Begin typing your search above and press return to search.

జగన్ జైలుకు వెళ్తే ఏపీకి వరదలా పారుతాయట !

జగన్ జైలు ఈ విషయం ఏపీలో ఇపుడు హాట్ టాపిక్ గా ఉంది జగన్ ఎపుడు జైలుకు వెళ్తారు అన్నది సోషల్ మీడియాలో బిగ్ డిబేట్ గా మారింది.

By:  Tupaki Desk   |   21 May 2025 5:28 PM
జగన్ జైలుకు వెళ్తే ఏపీకి వరదలా పారుతాయట !
X

జగన్ జైలు ఈ విషయం ఏపీలో ఇపుడు హాట్ టాపిక్ గా ఉంది జగన్ ఎపుడు జైలుకు వెళ్తారు అన్నది సోషల్ మీడియాలో బిగ్ డిబేట్ గా మారింది. కొన్ని వెబ్ చానల్స్ అయితే జగన్ జైలుకు వెళ్తారా లేదా అని సర్వే కూడా నిర్వహిస్తున్నాయి అంటే జగన్ అరెస్ట్ జైలు ఏపీలో ఎంతటి వేడెక్కించే అంశంగా ఉందో అర్ధం అవుతోంది.

ఇక జగన్ ఎందుకు జైలుకు వెళ్తారు అంటే లిక్కర్ స్కాం లో జగన్ కి సంబంధం ఉందని ఏకంగా అది ఒక నాలుగు వేల కోట్లకు పైగా ఉందని ఆ మొత్తంలో పాత్రధారులూ సూత్రధారులూ ఇలా అన్ని కోణాలలో సిట్ దర్యాప్తు చేస్తోందని అంటున్నారు. దాంతో వరసబెట్టి పెద్ద తలకాయలు అన్నీ అరెస్ట్ అయ్యాక ఇక మిగిలింది జగన్ కాబట్టి ఆయన జైలుకు వెళ్ళడం ఖాయమని అంటున్నారు.

వైసీపీలో అయితే ఇది కూటమి ప్రతీకార రాజకీయం తప్ప మరోటి కాదని అంటే కూటమి నేతల నుంచి వస్తున్న ఆన్సర్ చూస్తే ఇది న్యాయం ధర్మం అని వస్తోంది. తప్పు చేసిన వారు చట్ట ప్రకారం శిక్షార్హులే అని కూటమి నేతలు సమర్ధిస్తున్నారు ఇవన్నీ ఒక ఎత్తు అయితే జగన్ జైలుకు వెళ్తే సానుభూతి రాదు అని ఒక టీడీపీ ఎమ్మెల్యే అంటే జగన్ జైలుకు వెళ్తేనే ఏపీకి భవిష్యత్తు అని మంత్రిగా పనిచేసిన సీనియర్ మోస్ట్ టీడీపీ ఎమ్మెల్యే అంటున్నారు.

ఆయనే చిలకలూరిపేట ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు. ఆయన తాజాగా మాట్లాడుతూ జగన్ గురించి సంచలన వ్యాఖ్యలే చేశారు. జగన్ జైలుకు వెళ్తే ఏపీకి పెట్టుబడులు వరదలా వస్తాయని అన్నారు జగన్ జైలుకు వెళ్తేనే ఏపీ అభివృద్ధి జరుగుతుంది అన్నారు. మరో అడుగు ముందుకేసి ఆయన ఒకే మాట అన్నారు. జగన్ జైలుకు వెళ్ళాలని ఏపీ బాగుపడాలని ప్రతీ ఒక్కరూ కోరుకుంటున్నారు అని అన్నారు.

జగన్ అయిదేళ్ళ పాలనలో టీడీపీ బీజేపీ జనసేన నేతలను భయభ్రాంతులకు గురి చేశారని కూడా ప్రత్తిపాటి పుల్లారావు ఆరోపణలు చేశారు. తాము ఇపుడు కూటమి నేతలను పదిలంగా కాపాడుకుంటున్నామని అన్నారు. పనిలో పనిగా తన ప్రత్యర్ధి వైసీపీకి చెందిన మాజీ ఎమ్మెల్యే విడదల రజనీ ఓటమి భయంతోనే చిలకలూరిపేట నుంచి వేరే చోటకు వెళ్ళి పోటీ చేశారు అన్నారు. ఆమె కనుక 2024లో చిలకలూరిపేట లో పోటీ చేసి ఉంటే టీడీపీ మెజారిటీ లక్షలలో ఉండేదని కూడా అన్నారు.

ఇవన్నీ ఒక ఎత్తు అయితే జగన్ జైలుకు వెళ్ళాలని ప్రత్తిపాటి కోరుకుంటున్నారు. అది జనాభీష్టం అంటున్నారు. ఏ కేసులో జగన్ జైలుకు వెళ్తారో ఆయన చెప్పలేదు, అంతకు ముందే జగన్ బెయిల్ రద్దు కావాలని ప్రస్తుత డిప్యూటీ స్పీకర్ రఘురామ క్రిష్ణం రాజు కోర్టుకు వెళ్ళారు. జగన్ మీద 11 చార్జిషీట్లతో సీబీఐ కేసు విచారణ దశలో ఉంది. మరి ఇపుడు కొత్తగా కేసులు ఏమైనా పెడతారా లేక సీబీఐ కేసు ఒక కొలిక్కి వచ్చి జగన్ కి జైలు జీవితం ప్రాప్తిస్తుందా అన్నది కూడా టీడీపీ నేతలు చెప్పడం లేదు.

అయితే జగన్ జైలుకి వెళ్ళాలని ప్రత్తిపాటి అంటున్నారు. ఒక వేళ ఏ కారణం చేత అయినా జగన్ జైలుకు వెళ్ళకపోయినా లేక జైలుకు వెళ్ళి బెయిల్ మీద బయటకు వచ్చినా ఏపీ అభివృద్ధి ఆగిపోతుంది అని ఆయన చెప్పదలచారా అన్నది కూడా చర్చగా ఉంది. ఏది ఏమైనా ప్రత్తిపాటి నోటి నుంచి వచ్చిన ఈ పొలిటికల్ డైలాగ్స్ మాత్రం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.