Begin typing your search above and press return to search.

కూటమి లీడర్స్ నా ఇన్వెస్టర్స్ నా...జగన్ కి ఎవరు భయపడుతున్నారు ?

అంతే కాదు గ్రౌండ్ లెవెల్ లో వైసీపీ వారితో కలిసి బిజినెస్ లు కూడా చాలా మంది చేసుకుంటున్నారు అని అంటున్నారు.

By:  Tupaki Desk   |   18 Jun 2025 3:02 PM IST
కూటమి లీడర్స్ నా ఇన్వెస్టర్స్ నా...జగన్ కి ఎవరు భయపడుతున్నారు ?
X

ఏపీలో జగన్ గురించి ఎవరు భయపడుతున్నారు అన్నది చర్చగా ఉంది. జగన్ 2019 నుంచి 2024 మధ్యలో సీఎం గా చేశారు. ఆయన హయాంలో మూడు రాజధానుల నినాదం అందుకున్నారు. అయితే ఆ నినాదం బూమరాంగ్ అయింది, దాంతో టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చింది. ఇపుడు అమరావతి ఏకైక రాజధానిగా చురుకుగా పనులు సాగుతున్నాయి.

అయితే జగన్ మళ్ళీ వస్తే అన్న చర్చ ఉందని కూటమి నేతలు అంటున్నారు. అధికారంలోకి వచ్చిన కొత్తలో అయితే ముఖ్యమంత్రి చంద్రబాబు ఏపీకి పెట్టుబడులు పెట్టడానికి చాలా మంది ఆసక్తిగా ఉన్నారు కానీ మళ్ళీ జగన్ వస్తేనో అన్న సందేహం వెలిబుచ్చుతున్నారని చెప్పేవారు. అయితే జగన్ అనే రాజకీయ భూతాన్ని తాను శాశ్వతంగా బంధించాను అని బాబు అంటున్నారు.

విశాఖలో జరిగిన టీడీపీ కార్యకర్తల సమావేశంలో చంద్రబాబు ఇదే మాట చెప్పారు. జగన్ గురించి ఎవరూ భయపడాల్సింది లేదని ఆయన అన్నారు. జగన్ ఇక మళ్ళీ అధికారంలోకి రాడని కూడా ఆయన చెప్పుకొచ్చారు. అయితే జగన్ విషయంలో నిజంగా ఇన్వెస్టర్లు భయపడుతున్నారా లేక కూటమి నేతలు భయపడుతున్నారా అన్న కొత్త చర్చకు తెర లేస్తోంది.

నిజానికి చూస్తే ఏపీలో ఒక విచిత్రమైన పరిస్థితి కనిపిస్తోంది. ఏపీని డెవలప్మెంట్ చేద్దామని కొంతమంది పెట్టుబడిదారులు వస్తున్నారు అని అయితే జగన్ మళ్ళీ ఏపీకి సీఎం అయితే తమ పరిస్థితి ఏంటని వారు చంద్రబాబుని అడుగుతున్నారుట. ఇదే విషయం చంద్రబాబు పదే పదే చెబుతున్నారు. లేటెస్ట్ గా మళ్ళీ అదే చెప్పారు.

ఇక జగన్ విషయం తీసుకుంటే ఏపీ రాజధాని విషయంలో వైసీపీ స్టాండ్ ఏంటి అన్నది ఇంకా చెప్పడం లేదని కూడా చర్చగా ఉంది. ఒకవేళ అమరావతిని చంద్రబాబు బాగా అభివృద్ధి చేస్తే కనుక మళ్లీ జగన్ అధికారంలోకి వస్తే ఆయన ఏపీకి రాజధాని అమరావతి కాకుండా వైజాగ్ అంటే తమ పరిస్థితి ఏంటని ఇన్వెస్టర్లు చంద్రబాబుని అడుగుతున్నారుట.

మరో వైపు చూస్తే కింది స్థాయిలో ఉన్న టీడీపీ కూటమి నేతలు అయితే దూకుడు పెద్దగా చేయడం లేదు, రాజకీయంగా వారు రెచ్చిపోవడం లేదు అని అంటున్నారు. ఎందుకంటే రేపు ఒకవేళ జగన్ వస్తే తమ పరిస్థితి ఏమిటి అన్నది ఒక అంచనా వేసుకునే వారు మిన్నకుంటున్నారు అని అంటున్నారు.

