Begin typing your search above and press return to search.

జగన్ పార్టీ వారసత్వం ఆమెకు ?

అందువల్ల జగన్ రాజకీయ వారసత్వం అన్న మాటకు ఇప్పటికైతే అర్ధం లేదనే అనుకోవాలి. కానీ సోషల్ మీడియాలో చూస్తే అవన్నీ కలిపి మరీ కూడి కొత్త రాజకీయ లెక్కలతో చర్చకు పెడుతున్నారు.

By:  Satya P   |   17 Aug 2025 6:00 AM IST
జగన్ పార్టీ వారసత్వం ఆమెకు ?
X

సోషల్ మీడియాలో డిస్కషన్ చూస్తే కాదేదీ అనర్హం అన్న ముతక సామెత గుర్తుకు వస్తుంది. అంతే కాదు ఆలూ లేదు చూలూ లేదు అన్న మరో సామెత కూడా తప్పక తలచుకోవాల్సిందే. సోషల్ మీడియాలో కొన్ని చర్చలు ఎలా వస్తాయో లేక వాటి వెనక వాస్తవాలు ఏమిటో ఊహాగానాలు ఏమిటో తెలియదు కానీ భలేగా చర్చలు మొదలవుతూంటాయి. అలాంటి చర్చే ఇపుడు మరొకటి జగన్ విషయంలో జరుగుతోంది. జగన్ వైసీపీకి సర్వ సత్తాక అధ్యక్షుడు. ఆయన గట్టిగా చూస్తే యాభై మూడేళ్ళ వయసులో ఉన్నారు. రాజకీయంగా ఇది చిన్న వయసుగానే చూస్తారు.

అవన్నీ కలిపేసి అలా :

అందువల్ల జగన్ రాజకీయ వారసత్వం అన్న మాటకు ఇప్పటికైతే అర్ధం లేదనే అనుకోవాలి. కానీ సోషల్ మీడియాలో చూస్తే అవన్నీ కలిపి మరీ కూడి కొత్త రాజకీయ లెక్కలతో చర్చకు పెడుతున్నారు జగన్ లిక్కర్ స్కాం లో అరెస్టు అవుతారని ఆయనతో పాటు సతీమణి కూడా ఇబ్బందులు పడతారని అపుడు వైసీపీని నడిపించేందుకు ఆయన పెద్ద కుమార్తె రంగంలోకి దిగుతారని అంటూ ప్రచారం సాగుతోంది. ఇందులో నిజాలు కంటే ఊహాగానాలే ఎక్కువ అన్నది అందరికీ తెలిసిసినా ఈ డిస్కషన్ మాత్రం ఎక్కడా ఆగడం లేదు అని అంటున్నారు.

అన్ని చోట్ల ఉన్నదే :

అయితే రాజకీయాల్లో చూసినపుడు ఏది అయినా సాధ్యం కాదు అని అనుకోవడానికి అయితే లేదు. కాస్తా ముందూ వెనకా తప్ప అని అంటారు. అలా చూస్తే భారతదేశ రాజకీయాల్లో చాలా మంది తమ సొంత వారిని రాజకీయాల్లో దింపడమూ చూశారు. ఇక జగన్ కూడా తండ్రి వారసత్వాన్ని తీసుకునే ముందుకు వచ్చారు. ఇపుడు ఆయనకు ఇద్దరూ కుమార్తెలు కాట్టి వారు కూడా రాజకీయాల్లోకి రావచ్చు అన్నదే చర్చ. జగన్ అరెస్టు అయితే పార్టీని నడిపేందుకు ఒక సారధిగా కుమార్తె వస్తారు అని రాజకీయ జోస్యాలు చెబుతున్నారు.

అది జరిగేనా :

అయితే లిక్కర్ స్కాం లో జగన్ అరెస్టు అవడం ఎంతవరకూ అన్నది ఒక చర్చ. ఇక ఆయన సతీమణి కూడా ఇబ్బందులో పడతారు అన్నది కూడా ఒక ఊహా జనితమైన విషయమే. అని అంటున్నారు ఒక వేళ జగన్ అరెస్టు అయినా రెండు మూడు నెలలు ఉన్నా పార్టీకి వచ్చిన ఇబ్బంది ఏమీ లేదని పార్టీ ఇపుడు గ్రౌండ్ లెవెల్ దాకా విస్తరించి ఉందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. అందువల్ల వేరే వారు సారధ్యం వహించడం అన్నది అవసరం లేదని అంటున్నారు. ఒకవేళ జగన్ ని అరెస్టు చేసి ఎక్కువ కాలం ఉంచినపుడు ఏమైనా పార్టీకి సారధి అవసరం ఉండొచ్చేమో అని అంటున్నారు.

హాట్ టాపిక్ గానే :

మొత్తం మీద రాజకీయాలు అంటే పూర్వం మాదిరిగా లేవు. వారిని వీరిని కూడా తెచ్చేసి చర్చలు పెడుతున్నారు. అలా ఎక్కడో లండన్ లో ఉంటూ చదువుకుంటున్న జగన్ కుమార్తెలను కూడా లాగేస్తున్నారు అని వైసీపీ నేతలు అంటున్నారు. రాజకీయ పార్టీలకు కూడా తట్టని ఆలోచనలు వ్యూహాలూ సోషల్ మీడియాలో చాలా మందికి తడుతున్నాయని వైరల్ చేయడం కోసమే ఇదంతా అని అంటున్నారు. మొత్తం మీద చూస్తే ఎవరేమి అనుకున్నా జగన్ వైసీపీ పార్టీ వారసత్వం ఆయన కుమార్తె సారధ్యం ఇవన్నీ కూడా మంచి కాలక్షేపంగానే ఉన్నాయి. ఆసక్తికరమైన రాజకీయ కధనాలుగానూ ఉన్నాయని అంటున్నారు.