Begin typing your search above and press return to search.

గ్లోబెల్స్ కే మెంటార్...జగన్ పొగిడారా ?

ఏపీ సీఎం చంద్రబాబు మీద సెటైర్లు పంచులు వేయడంలో జగన్ ని మించిన వారు లేరని అంటారు.

By:  Satya P   |   4 Dec 2025 10:00 PM IST
గ్లోబెల్స్ కే మెంటార్...జగన్ పొగిడారా ?
X

ఏపీ సీఎం చంద్రబాబు మీద సెటైర్లు పంచులు వేయడంలో జగన్ ని మించిన వారు లేరని అంటారు. నిజం చెప్పాలీ అంటే రాజకీయంగా బాబుని విమర్శించేది ఈ స్థాయిలో జగన్ తప్ప ఎవరూ ఉండరు కూడా. ఏపీలో ప్రధాన పార్టీలతో పొత్తులో బాబు ఉన్నారు. ఇక కాంగ్రెస్ వామపక్షాలు నామమాత్రంగా ఉన్నాయి. ఆ పార్టీ నాయకులు అపుడపుడు ఒకటీ అరా బాబు మీద కామెంట్స్ చేస్తూ ఉంటారు. దాంతో బాబుని గట్టిగా విమర్శించాలీ అంటే అది వైసీపీయే అని అంతా అనుకుంటారు. దానికి తగినట్లుగా జగన్ ప్రెస్ మీట్ ఎపుడు ఏర్పాటు చేసినా రొటీన్ విమర్శలతో పాటు కొన్ని కొత్తవి కూడా జత చేసి మరీ బాబుని టార్గెట్ చేస్తూ ఉంటారు. తాజాగా చూస్తే గురువారం తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో జగన్ మీడియా మీట్ ఏర్పాటు చేసి చంద్రబాబు పాలన మీద నిప్పులే చెరిగారు.

బాబు ఆయనకే టీచర్ :

అప్పట్లో హిట్లర్ కి గ్లోబెల్స్ అనే ఒక మంత్రి ఉండేవారు, ఆయన కమ్యునికేషన్స్ శాఖను చూశారు. గ్లోబెల్ ని అబద్ధాలు వండి వారుస్తారు అని ప్రపంచం అంతా అనుకుంటుంది. కానీ గ్లోబెల్స్ కే పాఠాలు చెప్పేవారు ఉన్నారని మరచిపోతున్నారు అని జగన్ చురకలు అంటించారు. గ్లోబెల్స్ కే బాబు మెంటార్ గా మారారు అని సెటైర్లు వేశారు. ఆయన సూపర్ సిక్స్ సూపర్ హిట్ అని ఊదరగొట్టారు, కానీ నిజంగా ఏ ఒక్క హామీని నెరవేర్చలేదని అన్నారు. అసలు కూటమి పాలనలో ఏ ఒక్క పధకం కూడా సక్రమంగా అమలు చేసినది అయితే లేనే లేదని కూడా ఆయన మండిపడ్డారు.

హామీలు ఏమయ్యాయి :

కూటమి నేతలు ఎన్నికల్లో గెలవడం కోసం అలవి కానీ హామీలు ఇచ్చారు అని ఇపుడు వాటిని ఏ మాత్రం నెరవేర్చడం లేదని జగన్ మండిపడ్డారు. కూటమి పాలనలో అన్ని వర్గాలు ఇబ్బందులు పడుతున్నాయని ముఖ్యంగా వ్యవసాయ రంగం కుదేల్ అయిపోయి రైతన్నలు అవస్థలు పడుతున్నారు అని జగన్ అన్నారు. వ్యవసాయం పండుగగా తమ ప్రభుత్వంలో ఉంటే దండుగ అన్నట్లుగా కూటమి పెద్దలు వ్యవహరిస్తున్నారు అని ఫలితంగా అరటి రైతులు మామిడి రైతులతో సహా మొత్తం పంటలు పండించే వారు తీవ్ర నష్టాలలో కష్టాల్లో ఉన్నారని జగన్ ఫైర్ అయ్యారు. మహిళల ఖాతాలో నెలకు 1500 రూపాయలు ఇస్తున్నానా అని ప్రశ్నించారు ఏడాది మూడు ఉచిత గ్యాస్ సిలిండర్లు ఏమయ్యాయని గద్దించారు. అలాగే అనేక కండిషన్లతో ఉచిత బస్సుని అమలు చేస్తున్నారని నిందించారు.

బాబుని అలా పిలవాలి :

ఇలా బాబు గురించి ఎన్నో విమర్శలు చేసిన జగన్ ప్రపంచ ఖ్యాతి గడించిన గ్లోబెల్స్ మంత్రి కంటే బాబు ఎన్నో రెట్లు గొప్పవాడు ఆయనకే టీచర్ అని చెప్పడం ద్వారా పొగిడారా లేక తెగిడారా అంటే వెరీ సింపుల్ ఆన్సర్. జగన్ ఎపుడైనా బాబుని పొగుడుతారా. సో గ్లోబెల్స్ కంటే వీళ్లు చేస్తున్న ప్రచారానికి గోబెల్స్ ఎక్కడికో పోవాలి, గోబెల్స్ పేరుకు బదులు ఇక మీదట చంద్రబాబు పేరు చెప్పాలి అని జగన్ అంటున్నారు. గ్లోబెల్స్ కూడా బాబు నుంచి ఎంతో నేర్చుకోవాలని అంటున్నారు. బాబు ని గ్లోబెల్స్ తో చెప్పి అబద్దాలు ఆడుతున్నారని జగన్ గట్టిగా చెబుతున్నారు. మరి దీని మీద టీడీపీ రియాక్షన్ ఏమిటో చూడాల్సి ఉంది.