అంతే కాదు ఈ మధ్య జగన్ ఒక మాట గట్టిగానే చెబుతున్నారు. కూటమి ప్రభుత్వంలో వైసీపీ నేతలు కానీ క్యాడర్ కానీ వేధింపులకు గురి అయితే మీకు నచ్చిన బుక్ లో బాధలు పెట్టిన వారి పేర్లను రాసుకుని ఉంచుకోండి అని సూచించారు. రేపటి రోజున వైసీపీ ప్రభుత్వం వస్తే కనుక కచ్చితంగా వారి మీద చర్యలు ఉంటాయని వారు ఏ దేశంలో ఉన్నా ఎక్కడ ఉన్నా తెచ్చి మరీ చేయాల్సింది చేస్తామని జగన్ సీరియస్ గానే వార్నింగ్ ఇచ్చారు.

ఇలా జగన్ బిగ్ సౌండ్ చేసేసరికి కింది స్థాయిలో ఉన్న కూటమి నేతలు కానీ క్యాడర్ కానీ ఎందుకొచ్చిన బాధ అని కాస్తా నిదానించారు అని అంటున్నారు. ఎందుకంటే రాజకీయం ఎపుడూ ఒకేలా ఉండదని అంటున్నారు. రేపటి రోజున జగన్ కనుక వస్తే తమ పరిస్థితి ఏంటని వారు ఆందోళనతోనే ముందు జాగ్రత్తగా తగ్గుతున్నారని అంటున్నారు.

అంతే కాదు గ్రౌండ్ లెవెల్ లో వైసీపీ వారితో కలిసి బిజినెస్ లు కూడా చాలా మంది చేసుకుంటున్నారు అని అంటున్నారు. ఈ విధంగా కలిసి ఉంటే కలదు సుఖం అన్న నీతిని బాగా ఫాలో అవుతూ బాగానే వ్యాపారాలు చేసుకుంటున్నారు అని అంటున్నారు.

మరీ పై నుంచి గట్టిగా వస్తే తప్ప ఏవో కొన్ని సంఘటనలు తప్పించి దిగువ స్థాయిలో అయితే కూటమి నేతలు దేనికీ పెద్దగా రియాక్ట్ కావడం లేదు అని అంటున్నారు. మొత్తానికి చూస్తే జగన్ చేస్తున్న హెచ్చరికలు బాగానే పనిచేస్తున్నాయని అంటున్నారు. జగన్ దెబ్బకు భయపడుతున్నట్లుగానే గ్రౌండ్ లెవెల్ లో పరిస్థితి ఉందని అంటున్నారు.

దీంతో ఇవన్నీ చూసిన మీదటనే చంద్రబాబు విశాఖలో జరిగిన కార్యకర్తల సమావేశంలో టీడీపీ ఎప్పటికీ ఓడిపోదు అని ఒక భారీ ప్రకటన చేసారు. జగన్ అనే రాజకీయ భూతాన్ని బంధించామని ఎవరికీ ఆ సమస్య అన్నది లేనే లేదని చెప్పారు. అయితే సీఎం బాబు ఎంత చెప్పినా కూడా క్యాడర్ మాత్రం వాస్తవాలు గ్రహించి దానికి తగినట్లుగా తెలివిడిగానే వ్యవహరిస్తోంది అని అంటున్నారు.

దీంతో జగన్ అంటే కూటమి నేతలకు భయం పట్టుకుందా ఇన్వెస్టర్లు పేరు బయటకు చెబుతున్నా అసలు వాస్తవాలు రాజకీయ కారణాలేనా అన్న చర్చ సాగుతోంది. సో టోటల్ గా చూస్తే రాజకీయాలు పూర్వం మాదిరిగా లేవు. అందుకే ఇపుడు ఎవరికి వారు తమ క్షేమం చూసుకుంటున్నారు అని అంటున్నారు. అదన్న మాట మ్యాటర్.