానికి టిట్ ఫర్ టాట్ అన్నట్లుగా తామూ చేస్తున్నామని చెప్పుకోవడానికి ఇపుడు కూటమికి అవకాశం వచ్చింది.

ఇక వైసీపీ నేతలను తీసుకెళ్ళి జైళ్లలో వేసినా అలాగే జగన్ పర్యటనలకు షరతులు పెడుతున్నా అవన్నీ కూడా చట్టబద్ధంగానే ఉండేలా కూటమి చూసుకుంటోంది. తాతకు దగ్గులు నేర్పించినట్లుగా వైసీపీ తమ ఏలుబడిలో చేసినవే ఇపుడు శాపాలుగా మారుతున్నాయని అంటున్నారు. ఇక నెల్లూరు విషయం తీసుకుంటే ఆ జిల్లా పర్యటనకు వైసీపీ అధినేత మాజీ సీఎం జగన్ ఈ నెల 3న వెళ్ళాలనుకున్నారు. అక్కడ సబ్ జైలులో రిమాండ్ లో ఉన్న మాజీ మంత్రి వైసీపీ సీనియర్ నేత కాకాణి గోవర్ధన్ రెడ్డిని పరామర్శించేందుకు జగన్ వెళ్లాలనుకున్నారు.

అయితే చివరి నిముషంలో జగన్ టూర్ రద్దు కావాల్సి వచ్చింది. దానికి కారణం జగన్ హెలికాప్టర్ ని సేఫ్ గా ల్యాండ్ చేయడానికి అవసరం అయిన మైదానాన్ని చూపించలేకపోయారు అని వైసీపీ నేతలు చెబుతున్నారు. దాని మీద వైసీపీ నేతలు కోర్టుకు వెళ్లారు. దాంతో జగన్ నెల్లూరు టూర్ ఎపుడో ఏమిటో తెలియకుండా పోయింది.

సరే దాని సంగతి అలా ఉంచి చిత్తూరు జిల్లాలో మామిడి రైతులను పరామర్శించడానికి జగన్ ఈ నెల 9న అక్కడికి వెళ్లాలనుకున్నారు ఈ మేరకు పార్టీ షెడ్యూల్ ఖరారు చేసింది. అయితే జగన్ ఈ నెల 9న టూర్ కి జిల్లా యంత్రాంగం అనుమతి నిరాకరించింది అని వార్తలు వస్తున్నాయి. ఎందుకు అంటే ఈ నెల 10న చంద్రబాబు అన్నమయ్య జిల్లా పర్యటన ఉందని అందువల్ల పోలీసులు అంతా సీఎం పర్యటనలో ఉంటారని, జగన్ కి అవసరమైన బందోబస్తు చేయడం కష్టమవుతుందని భావించి ఆయన టూర్ డేట్ ని మార్చుకోమని ఆ పార్టీ పెద్దలకు చెప్పారని అంటున్నారు.

ఈ నెల 10 తరువాత మరో డేట్ చూసుకుని వస్తే అనుమతి విషయం పరిశీలిస్తామని అంటున్నారు. దీంతో జగన్ చిత్తూరు టూర్ కూడా వాయిదా పడే చాన్స్ ఉంది. దీంతో జగన్ తాడేపల్లి నుంచి జిల్లాల టూర్లు చేసినపుడే ఇలా ఎందుకు జరుగుతోంది అన్న చర్చకు తెర లేస్తోంది. జగన్ జిల్లాల టూర్లు చేయాలని అనుకున్నారు. ఆయన జూన్ నెలలో వరుసగా తెనాలి, పొదిలి, రెంట పాళ్ళ పర్యటనలు చేపట్టి రాజకీయ కాక రగిలించారు. అదే సమయంలో వైసీపీలో ఉత్సాహాన్ని తీసుకుని రాగలిగారు.

అయితే ఆ టూర్లలో వివాదాలు కోరి వచ్చాయా లేక యధాలాపంగా జరిగాయా తెలియదు కానీ జగన్ తరువాత పర్యటనలకు మాత్రం అనూహ్యంగా ఇబ్బందులు ఎదురవుతున్నాయి. జగన్ ఏ జిల్లాకు వెళ్ళాలనుకుంటే అక్కడ ఏదో ఒక కారణం వల్ల ఆయన అనుకున్న ప్రకారం టూర్ జరగకపోగా డేట్లు మారుతోంది. గతంలో ఎపుడూ జగన్ కి ఇలా జరగలేదు ఐ వైసీపీలో చర్చ సాగుతోంది. జగన్ అనుకుంటే వెళ్ళి వచ్చేవారు.

ఇక 2014 నుంచి 2019 మధ్యలో చూస్తే జగన్ హ్యాపీగా పర్యటనలు చేస్తూ ఉండేవారు. ఆనాడు ఎంతో ఉదారంగా నాటి టీడీపీ ప్రభుత్వం ఆయన విషయంలో వ్యవహరించింది అని గుర్తు చేస్తున్నారు. అయితే 2019 నుంచి 2024 మధ్యలో జరిగిన పరిణామాల నేపథ్యంలో టీడీపీ వంటి అన్ని విధాలుగా రాటుదేలిన పార్టీని టార్గెట్ చేయడంతోనే ఇపుడు వాటి రిజల్ట్ ని వైసీపీ చవి చూస్తోందా అని అంటున్నారు. ఇదే తీరున సాగితే మాత్రం జగన్ జిల్లా టూర్లతో పాటు ఆయన మరో రెండేళ్లలో తలపెడుతున్న పాదయాత్ర విషయంలో కూడా ఏమి జరుగుతుంది అన్నది ఫ్యాన్ పార్టీలో హాట్ డిస్కషన్ గా మారింది. చూడాలి మరి అని అంతా అంటున్నారు.